సమ్మోహనం, అంతరిక్షం, మహాసముద్రం తదితర సినిమాలు చేసిన అదితీరావు హైదరీ.. హీరో సిద్ధార్ధ్‌ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఈమె నటించిన ఓ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)
మీర్జాపూర్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సీనియర్ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో, అదితీ రావు ఇతడికి జోడీగా చేసిన సినిమా 'పరివారిక్ మనురంజన్'. 50 ఏళ్ల వ్యక్తి, తనకంటే చాలా తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో తీసిన కామెడీ మూవీ ఇది. వచ్చే నెలలో సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. టీజర్ వదిలారు గానీ స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడనేది ఇంకా వెల్లడించలేదు.
రంజన్ దూబే (పంకజ్ త్రిపాఠి) అనే వ్యక్తి ఇంట్లోకి... ప్రాపర్టీ మేనేజర్ అండ్ హౌస్ కీపర్‌గా పనిచేయడానికి ఢిల్లీ నుంచి హెలెన్ (అదితీ రావ్ హైదరీ) వస్తుంది. తర్వాత ఏం జరిగింది? వీళ్లిద్దరూ ఎలా ఎప్పుడు ప్రేమలో పడ్డారనేది స్టోరీలా అనిపిస్తుంది. సినిమా కామెడీగా బాగానే ఉండొచ్చనిపిస్తోంది గానీ హీరోయిన్ అదితీ.. పంకజ్ త్రిపాఠికి జోడీగా నటించడం ఆశ్చర్యం కలిగించింది.
ఎందుకంటే ఇప్పటివరకు దక్షిణాదితో పాటు హిందీలో యంగ్ హీరోల పక్కన చేసిన అదితీ.. చివరగా 2022లో 'హే సినామిక' మూవీలో కనిపించింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'గాంధీ టాక్స్'లో కనిపించింది. కొన్నాళ్ల క్రితం 'లస్ట్ స్టోరీస్ 3' భర్త సిద్ధార్థ్‌తో కలిసి నటించింది. వెండితెరపై కనిపించడం చాలావరకు తగ్గించేసి ఓటీటీకే పరిమితమైంది. చూస్తుంటే ఈమె సినీ కెరీర్ ఎండ్ అయిపోయినట్లే అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఆమెని ఎలిమినేట్ చేసేశారు!)


