లిఫ్ట్ ఎక్కి గతాన్ని మార్చే అవకాశమొస్తే.. ఓటీటీలో తెలుగు థ్రిల్లర్ | Sai Ronak Telugu Time Travel Sci-Fi Thriller Series Pushpaka Vimanam OTT Release Date, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలోకి తెలుగు టైమ్ ట్రావెల్ సస్పెన్స్ థ్రిల్లర్

Oct 27 2026 10:47 AM | Updated on Oct 27 2026 11:06 AM

Pushpaka Vimanam Series OTT Telugu Trailer

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తుంటాయి. ఇతర భాషల్లోనే కాకుండా అప్పుడప్పుడు తెలుగులోనూ థ్రిల్లర్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అలా ఇప్పుడు టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌తో తీసిన సైన్స్ ఫిక్షన్ తెలుగు సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పటినుంచి చూడొచ్చు?

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ)

పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'పుష్పక విమానం'. సతీష్ రెడ్డి మల్లిడి దర్శకుడు. వచ్చే నెల 12 నుంచి హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు వదిలిన ట్రైలర్.. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

'పుష్పక విమానం' విషయానికొస్తే.. పుష్పక్ అనే కుర్రాడు తాను గతంలో తప్పులు చేశానని బాధపడుతూ ఉంటాడు. అలాంటి ఇతడికి ఓ రోజు తారసపడిన ఓ వ్యక్తి.. కాలంలో వెనక్కి వెళ్లి, గతాన్ని మార్చుకోవచ్చని చెబుతాడు. అలా లిఫ్ట్‌లోకి వెళ్లి గతాన్ని మార్చుకున్న పుష్పక్ జీవితం ఎలా మారింది? చివరకు తాను అనుకున్నది పుష్పక్ సాధించాడా లేదా అనేది స్టోరీలా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement