హైదరాబాద్‌లో మందాకిని | Priyanka Chopra Jonas has landed in Hyderabad to begin shooting SS Rajamouli Varanasi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మందాకిని

Jul 27 2026 12:13 AM | Updated on Jul 27 2026 12:13 AM

Priyanka Chopra Jonas has landed in Hyderabad to begin shooting SS Rajamouli Varanasi

భర్త నిక్, కుమార్తె మాల్తీతో ప్రియాంక

‘వారణాసి’ సినిమా కోసం మరోసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా. గతంలో ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఎక్కువసార్లు సోలోగా వచ్చిన ప్రియాంక ఈసారి మాత్రం భర్త నిక్‌ జోనస్, కుమార్తె మాల్తీతో కలిసి వచ్చారు. దీంతో ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ఓ లాంగ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుందని, ఇందుకోసమే ఫ్యామిలీతో సహా ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చి ఉంటారని టాక్‌.

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో మహేశ్‌బాబు కనిపిస్తారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. కొంత టాకీ పార్ట్‌ చిత్రీకరణ జరిగింది. తాజాగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు, ప్రియాంక ల్గొంటారని తెలిసింది. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement