ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి పట్ల ఉపాధ్యాయురాలు అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకపోవడంతో, ఆ బాలుడు యూరిన్ పాస్ చేశాడు. దీంతో బాలుడి ప్రైవేట్ భాగాలపై చాకు కాల్చివాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
బాలుడు తండ్రి కేసరి కుమార్ తన కుమారుడికి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. నర్సరీ చదువుతున్నబాధిత బాలుడు టాయిలెట్‌కి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయురాలు ప్రీతి కుష్వాహాను కోరాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో బాలుడు ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్, చిన్నారిని వేరే గదిలోకి తీసుకెళ్లి, చాకును వేడి చేసి ప్రైవేట్ భాగాలపై కాల్చి వాతలు పెట్టింది. అంతేకాకుండా బాలుడిని తీవ్రంగా కొట్టి, మళ్లీ ఈ తప్పు చేయవద్దని బెదిరించింది.
ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది
బాధతో ఇంటికి తిరిగొచ్చిన బాలుడు జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీచర్ దుర్మార్గాన్ని ప్రశ్నించిన తమపై స్కూల్ యాజమాన్యం బెదిరిస్తోందని కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు టీచర్, ప్రిన్సిపాల్, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపు తున్నారు.
ఇదీ చదవండి: ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
Deeply shocked by the horrifying incident in Varanasi, where a 5-year-old was brutally tortured by a teacher. Cruelty against children is unacceptable. I demand swift & strict legal action against the teacher & school admin. Zero tolerance for abuse! #Varanasi pic.twitter.com/mnOd0UOk3S
— Rais Shaikh (@rais_shk) July 27, 2026
అఖిలేష్ యాదవ్ స్పందన
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన దారుణమైన ఘటన అన్నారు. దీనివల్ల ఆ చిన్నారిపై జీవితాంతం కోలుకోలేని మానసిక ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో సానుభూతి, మానవత్వంతో ఎలా ప్రవర్తించాలో ఉపాధ్యాయులకు కనీస అవగాహన ఉండాలి. ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


