నా పెళ్లి చేసింది.. నాకు తెలుగు నేర్పింది ఆయనే: సుమ ఆసక్తికర కామెంట్స్ | Anchor Suma Interesting Comments about Her Marriage | Sakshi
Sakshi News home page

Anchor Suma: 'నా పెళ్లి చేసింది.. నాకు తెలుగు నేర్పింది ఆయనే'

Nov 22 2026 10:10 AM | Updated on Nov 22 2026 10:51 AM

Anchor Suma Interesting Comments about Her Marriage

టాలీవుడ్‌లో స్టార్ యాంకర్ ‍ఎవరనగానే ‍అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఆమెదే. టాలీవుడ్‌లో ఏ ఈవెంట్‌ జరిగినా ఆమె ఉంటే ‍అదొక మ్యాజిక్‌. ఆమె యాంకరింగ్ చేస్తుంటే అక్కడున్నవారికి ఓ ఎనర్జీ. అంతలా ఆమె మాటలు ఈవెంట్‌కు వచ్చినవారిని కట్టిపడేస్తాయి. తాను మరెవరో కాదు.. తన స్వరంతో టాలీవుడ్‌లో ఈవెంట్‌ వేదికలను షేక్  చేసే టాలెంట్‌ ఉన్న ఏకైక యాంకర్ సుమ. తాజాగా ఆమె ఓ కార్యక్రమానికి హాజరైంది. అన్‌మ్యూట్ విత్ సుమ అనే ప్రోగ్రామ్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానాలిచ్చింది. అదే సమయంలో తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

స్వతహాగా నేను మలయాళీ అమ్మాయినే అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడడం నా అదృష్టమని సుమ అన్నారు. నాకు తెలుగు భాషతో పాటు అనేక భావాలు నేర్పించిన వ్యక్తి బ్రిమ్‌ గారేనని వెల్లడించారు. ఆ తర్వాత నా లైఫ్‌లో  బ్రిమ్  దొరకడం ఓ వరమని ఆనందం వ్యక్తం చేశారు. నా కెరీర్ ప్రారంభంలో నేను తెలుగు మాట్లాడితే నవ్వేవారని తెలిపింది. తెలుగులో సామెతలు, ఎన్నో చమత్కారాలు బ్రిమ్ వల్లే నేర్చుకున్నానని పేర్కొంది. నేను బ్రిమ్ సార్ డైరెక్ట్ చేసిన అర్చన , సమత , రావోయి చందమామ వంటి సీరియల్స్‌లో నటించానని వెల్లడించారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక చమత్కారం ఉంటుందని సుమ తెలిపింది. నా పెళ్లి చేసింది కూడా ఆయననేని.. అలా బ్రిమ్ పెళ్లిళ్ల పేరయ్యగా కూడా మారిపోయారని సుమ సరదాగా మాట్లాడింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement