ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం ద ఒడిస్సీ, క్రేజీ కళ్యాణం, హైకూ, 418, అన్బిల్ అవన్ తదితర మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు ఓ తెలుగు కామెడీ చిత్రం కూడా డిజిటల్ రిలీజ్ కానుంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?
(ఇదీ చదవండి: హీరో తేజా సజ్జా నిశ్చితార్థం.. కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)
'సినిమా బండి' మూవీతో నటుడిగా మారిన రాగ్ మయూర్.. లీడ్ రోల్స్, సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇతడు.. 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి చేసిన సినిమా 'అనుమాన పక్షి'. సెప్టెంబరు 25న థియేటర్లలోకి వచ్చింది గానీ దారుణమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడిది రెండు నెలల తర్వాత ఈ శుక్రవారం(నవంబర్ 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
'అనుమాన పక్షి' విషయానికొస్తే.. సన్నీ (రాగ్ మయూర్) పెద్ద అనుమానపు పక్షి. అదే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటాడు. ఇతడి కారణంగా నష్టపోయిన ఓ స్నేహితుడు కశ్మీర్ నుంచి ఫోన్ చేసి అక్కడికి రమ్మని పిలుస్తాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాడు. దాంతో భయపడి తన స్నేహితులతో కలిసి అక్కడికి సన్నీ వెళ్తాడు. అక్కడే కన్య (మెరిన్ ఫిలిప్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తనతోపాటు కశ్మీర్ వచ్చిన స్నేహితుడు వర్మ (ప్రిన్స్) హత్యకు గురవుతాడు. మృతదేహం కూడా సన్నీ గదిలో దొరుకుతుంది.
వర్మ ఎలా చనిపోయాడో తెలియక సన్నీ కంగారు పడుతుంటే అదే సమయంలో అక్కడికి వైజాగ్‌కి చెందిన పోలీస్ అధికారి వాసు (అజయ్) తన భార్య సుజి (రాశి)తో కశ్మీర్ వస్తాడు. మరి ఆ పోలీస్ అధికారి ముందు హత్య విషయం దాచి పెట్టేందుకు సన్నీ, అతని మిత్రబృందం ఎలాంటి పాట్లు పడింది? అసలు వర్మని చంపింది ఎవరు? సన్నీ-కన్య ప్రేమకథ సంగతేంటి అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఆరు డోంట్ మిస్)


