నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. త్వరలోనే వస్తా: రకుల్‌ | Rakul preet singh Spoke About Hyderabad In Ramayana Movie Promotions | Sakshi
Sakshi News home page

Rakul preet singh-Ramayana: నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. త్వరలోనే వస్తా: రకుల్‌

Oct 31 2026 6:59 PM | Updated on Oct 31 2026 7:12 PM

Rakul preet singh Spoke About Hyderabad In Ramayana Movie Promotions

రణ్‌బీర్ పూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ. ఈ మొదటి భాగాన్ని ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఇ‍ప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.  ఈ మూవీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈమూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రకుల్‌ హైదరాబాద్‌పై తనకున్న ప్రేమను చాటుకుంది. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవతున్నాయి.

(ఇదీ చదవండి: భార్య విడాకులిచ్చినా ప్రేమించాడు.. డైరెక్టర్‌ లవ్‌స్టోరీ..)

సినిమా చేయాలని నాకూ ఉంది
యాంకర్  సుమ 'నువ్వు హైదరాబాద్ అమ్మాయివే కదా!' అని పలకరించగా, రకుల్ వెంటనే స్పందించారు. ' అవును నిజమే.. నా హృదయం ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటుంది' అంటూ సమాధానమిచ్చారు. ‘కోవిడ్ వచ్చిన తరువాత ముంబై వెళ్లిపోయాను. ఆ తరువాత బాలీవుడ్‌లో బిజీగా ఉండిపోయా. ఈ అవకాశం కూడా అనుకోకుండా వచ్చింది.ప్లాన్‌ చేసింది కాదు. ఒకటి రెండేళ్ల నుంచి స్క్రిప్టులు చదువుతున్నాను. తెలుగులో సినిమా చేయాలని నాకూ ఉంది. త్వరలో ఇక్కడకి వస్తా సినిమా చేస్తా. నా మేనేజర్ ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఒకసారి అతన్ని అడగండి తెలుగు సినిమాలు ఎందుకు ఓకే అవ్వడం లేదో’ అని సరదాగా రకూల్‌ వెల్లడించారు. 

కాగా.. ఈ రామాయణ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీస్‌ను దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. మొదటి భాగం ఈ దీపావళి సందర్భంగా వచ్చే నెల 5న విడుదల కానుండగా.. రెండవ భాగం 2027 దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: అడ్వాన్స్‌ ఇచ్చి మరీ తీసేశారు:  ప్రకాశ్‌ రాజ్‌ సతీమణి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement