మెగాస్టార్ మెగావర్స్.. గ్రాండ్‌ లాంఛ్‌ ఎప్పుడంటే? | Megastar Talk Show Megaverse Grand Lacunch On This Date | Sakshi
Sakshi News home page

Megaverse Talk Show: మెగాస్టార్ మెగావర్స్.. గ్రాండ్‌ లాంఛ్‌ ఎప్పుడంటే?

Nov 22 2026 1:46 PM | Updated on Nov 22 2026 1:50 PM

Megastar Talk Show Megaverse Grand Lacunch On This Date

మెగాస్టార్ మెగా షోకు అంతా సిద్ధమైంది. ఆయన హోస్ట్‌గా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ షోకు మెగావర్స్ పేరు ఖరారు చేశారు. ఇప్పటికే ఈ టాక్ షో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాస్టార్‌తో టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ ప్రముఖులు ఈ షోకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మెగావర్స్ టాక్ షో త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ షో లాంఛ్ ఈవెంట్‌ భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మెగా టాక్‌ షోను నవంబర్ 30న ‍గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు ఈ  ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మెగా అభిమానులు అందరికీ ఆహ్వానం పంపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ టాక్‌ షోలో ప్రభుదేవా, తమన్, రవితేజ, నాని, సూర్య, జ్యోతిక, కార్తీ, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్స్‌ పాల్గొననున్నారని టాక్. త్వరలోనే వీటిపై ఫుల్ క్లారిటీ రానుంది. ఈ టాక్ షో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్‌లో ప్రేక్షకులను అలరించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement