రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్‌ నటులకు గాయాలు | West Godavari District: Jabardasth Actors Injured In A Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్‌ నటులకు గాయాలు

Nov 22 2026 10:35 AM | Updated on Nov 22 2026 10:41 AM

West Godavari District: Jabardasth Actors Injured In A Road Accident

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పాలకోడేరు మండలం పెన్నాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జబర్దస్త్ ఆర్టిస్టులు గాయపడ్డారు. కాకినాడ నుంచి భీమవరం వస్తుండగా కారు అదుపు తప్పింది. రహదారి పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు గాయపడ్డారు. ప్రమాదంలో డ్రైవర్‌కు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

ఇదీ చదవండి: ఏలూరులో అర్చకుడిపై టీడీపీ నేత దాడి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement