‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ | Megastar Chiranjeevi Review of Aakasamlo Oka Tara Movie | Sakshi
Sakshi News home page

‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Nov 24 2026 6:48 PM | Updated on Nov 24 2026 7:03 PM

Megastar Chiranjeevi Review of Aakasamlo Oka Tara Movie

దుల్కర్ సల్మాన్ హీరోగా.. డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’.  ఇప్పటికే సినిమా చూసిన సినీ ప్రముఖులు తమతమ అభిప్రాయాలను తెలియజేస్తుండగా.. తాజాగా సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

‘తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను చూశా. ఈ చిత్రం నన్ను ఎంతో కదిలించింది. ద్వితీయార్ధం అయితే భావోద్వేగానికి గురిచేసింది. దర్శకుడు పవన్ సాధినేని ఓ స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు.దుల్కర్‌ సల్మాన్‌, సత్‌విక వాల్లీల సహజమైన నటన పాత్రలకు ప్రాణం పోసింది

పిల్లలతో కలిసి చూడండి
శ్రుతిహాసన్‌, రుహాని శర్మతో పాటు మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం ప్రేక్షకులకు చేరువ చేసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో కలిసి ఈ సినిమాను చూడాలి. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుంది’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.  

కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నంనిర్మించారు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌ కాగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి స్పందన అందుకుంది.

 (ఇదీ చదవండి: కూతురు కొత్త ప్రయాణం..! రామ్‌ చరణ్‌కు స్పెషల్‌ మూమెంట్‌..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement