బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ వేడివేడిగా సాగింది. నామినేషన్ల సమయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చిన్న చిన్న వివాదాలు కాస్తా పెద్ద వాదనలకు దారితీశాయి. ఒకరిపై మరొకరు తమ అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూ నామినేషన్లు చేయడంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా త్రిగుణ్.. వర్షిణిని నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ప్రొమోలను ఒకసారి పరిశీలిద్దాం..
నన్ను అర్థం చేసుకో వర్షిణి
బిగ్‌బాస్ హౌస్‌లో వర్షిణి, త్రిగుణ్ మధ్య మంచి అనుబంధం ఉందని భావిస్తున్న తరుణంలో.. ఆమెను త్రిగుణ్ నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గతవారం జరిగిన ఆటలో వర్షిణి తనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని, ఆమె చేసిన పొరపాటే తన నామినేషన్‌కు కారణమని త్రిగుణ్ వివరించినట్లు ప్రోమోలో కనిపించింది. ఈ క్రమంలో వర్షిణిని ఉద్దేశించి ‘నన్ను అర్థం చేసుకో వర్షిణి’ అంటూ త్రిగుణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరో పక్క కుటుంబాన్ని వదిలి ఇంత దూరం వచ్చినట్లు చెబుతున్నట్లు ప్రొమోలో కనిపించింది.
మరోవైపు, త్రిగుణ్ మాటలకు వర్షిణి భావోద్వేగానికి గురైంది. ‘ఇది నేను చూసిన త్రిగుణేనా?’ అంటూ ఆమె స్పందించడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
రాంప్రసాద్, నరేశ్ కామెడీ సందడి
మరోవైపు రాంప్రసాద్, నరేశ్ తమదైన శైలిలో నవ్వులు పూయించారు. హౌస్‌లోని పలువురు కంటెస్టెంట్లను ఇమిటేట్ చేస్తూ..సందడి చేశారు. అయితే, నామినేషన్ల ప్రక్రియలో మరెన్ని గొడవలు చోటుచేసుకున్నాయి? ఎవరి మధ్య మాటల యుద్ధం జరిగింది? అన్నది పూర్తి ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.
నామినేషన్లలో ఆరుగురు
ఇక తాజా సమాచారం ప్రకారం.. ఎనిమిదో వారం నామినేషన్ల జాబితాలో రోహిత్, రామకృష్ణ, వర్షిణి, ఝాన్సీ, రాంప్రసాద్, సుధీర్ ఉన్నారు. దీంతో ఈ ఆరుగురిలో ఎవరు ప్రేక్షకుల ఓట్లను ఎక్కువగా సాధిస్తారు? ఎవరు ఓటింగ్‌లో వెనుకబడి ఎలిమినేషన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు? అనే చర్చ మొదలైంది. నామినేషన్లతో ఇప్పటికే హౌస్‌లో ఉత్కంఠ నెలకొనగా.. ఈ వారం ఎవరి ప్రయాణం ముగుస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
(ఇదీ చదవండి: ఓటీటీలో సీఎం విజయ్ కొడుకు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)


