హీరోయిన్‌గా దేవయాని కూతురు | Devayani Daughter Priyanka New Movie Launch | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా దేవయాని కూతురు

Oct 27 2026 8:41 AM | Updated on Oct 27 2026 8:41 AM

Devayani Daughter Priyanka New Movie Launch

స్టార్ నటీనటుల వారసుల సినీ రంగ ప్రవేశం సులభమే. కానీ నిలదొక్కుకోవడం వారి ప్రతిభ, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలా చాలా మంది వారసులు ఈ రంగంలో రాణిస్తున్నారు. ప్రముఖ నటి దేవయాని కూతుళ్లలో ఒకరైన ప్రియాంక రంజన్‌.. 'ది అడ్వకేట్‌' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తాజాగా ప్రియాంక రెండో చిత్రమూ మొదలైంది. ఈమె నటిస్తున్న ఈ సినిమాకు బ్లాక్‌ నైట్‌ బాయ్స్‌ టైటిల్‌ నిర్ణయించారు. ఈ చిత్రంతో సీరియల్ నటుడు అమల్‌ అజిత్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?)

కేఈ.మణికంఠన్‌ అలియాస్‌ విమల్‌.జీ నిర్మిస్తున్నారు. సెంబర్‌ వి.మురుగేశన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వైవిధ్య భరితరిత ప్రేమతో కూడిన జనరంజక కుటుంబ కథా చిత్రంగా ఇది ఉంటుందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుంటా.. తప్పేంటి? : రష్మిక మందన్న)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement