సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఆలోచన. ఈ ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఈ మూవీని ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు బంపరాఫర్ ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని మూడు రోజుల పాటు ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. అయితే కేవలం 60 ఏళ్లు పైబడినవారికే ఈ ఛాన్స్ దక్కనుంది. ఈ నెల 27,28,29 తేదీల్లో వయసు నిర్ధారించే గుర్తింపు పత్రం ఆధార్ కార్డ్ చూపించి ఈ మూవీని వీక్షించొచ్చు.
A mega moment for #Alochana! 🔥🎬 Get ready as Megastar Chiranjeevi Garu launches the official theatrical trailer of #Alochana (U/A) Today at 5:09 PM! ✨🍿 In cinemas worldwide on November 27th! 🎟️ Special Gesture for Senior Citizens: Men and women aged 60+ can enjoy FREE tickets on Nov 27, 28 & 29 by showing a valid government ID at the theatre! #MegastarChiranjeevi #SurenderChaacha #PSJFilmsCo @viyaanmusical #GVNarayanaRao #NarsimhaRaju #PrasadBabu #RaajanHari #SurendraTReddy #Pradeep #JayaCH #HasithaReddy @SwathiAnupama @kiranmahesh89 #SujanaJonnala #MichaelBenny @santoshamsuresh @sreedharsri4u #Dheeraj #Prasad @adityamusic
— Suresh Kondeti (@santoshamsuresh) November 23, 2026


