'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్‌ | Rag Mayur Latest Movie AnumanaPakshi Teaser Out now | Sakshi
Sakshi News home page

AnumanaPakshi Teaser: 'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'

Jun 9 2026 3:21 PM | Updated on Jun 9 2026 3:33 PM

Rag Mayur Latest Movie AnumanaPakshi Teaser Out now

యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్‌టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్‌ చిలకా, రాజేశ్‌ జగ్తియాని, హిరాచంద్‌ దండ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, ‍అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement