ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు కామెడీ సినిమా | Happy Journey Movie 2026 OTT Trending Now | Sakshi
Sakshi News home page

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

Nov 18 2026 3:43 PM | Updated on Nov 18 2026 3:45 PM

Happy Journey Movie 2026 OTT Trending Now

సెప్టెంబరులో థియేటర్లలో రిలీజై గత వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 'హ్యాపీ జర్నీ' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. వ్యూస్ పరంగానే కాకుండా, రేటింగ్స్ విషయంలోనూ ‘హ్యాపీ జర్నీ’ తన సత్తా చాటుతోంది. ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 9.7/10 రేటింగ్ సాధించి ఔరా అనిపించింది. బుక్ మై షోలోనూ 9.5/10 రేటింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

(ఇదీ చదవండి: ‘బాయ్స్‌’.. తీగ కాదు అమ్మాయి నడుము)

గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, ఆమని తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. శేఖర్ చంద్ర సంగీతం, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ చిత్రానికి మరింత వన్నె తెచ్చాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ‘హ్యాపీ జర్నీ’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది.

(ఇదీ చదవండి: బండ్ల గణేశ్‌కి ఏడాది జైలు శిక్ష వేసిన కోర్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement