వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ఆదర్శ కుటుంబం'. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. ఈనెల 2నే థియేటర్లలోకి వచ్చేస్తుందని తొలుత ప్రకటించారు. కట్ చేస్తే వారం తర్వాత అంటే 09వ తేదీకి వాయిదా వేశారు. తర్వాత ఆ రోజు రావట్లేదు, త్వరలోనే కొత్త డేట్ వెల్లడిస్తామని నిర్మాత నాగవంశీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
(ఇదీ చదవండి: ఒకే ఫ్యామిలీలో వరస విషాదాలు.. ఏడాదిలో ముగ్గురు కన్నుమూత)
ఇప్పుడు దసరా సందర్భంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 30న థియేటర్లలోకి 'ఆదర్శ కుటుంబం' రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈసారి కూడా వస్తుందా రాదా? నమ్మొచ్చా అని పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
'ఆదర్శ కుటుంబం'లో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా నివేదా పేతురాజ్ కీలక పాత్ర చేసింది. ఐటమ్ సాంగ్‌లో డింపుల్ హయాతి కనిపించింది. తమన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రాగా వాటికి భిన్నమైన స్పందన వచ్చింది.
ఇక 'ఆదర్శ కుటుంబం' సినిమా టీమ్.. ఈ డేట్ ఫిక్స్ చేయకముందే ఇట్లు అర్జున, కల్ట్, కిల్లర్, చంద్రయాన్ లాంటి చిన్న మూవీస్ సదరు తేదీన వస్తున్నట్లు వెల్లడించాయి. ఇప్పుడు వెంకీ-త్రివిక్రమ్ రావడంతో సదరు చిన్న చిత్రాలకు ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


