కొద్ది రోజుల్లో కావ్య మారిన్‌తో పెళ్లి.. షాక్‌ ఇచ్చిన అనిరుధ్‌? | Anirudh Ravichander Exits Shah Rukh Khan King Film Music | Sakshi
Sakshi News home page

Anirudh Ravichander : పెళ్లికి ముందు ​‘కింగ్‌​’ కు షాక్‌ ఇచ్చిన అనిరుధ్..?

Oct 31 2026 8:14 PM | Updated on Oct 31 2026 8:40 PM

Anirudh Ravichander Exits Shah Rukh Khan King Film Music

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ మరో పదిరోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, కళానిధి మారన్ వారసురాలు కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే చెన్నైలో పెళ్లి సందడి మొదలైపోయింది. అయితే ఇప్పుడు అనిరుధ్‌కి సంబంధించిన ఓవార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

కింగ్ మూవీ నుంచి..
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ నటిస్తోన్న కింగ్ మూవీ నుంచి అనిరుధ్ రవిచందర్ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయన స్థానంలో సచిన్- జిగర్‌ జోడీలను తీసుకున్నట్లుగా టాక్. దక్షిణాదిలోని పలు చిత్రాల్లో బిజీగా ఉండటం, ఇతర కారణాలతో కింగ్ మూవీకి అవసరమైన సమయాన్ని, శ్రద్ధను కేటాయించడం అనిరుధ్‌కు కష్టంగా మారుతుండడంతో ఈ నిర్ణయానికి వచ్చారని టాక్‌. అయితే ఈ నిర్ణయం చిత్రబృందం తీసుకుందా? లేక అనిరుధ్‌ తీసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.

సినిమా విషయానికి వస్తే.. 
కాగా సినిమా విషయానికి వస్తే.. కింగ్ మూవీకి సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, రాఘవ్ జుయాల్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సి, సౌరభ్ శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. : రకుల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement