దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి స్పందనను సొంతం చేసుకుంది. విడుదలై ఐదు రోజులు గడుస్తున్నా ఈ చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నిన్న ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. కథ, నటీనటుల ప్రతిభను అభినందించడంతో పాటు పిల్లలతో కలిసి సినిమా చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.
ఈ పాత్ర నీకు మాత్రమే సాధ్యం
తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాపై ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘దుల్కర్ సల్మాన్‌లా ఈ పాత్రను మరెవరూ ఇంత అద్భుతంగా చేయలేరు. సాత్విక వీరవల్లికి ఇది అద్భుతమైన అరంగేట్రం. కల్పన పాత్ర నీకు మాత్రమే సాధ్యం. చాలా బాగా ఏడుస్తావు. జీవీ ప్రకాశ్ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసి మరో స్థాయికి తీసుకెళ్లారు’ అంటూ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక బృందాన్ని ప్రశంసించారు.
కాగా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
(ఇదీ చదవండి: చిన్నారి రీల్‌కి మహేశ్ బాబు ఫిదా.. ఒక్క కామెంట్‌తో రాత్రికి రాత్రే స్టార్!)
Aakasam lo oka taara is all kinds of beautiful. What a heartwarming film. No one could have pulled this off the way @dulQuer did. @satveeravalli what a debut. Kalpana can only be you. Chala baaga edusthavu btw :) @shrutihaasan was superb. @iRuhaniSharma was adorable as bijili. @pavansadineni loved your clarity and craft. @gvprakash you owned the film and lifted it. Very proud of my friends Sunny Gunnam , Ramya Gunnam, @SwapnaCinema @Lightboxoffl who pulled this off with such conviction and care. Congratulations to the entire cast and crew. @GeethaArts @sujithsarang #AkasamLoOkaTara #AOT
— Nani (@NameisNani) November 25, 2026


