ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘హే కన్నమ్మా’. ఈ చిత్రంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ పాటు కార్తీక మురళీధరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్రబృందం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనశ్రీ.. యశ్ మాస్టర్‌తో స్టేజ్‌పైనే డ్యాన్స్ వేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈసినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోంది. ఈ నెల 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: హీరోయిన్‌గా చాహల్ మాజీ భార్య.. ట్రైలర్‌తోనే గ్లామర్ ట్రీట్!)
#YashMaster Vintage Dance. 🙂↕️ https://t.co/yKHqt9e8jp
— Filmyscoops (@Filmyscoopss) November 24, 2026


