ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ ‍థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Dhoomakethu Movie OTT Release Date And Telugu Streaming | Sakshi
Sakshi News home page

Dhoomakethu OTT: ఓటీటీలో క్రేజీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Oct 20 2026 12:32 PM | Updated on Oct 20 2026 12:53 PM

Dhoomakethu Movie OTT Release Date And Telugu Streaming

థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళీ దర్శకుల తర్వాతే ఎవరైనా! ఎందుకంటే ప్రతినెలా రెండు మూడు థ్రిల్లర్ మూవీస్ అయినా థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. అలా గత నెలలో వచ్చి ప్రేక్షకుల్ని అలరించింది ఓ టైమ్ లూప్ థ్రిల్లర్. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

సజిన్ గోపు, నిఖిలా విమల్ ప్రధాన పాత్రలు చేసిన ఫాంటసీ టైమ్ లూప్ థ్రిల్లర్ సినిమా 'ధూమకేతు'. సుధీ మాడిసన్ దర్శకుడు. గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. ఈ శుక్రవారం(అక్టోబర్ 23) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.

36 ఏళ్ల లతిన్ కుమార్ అలియాస్ కుట్టన్ (సజిన్ గోపు) చాలా కష్టం మీద శర్మిల (నిఖిలా విమల్) అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజు రాత్రి ఒక వింత తోకచుక్క (ధూమకేతువు) ఆకాశంలో కనిపిస్తుంది. అదే రాత్రి కొందరు ముసుగు ధరించిన వ్యక్తులు వచ్చి కుట్టన్‌ని చంపేస్తారు. కానీ మరుసటి క్షణమే అతను మళ్లీ తన పెళ్లి రోజు ఉదయం బెడ్‌పై నిద్రలేస్తాడు. తాను ఒకే రోజులో (టైమ్ లూప్‌లో) ఇరుక్కుపోయానని గ్రహించిన కుట్టన్.. ఆ లూప్ నుండి ఎలా బయటపడ్డాడు? అసలు తనని చంపాలని చూస్తున్నది ఎవరనేదే మిగతా స్టోరీ.

ఇక ఈ వారం దీనితోపాటు నాని 'ప్యారడైజ్', కీర్తి సురేశ్ 'డోరతి', సుమో దీదీ లాంటి సినిమాలతో పాటు నా వైఫ్ మిస్సింగ్, వరం లాంటి తెలుగు సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement