చంద్రబాబు చేతిలో షర్మిల తోలుబొమ్మ: పుణ్యశీల | Ysrcp Leader Punyasheela Comments On Chandrababu And Sharmila | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేతిలో షర్మిల తోలుబొమ్మ: పుణ్యశీల

Nov 22 2026 9:00 AM | Updated on Nov 22 2026 9:16 AM

Ysrcp Leader Punyasheela Comments On Chandrababu And Sharmila

సాక్షి, అమరావతి: చంద్రబాబు కన్నుసన్నల్లో మరో డ్రామాకు తెరతీసిన షర్మిలపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు శిఖండి రాజకీయాలకు షర్మిల ఆట బొమ్మగా మారిపోయారంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నేత పుణ్యశీల మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో షర్మిల తోలుబొమ్మ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును డైరెక్షన్‌ కోసం కలుస్తున్నారా?. బాబుకు వెడ్డింగ్‌ కార్డును ఇవ్వడానికి వెళ్లిన తర్వాత లైన్‌ ఎందుకు మారింది?’’ అంటూ పుణ్యశీల ప్రశ్నించారు.

కాగా, చంద్రబాబు డైరెక్షన్‌లో శివాలెత్తిపోయిన ఎల్లో మీడియా.. వైఎస్‌ జగన్‌ బెంగుళూరు నివాసం చుట్టూ కట్టుకథలు అల్లుతోంది. షర్మిలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, ఎల్లో మీడియా డ్రామాలు మొదలుపెట్టింది. బెంగళూరు ప్యాలెస్‌ పేరుతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. షర్మిలకు వాటా ఉందని  ఎల్లో మీడియా ఏనాడూ ప్రకటించలేదు. అబద్ధాలతో వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగతంగా షర్మిల, బాబు అండ్‌కో బురద చల్లుతున్నారు

కుమార్తె పెళ్లిని సైతం రాజకీయాలకు వాడుకుంటున్న షర్మిల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కోసం అన్న వైఎస్‌ జగన్‌ను అవమానించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. కుమార్తె పెళ్లి పెట్టుకుని అన్న ఇంటి ముందుకు డ్రామాకు సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్టు.. ఎల్లో మీడియా కోరస్‌!



 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement