బిగ్‌బాస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. రైతుబిడ్డ ఎలిమినేట్‌..? | Bigg Boss 10 Telugu Promo And Double Elimination Update Jhansi Elimination | Sakshi
Sakshi News home page

Jhansi Elimination: సూపర్‌ పవర్‌తో మారిన లెక్కలు.. బిగ్‌బాస్‌లో మరో వికెట్‌?

Oct 31 2026 6:06 PM | Updated on Oct 31 2026 6:13 PM

Bigg Boss 10 Telugu Promo And Double Elimination Update Jhansi Elimination

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో ఎలిమినేషన్ల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగా కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌ జరుగుతుంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ప్రేక్షకుల ఓట్లతో పాటు హౌస్‌మేట్స్‌ ఓటింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఎలిమినేషన్‌ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ వారం కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ సుధీర్‌ను ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే అతడు ఇంకా హౌస్‌లోనే కొనసాగుతుండటానికి ముకేష్‌ కారణమనే చెప్పాలి.

ఝాన్సీ పవర్‌ను వదులుకునేలా
ముకేష్‌కు లభించిన సూపర్‌ పవర్‌ నేరుగా ఒకరిని సేవ్‌ చేసే అవకాశం ఇవ్వకపోయినా.. ఝాన్సీ దగ్గర ఉన్న సేవింగ్‌ పవర్‌ను తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో ముకేష్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి, సుధీర్‌ కోసం ఝాన్సీ తన పవర్‌ను వదులుకునేలా చేశాడు. ఆ పవర్‌ ఝాన్సీ దగ్గరే ఉండి ఉంటే.. ఎలిమినేషన్‌ నుంచి తనను తాను కాపాడుకోవడంతో పాటు మరో కంటెస్టెంట్‌ను కూడా సేవ్‌ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే.. ఈ వారం సడన్‌ ఎలిమినేషన్‌తో పాటు మరో ఎలిమినేషన్‌ కూడా ఉంటుందని ముందుగానే చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఝాన్సీ ఎలిమినేషన్‌ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు విడుదలైన ప్రోమోలో నాగార్జున ఆమె ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపించింది. స్టార్‌ పాయింట్స్‌ విషయంలోనూ ఝాన్సీకి అనుకూలమైన స్పందన రాలేదు.

 ఝాన్సీ ఎలిమినేషన్‌
మరోవైపు నరేశ్‌, రాంప్రసాద్‌ ఐదు స్టార్‌ పాయింట్స్‌ అందుకోగా.. స్టార్‌ పాయింట్స్‌ లేని కంటెస్టెంట్లలో ఝాన్సీ, సుధీర్‌, నీతూ మాస్టర్‌ ఉన్నట్లు ప్రోమోలో చూపించారు. దీంతో ఝాన్సీకి ఈ వారం గండం తప్పదా? ముకేష్‌ తీసుకున్న నిర్ణయం ఆమెకు శాపంగా మారిందా? అనే చర్చ మొదలైంది. అయితే ఝాన్సీ ఎలిమినేషన్‌పై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ఎపిసోడ్‌ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

(ఇదీ చదవండి: భార్య విడాకులిచ్చినా ప్రేమించాడు.. సంజయ్‌ గుప్తా లవ్‌స్టోరీ..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement