ఒకే హీరో చేసిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గతంలో బాలకృష్ణ, నాని తదితర చిత్రాలు ఇలానే థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఒకటి పూర్తిగా వాషౌట్ అయిపోగా మరొకటి హిట్ అయింది. ఇప్పుడీ మేటర్ అంతా ఎందుకంటే చిరంజీవి నటించిన రెండు మూవీస్ సంక్రాంతికే వస్తున్నాయి.
దాదాపు మూడున్నరేళ్లుగా రిలీజ్ కావడానికి ఇబ్బందులు పడుతున్న 'విశ్వంభర' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్స్ జరుగుతుండగా జనవరి 13ని టార్గెట్ చేస్తున్నారని అనధికారికంగా న్యూస్ బయటకొచ్చింది. దీంతో 'కాకా' వాయిదా పడటం గ్యారంటీ అని ఏప్రిల్‌లో విడుదల ఉండొచ్చన్నట్లు మాట్లాడుకున్నారు.
కానీ 'కాకా' చిత్రాన్ని కూడా సంక్రాంతికే తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ట్వీట్ వేసి మరీ ప్రకటించారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. సంక్రాంతికి కొడుతున్నాం' అని క్యాప్షన్ కూడా పెట్టారు. చూస్తుంటే ఈసారి సంక్రాంతికి మహాకాళి, సంబరాల ఏటిగట్టు, జనవరి 12 విడుదల, జార్జ్ క్రిష్, ఫ్యామిలీ ప్యాక్ సినిమాలతో పాటు చిరంజీవి రెండు మూవీస్ విశ్వంభర, కాకా రాబోతున్నాయి. విడుదలకు మరో 40-50 రోజులే ఉంది కాబట్టి వాయిదా పడకపోవచ్చనే అనిపిస్తుంది.
అయితే చిరంజీవి రెండు సినిమాలు రావడం నిర్మాతలకు చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. ఎందుకంటే ఒకే తేదీన విడుదల చేద్దామని ఫిక్స్ అయితే చిరు దేని ప్రచారంలో పాల్గొంటారు. ఒకవేళ పాల్గొంటే దేనికి తక్కువ చేయకూడదు. మరి చిరంజీవి ఈ విషయాన్ని ఎలా మేనేజే చేస్తారు. విశ్వంభర ఇప్పటికే చాలా లేటు అయిపోయింది. ఇంకా ఆలస్యమైతే దీని గురించి జనాలే మర్చిపోతారు. చెప్పాలంటే దీనిపై బజ్ కూడా ఏ మాత్రం లేదు. మరోవైపు 'కాకా'పై కూడా మోస్తరు బజ్ ఉందంతే. మరి పండక్కి ఇద్దరూ వస్తారా? లేదంటే తుచ్ అని ఒకరు డ్రాప్ అవుతారా అనేది చూడాలి?
JANUARY 13th 🔥🔥🔥 Sankranthiki vasthunam. Sankranthi koduthunnam 💥💥💥 #KAAKA #KAAKAOnJan13 https://t.co/5Auj7yMKhA
— Kaaka (@KaakaMovie) November 27, 2026


