పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వ్యూ’. ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్‌లైన్. ప్రదీప్, సోనియా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహించారు. సత్య చౌదరి నిర్మించారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు ఈ నెల 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా రెడ్డి మాట్లాడుతూ.. లేడీ ఓరియెంటెడ్ కథలో బలమైన పాత్ర దక్కడం సంతోషంగా ఉందని, ట్రైలర్‌లో కనిపించినంత ఎనర్జీ సినిమాలోనూ ఉంటుందని చెప్పారు.
(చదవండి: వచ్చే ఏడాది థియేటర్స్‌కు రానున్న సీక్వెల్ సినిమాలు ఇవే!)
నటి సోనియా మాట్లాడుతూ.. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘వ్యూ’లో నటించే ఛాన్స్ వచ్చిందని, తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. నటుడు ప్రదీప్ మాట్లాడుతూ.. ఇది తన తొలి సినిమా అని, దర్శకుడు ఇచ్చిన స్వేచ్ఛతో తన పాత్రను బాగా చేశానని చెప్పారు.
నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ.. దర్శకుడు మహేశ్ తనపై నమ్మకంతో ఈ సినిమాను రూపొందించారని, ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కించామని అన్నారు. దర్శకుడు మహేశ్ కాంపెల్లి మాట్లాడుతూ.. తన దృష్టికోణం నుంచి కథను చెప్పానని, ప్రేక్షకులకు తమ చుట్టూ జరిగిన సంఘటనలను చూసిన అనుభూతి కలిగేలా సినిమా ఉంటుందని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో ‘వ్యూ’ను విడుదల చేస్తున్నామని చెప్పారు.


