సాక్షి,చెన్నై: తమిళనాడు కొళత్తూరు టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్ను మూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండెపోటుతో వీఎస్ బాబు మరణించినట్లు ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్‌పై 8వేల 795 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.


