ఈ ఏడాది విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ కొట్టిన సూర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా వచ్చిన సీన్ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం వచ్చేనెల 4వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ హిట్ కావడంతో సూర్య ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. అంతకంటే ముందు కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.


