రామ్ చరణ్‌ మణికట్టు సర్జరీ సక్సెస్ | Ram Charan Undergoes Successful Wrist Surgery At Coimbatore Hospital, Check Out Health Update Inside | Sakshi
Sakshi News home page

Ram Charan: రామ్ చరణ్‌ మణికట్టు సర్జరీ విజయవంతం

Jul 28 2026 4:44 AM | Updated on Jul 28 2026 11:40 AM

Ram Charan surgery Completed successfully at Coimbatore

మెగా హీరో రామ్ చరణ్‌కు  మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు ఆయన అ‍క్కడే ఉండనున్నారు. ఆ తరవాత హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ​ఆర్థోపెడిక్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన క్లిష్టమైన వెన్నెముక సమస్యకు కూడా ఈయనే చికిత్స అందించారు.

ఈ ఏడాది జూన్‌లో పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్లలోనూ చేతికి కట్టుతోనే కనిపించాడు. దీనికి సర్జరీ అవసరమవుతుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు ఇన్నాళ్లకు చరణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పాటే తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు ఆయన భార్య ఉపాసన కోయంబత్తూరులోనే ఉన్నారు. సర్జరీ పూర్తి కావడంతో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement