తమిళ కమెడియన్ వడివేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు వివాదాలతో చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైన ఇతడు.. గత కొన్నేళ్లుగా మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్, ప్రభుదేవాతో తలో మూవీలో నటిస్తున్నాడు. వీటి సంగతి పక్కనబెడితే వడివేలు ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఇంటిని కట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)
జాలీ వసంత్ అనే యూట్యూబర్.. మూడు నాలుగు రోజుల క్రితం మధురైలో వడివేలు కట్టిన కొత్త ఇంటికి వెళ్లాడు. హౌమ్ టూర్ వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. కొన్ని ఎకరాల్లో ఉన్న ఈ ఇంటికి ఏకంగా 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం విశేషం. ఇంటి ముందు పాతకాలం స్టైల్లో కూర్చోవడానికి అరుగు, పూజించడానికి చిన్న వినాయకుడి విగ్రహాం ఉంది.
అలానే విద్యుత్ అవసరాల కోసం ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఆవరణలో సపోటా, అరటి, ఉసిరి, కొబ్బరి, పనస చెట్లు ఉన్నాయి. అయితే ఇంత పెద్ద ఇంటిని కట్టుకోవడానికి గల కారణాన్ని స్వయంగా వడివేలు బయటపెట్టాడు. తనకు 200 మంది సభ్యుల కుటుంబం ఉందని, తామంతా ప్రతివారం కలుసుకుని, భోజనాలు చేసుకుని ఎంజాయ్ చేసేందుకే దీనిని నిర్మించినట్లు వడివేలు చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మరో ఏజ్ గ్యాప్ రొమాంటిక్ సినిమా)
மதுரையில் வடிவேலுவின் பிரமாண்ட வீடு! #Vadivelu #Madurai #TamilCinema #CinemaNews #LatestNews #BreakingNews #BrioNews #MetroPeople https://t.co/GdAtA5P9HZ
— BRIO CINEMA (@briocinema) October 21, 2026


