‍మూడేళ్ల తర్వాత అనుమతి.. సీఎంకి విజయ్‌కి ధనుష్ థ్యాంక్స్ | Dhanush Thanks CM Vijay For 6 Am Shows Om Movie | Sakshi
Sakshi News home page

Dhanush Om Movie: అభిమానులకు హీరో ధనుష్ విజ్ఞప్తి.. నోట్ రిలీజ్

Nov 18 2026 7:26 PM | Updated on Nov 18 2026 7:26 PM

Dhanush Thanks CM Vijay For 6 Am Shows Om Movie

తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోలు, ప్రీమియర్లకు పెద్దగా ఇబ్బంది లేదు గానీ తమిళనాడులో మాత్రం 2023 నుంచి ప్రీమియర్లు, వేకువజామున షోలు రద్దు చేశారు. ఓ ప్రమాదంలో అభిమాని చనిపోవడమే దీనికి కారణం. హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయంలో ఇండస్ట్రీకి అనుకూలంగా న్యూస్ వచ్చింది. కొన్నిరోజుల క్రితం 6 గంటల షోలకు అనుమతి రాగా.. ఇ‍ప్పుడు ధనుష్ 'ఓం' సినిమాతో ఈ ట్రెండ్ తిరిగి మొదలుకానుంది.

(ఇదీ చదవండి: వారణాసి.. ఏదో ఒకటి తేల్చాల్సిందే)

ఈ శుక్రవారం(నవంబర్ 20) ధనుష్ హీరోగా నటించిన 'ఓం' చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళనాడులో దీనికి ఉదయం 6 గంటల షోలకు విజయ్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్‌కి థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు.

'ఒక సినిమా విజయం సాధించాలంటే వివిధ విభాగాలకు చెందిన ఎంతోమంది సమిష్టి కృషి, అంకితభావం అవసరం. సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ప్రేక్షకులు అందించగలిగే అతిపెద్ద ప్రోత్సాహం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటమే. నవంబర్ 20న విడుదలవుతున్న 'ఓం' సినిమా ఉదయం 6 గంటల ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసిన తమిళనాడు ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉదయం 6 గంటల షోకు హాజరయ్యే అభిమానులందరూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. సినిమాని థియేటర్లలో చూసి ఆనందించడమే నిజమైన వేడుక' అని ధనుష్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: దుల్కర్ ఆశలన్నీ టాలీవుడ్ 'తార' మీదే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement