దగ్గరగా రండి.. మీకో మాట చెప్పాలి! | Fahadh Faasil film with 96 fame director Premkumar titled Asareeri | Sakshi
Sakshi News home page

దగ్గరగా రండి.. మీకో మాట చెప్పాలి!

Nov 24 2026 1:23 AM | Updated on Nov 24 2026 1:23 AM

Fahadh Faasil film with 96 fame director Premkumar titled Asareeri

మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘అశరీరి’ అనే టైటిల్‌ ఖరారైంది. శివద హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హరీష్‌ ఉత్తమన్, కరుణాకరన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘96’, ‘సత్యం సుందరం’ చిత్రాల ఫేమ్‌ సి.ప్రేమ్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

‘దగ్గరగా రండి.. మీకో మాట గుసగుసగా చెప్పాలి’ అనే క్యాప్షన్‌తో సోమవారం ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను రిలీజ్‌ చేసి, జనవరి 1న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్, మాన్‌సూన్‌ మూవీస్‌పై ఇషారి కె.గణేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గోవింద్‌ వసంత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement