జియో రీఛార్జ్: ఈ ప్లాన్‌లో సూపర్‌ బెనిఫిట్స్‌! | Jio recharge 84 days plan daily 3GB high speed data | Sakshi
Sakshi News home page

జియో రీఛార్జ్: ఈ ప్లాన్‌లో సూపర్‌ బెనిఫిట్స్‌!

Oct 26 2026 5:35 PM | Updated on Oct 26 2026 5:46 PM

Jio recharge 84 days plan daily 3GB high speed data

జియో వినియోగదారులకు రూ.1,799 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 3 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. అంటే వ్యాలిడిటీ మొత్తం మీద 252 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర డిజిటల్‌ సేవలు, ఏఐ టూల్స్‌ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి.

84 రోజుల వ్యాలిడిటీ..

జియో రూ.1,799 ప్లాన్‌లో రోజుకు 3 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే సదుపాయం ఉంటుంది. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను కూడా పొందవచ్చు. ఇందుకు 5జీకి మద్దతిచ్చే స్మార్ట్‌ఫోన్‌, జియో 5జీ నెట్‌వర్క్‌ కవరేజ్‌ ఉండాలి.

నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌

ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లోని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను వీక్షించవచ్చు. అదనంగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జియో ఏఐ క్లౌడ్‌లో 50 జీబీ ఉచిత స్టోరేజ్‌ కూడా లభిస్తుంది.

జియోహాట్‌స్టార్‌, గూగుల్‌ జెమిని ప్రో ప్రయోజనాలు

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ ప్లస్‌ హాలీవుడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది దీంతోపాటు 18 నెలల గూగుల్‌ జెమిని ప్రో ప్లాన్‌ ప్రయోజనం లభిస్తుందని పేర్కొంటున్నారు. దీని విలువ రూ.35,100గా ప్రచారం అవుతోంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో 5,000 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌, నానో బనానా వంటి ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని సమాచారం. అలాగే 12 నెలల కాన్వా ప్రో లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement