హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని డివైన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్పీ అక్షిత్ రెడ్డి, ఆర్.సుదర్శనరెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
పూరీ జగన్నాథ్ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన ఏ.శ్రీధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు మంచు మనోజ్‌ను చూడని సరికొత్త అవతార్‌లో ఇందులో కనిపించనున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ తదితర వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా వస్తారా?)


