మహేశ్‌బాబుపై ఆందోళన .. ఆ డైరెక్టర్‌ కోసమేనా..? | Mahesh Babu Thin Look Varanasi Movie | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌బాబు ఫొటోపై చర్చ .. ఆ డైరెక్టర్‌ కోసమేనా..?

Nov 24 2026 2:36 PM | Updated on Nov 24 2026 2:36 PM

Mahesh Babu Thin Look Varanasi Movie

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో అడ్వెంచరస్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే తాజాగా కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు పంచుకున్న ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: రాజమౌళికే ఝలక్‌.. యాపిల్‌ మ్యాప్‌లో ‘వారణాసి’ సెట్‌..!)

కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేశ్‌ సోషల్‌మీడియా వేదికగా ఓ ప్రత్యేక ఫొటోను షేర్‌ చేశారు. ఇందులో మహేశ్‌ గతంలో కంటే చాలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఆయన చేతులపై నరాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  ఈ లుక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

తదుపరి సినిమా కోసమేనా?
ప్రస్తుతం ‘వారణాసి’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం మార్పులు చేసుకుంటున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారణాసి తర్వాత ఆయన పలువురు అగ్ర దర్శకులతో సినిమాలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సందీప్‌ రెడ్డి వంగా, బుచ్చిబాబు సాన, సుకుమార్‌, లోకేశ్‌ కనకరాజు వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిలో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేశ్‌ సినిమా చేయనున్నారనే వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కితే.. ఆ సినిమా పాత్ర కోసమే మహేశ్‌ తన లుక్‌ను మార్చుకుంటున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

(ఇదీ చదవండి: రాజమౌళి కొడుకుకి మహేశ్‌బాబు మద్దతు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement