'ఆ నలుగురు డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా': శర్వానంద్ | Sharwanand Comments at Bhogi Movie Pre Release event | Sakshi
Sakshi News home page

Bhogi Movie: 'ఆ నలుగురు డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా': శర్వానంద్

Nov 23 2026 8:29 AM | Updated on Nov 23 2026 8:31 AM

Sharwanand Comments at Bhogi Movie Pre Release event

శర్వానంద్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ భోగి. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన శర్వానంద్ భోగి మూవీకి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రతి సినిమా విషయంలో విడుదలకు ముందు నాపై ఒత్తిడి ఉంటుందని శర్వానంద్ తెలిపారు. కానీ భోగి విషయంలో ఒత్తిడి, భయం లాంటివీ లేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ కాపీ చూసినప్పుడే నాకు సంతృప్తి కలిగిందన్నారు. ఒక నటుడిగా నాలో కొత్త కోణాన్ని పరిచయం చేసే మూవీ భోగినే అవుతుందన్నారు. తగ్గున్నోడికి తగలబెట్టడం కూడా తెలసు.. అనవసరంగా గెలక్కండి.. తగలబెట్టి పడేస్తాడు..అంటూ డైలాగ్ చెప్పి ఈవెంట్‌లో అభిమానులను అలరించాడు. ఈ సినిమాలో మామూలు పాటలు కాదు.. ఎప్పటికీ నిలిచిపోతాయని శర్వానంద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పాటలు వింటే చచ్చిపోయేదాకా నిలబడతాయన్నారు . మేం రెండు పాటలు రిలీజ్ చేశాం.. రోజుకి లక్ష వ్యూస్ పెరుగుతున్నాయని చెప్పారు.. ఇది కొంటే.. డబ్బు పెడితే, వచ్చిన వ్యూస్ కాదు.. మా దగ్గర ప్రస్తుతం అంత డబ్బులు కూడా లేవని సరాదాగా అన్నారు.  

జీవితాంతం రుణపడి ఉంటా..

నా కెరీర్‌లో ఈ నలుగురికి ఎప్పటికీ రుణపడి ఉంటానని శర్వానంద్ అన్నారు. అమ్మ చెప్పింది సినిమాలో ఛాన్స్ ఇచ్చిన గున్నం గంగరాజు అని తెలిపారు. ఈ సినిమాతోనే నేను ఓనమాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. ప్రస్థానం సినిమాలో అవకాశమిచ్చిన దేవకట్టాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఆ తర్వాత నాలో కామెడీ యాంగిల్‌ చూపించిన రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మళ్లీ నాలో ఒక కొత్త నటుడిని పరిచయం చేస్తోన్న సంపత్ నందిని జీవితాంతం గుర్తుంచుకుంటానని శర్వానంద్‌ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement