Pocket Rockets: ఆకట్టుకుంటున్న ‘అప్సర’ సాంగ్‌ | Apsara Song Released From Pocket Rockets Movie | Sakshi
Sakshi News home page

Pocket Rockets Movie: ఆకట్టుకుంటున్న ‘అప్సర’ సాంగ్‌

Nov 24 2026 6:19 PM | Updated on Nov 24 2026 6:19 PM

Apsara Song Released From Pocket Rockets Movie

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మరింత బజ్‌ను పెంచేందుకు మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు.

ఈ క్రమంలోనే ‘అప్సర’ అంటూ సాగే మోస్ట్ ఇల్యూష‌న్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు గ్యానీ ఇచ్చిన బాణీ, గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అప్సర అంటూ సాగే ఈ పాట‌కు రమేష్ కుమార్ సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియో మాత్రం హీరో, హీరోయిన్ కెమిస్ట్రీని, వారి మధ్య ఉన్న ప్రేమను గొప్పగా చూపించేలా పాట‌ను రూపొందించార‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా ఆడియో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement