హనుమాన్ సీక్వెల్‌.. పవర్‌ఫుల్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో..! | Tollywood hero rana daggubati will acts in Hanuman Sequel | Sakshi
Sakshi News home page

Jai Hanuman Movie: హనుమాన్ సీక్వెల్‌.. పవర్‌ఫుల్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో..!

Jul 28 2026 5:14 AM | Updated on Jul 28 2026 5:24 AM

Tollywood hero rana daggubati will acts in Hanuman Sequel

హనుమాన్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌ పనులతో బిజీగా ఉన్నారు. జై హనుమాన్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ వైరలవుతోంది.

ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్ర రానా  పోషించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్రతో రానా కూడా చాలా రోజుల తర్వాత మరింత పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాతో రానా మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement