సాక్షి, చెన్నై: కొలత్తూరు ఎమ్మెల్యే వి.ఎస్.బాబు అంత్యక్రియల ఊరేగింపులో మంత్రి పార్థిబన్‌ను చేయి చూపిస్తూ బెదిరించారంటూ చెలరేగిన వివాదంపై ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో వివరణ ఇచ్చారు. అసలు ఆయన మంత్రి అన్న విషయమే తనకు తెలియదని, తన చేయి పట్టుకుని లాగినందుకే ‘నీ పని ను వ్వు చూసుకో’ అని అన్నానని వైకో స్పష్టం చేశారు. శనివారం కోయంబత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
శుక్రవారం దివంగత ఎమ్మెల్యే బాబు అంత్యక్రియల సందర్భంగా సీఎం విజయ్‌తో కలిసి వైగో నడుస్తుండగా, మంత్రి పార్థిబన్ వైపు వేలు చూపిస్తూ ఆగ్రహంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. ద్రవిడ ఉద్యమాన్ని కాపాడటానికే తాము గతంలో డీఎంకే కూటమిలో చేరామని, అయితే, వారు తమను తీవ్రంగా అవమానించారని వై గో ఆవేదన వ్యక్తం చేశారు.
😂😂😂 vaigo
— மன்மத அம்பு (@Nellai_MSP) November 20, 2026


