breaking news
AnumanaPakshi Movie
-
‘అనుమాన పక్షి’ మూవీ రివ్యూ
టైటిల్: అనుమాన పక్షినటీనటులు: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్యా, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులునిర్మాణ సంస్థ: చిలక ప్రొడక్షన్స్నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్రచన, దర్శకత్వం: విమల్ కృష్ణసంగీతం: శ్రీచరణ్పాకాలఎడిటర్ : చోటా కె. ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 25, 2026‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. చాలా గ్యాప్ తీసుకొని ‘అనుమాన పక్షి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి కూడా నవ్వులు పూయించే కథనే నమ్ముకున్న ఆయన.. కామెడీతో పాటు కథ, కథనం విషయంలో ఎంతవరకు మెప్పించాడు? ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ సినిమాతో పోటీకి దిగిన ఈ ‘అనుమాన పక్షి’ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన యూట్యూబర్ సన్నీ(రాగ్ మయూర్)కి అనుమానాలు ఎక్కువ. ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మ పెడితే ఎక్కడ తెగి తనపై పడుతుందో అనే అనుమానంతో.. దిష్టిబొమ్మనే పెట్టించుకోడు. బట్టల్ని ఎవరికైనా దానం చేస్తే.. ఏదైనా చేతబడి చేస్తారనే అనుమానంతో ఇంట్లో ఉండే పాత చీరలు, కర్టెన్స్‌తో కూడా బట్టలు తయారు చేసుకుంటాడు.ఇలా తన అనుమానాలతో చుట్టూ ఉన్న అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. ఇతని అనుమానం వల్లే.. వర్మ(ప్రిన్స్)ని తన ప్రియురాలు రమ్య దూరం పెడుతుంది. వర్మ వార్నింగ్ఇవ్వడంతో రమ్యతో మాట్లాడి మళ్లీ కలిసేలా చేస్తానని చెబుతాడు. అదే సమయంలో తనకు కశ్మీర్ నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. దీంతో తన స్నేహితుడితో పాటు వర్మని కూడా తీసుకొని కశ్మీర్‌కి వెళ్తాడు. అక్కడ సన్నికి కన్యాకుమారి(మెరిన్ ఫిలిప్) పరిచయమై ప్రేమలో పడతాడు. అంతా సాఫీగా సాగుతుందనకుంటున్న సమయంలో వర్మ ఊహించని రీతిలో మరణిస్తాడు. అదే సమయంలో అక్కడికి విశాఖ సీఐ వాసు (అజయ్), అతడి భార్య సుజాత (రాశి) వస్తారు. వర్మ మృతికి అసలు కారణం ఏంటి? ఈ సమస్య నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? అసలు కన్యాకుమారి ఎవరు? ఆమెతో సన్నీ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సాధారణంగా కామెడీ సినిమా అంటే కథ ఎలా ఉన్నా.. కనీసం కొన్ని సన్నివేశాలైనా ప్రేక్షకులను నవ్విస్తాయి. కానీ ‘అనుమాన పక్షి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కామెడీని ప్రధాన బలంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా.. కనీసం ఒక్క సీన్లో కూడా ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు తీసుకురాలేకపోయింది.సన్నివేశాల్లో సహజత్వం లేకపోవడం, కామెడీ టైమింగ్ ఒక్క చోట కూడా వర్కౌట్ కాకపోవడంతో సినిమా అంతా బోర్ కొట్టిస్తుంది. కొన్ని చోట్ల నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ప్రేక్షకుడికి మరింత ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక దర్శకుడు విమల్ కృష్ణ అసలు ఏ పాయింట్‌తో ఈ కథను తెరకెక్కించాడన్నది కూడా స్పష్టంగా అనిపించదు. కథలో బలం లేకపోవడం ఒక ఎత్తయితే.. దాన్ని ఆసక్తికరంగా నడిపించే కథనం కూడా కనిపించదు. ఫలితంగా కామెడీ సినిమా కాస్తా.. కామెడీ లేని సినిమాగా మారిపోయింది. కనీసం ఒకట్రెండు సన్నివేశాల్లో అయినా నవ్విస్తే పర్వాలేదనిపించేది. కానీ సినిమా మొత్తం వెతికినా అలాంటి సందర్భం ఒక్కటి కూడా కనిపించదు. నిడివి కేవలం 111 నిమిషాలే అయినా.. ఫస్టాఫ్ చూసేసరికే నీరసించిపోతాం. ఇక సెకండాఫ్‌లో అయిన కాస్త కామెడీ ఉంటుందా అంటే.. అది మరింత చిరాకుగా ఉంటుంది. కామెడీ చిత్రం కాబట్టి కథ లేకపోయినా పర్లేదు కానీ మరీ కామెడీ లేకుండా చేస్తా ఎలా? డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడేనా ఈ సినిమా తెరకెక్కించింది? అనే అనుమానంతో థియేటర్స్‌ని నుంచి బయటకు వస్తాం. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రాగ్ మయూర్ తొలిసారి సోలో హీరోగా చేసిన సినిమా ఇది. సన్నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉండడంతో అతని నటన హైలెట్ కాలేదు. ఇక వాసు పాత్రలో అజయ్ కామెడీ చేసే ప్రయత్నం చేశాడు కానీ.. అది ఒక్క చోట కూడా వర్కౌట్ కాలేదు. ప్రిన్స్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. హీరోగా చేసిన ఆయన ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. రాశి కూడా అంతే.. సెకండాఫ్‌లో ఒకటి రెండు సీన్లలో కనిపిస్తుంది. బ్రహ్మాజీ, మెరిన్ ఫిలప్తో పాటు మిగిలిన నటీనటులలో ఒకరు కూడా తమ నటనతో ఆకట్టుకోలేకపోయారు. ఈ తప్పంతా పూర్తిగా దర్శకుడిది అనే చెప్పాలి. సాంకేతికంగా కూడా ఈ సినిమా గొప్పగా లేదు. శ్రీచరణ్ పాటలే కాదు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
అనుమాన పక్షి రిలీజ్ ట్రైలర్.. కొత్త డేట్ ఇదే..!
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొదటి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్లో కొత్త తేదీని రివీల్ చేశారు. కాగా.. ఈ మూవీలో ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. -
'ప్రతి విషయానికి అనుమానమే..'ఫుల్ కామెడీ ట్రైలర్ చూశారా?
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రతి చిన్న విషయానికి అనుమానపడే వ్యక్తి వల్ల అతనితో పాటు.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కోణంలోనే ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. -
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది.


