ఊహించని నిర్ణయం తీసుకున్న మహేశ్ బావమరిది | Actor Sudheer Babu Make Directorial Debut Soon | Sakshi
Sakshi News home page

Sudheer Babu: వరస ఫ్లాప్స్.. తెలుగు హీరో షాకింగ్ నిర్ణయం

Jul 26 2026 8:47 PM | Updated on Jul 26 2026 8:47 PM

Actor Sudheer Babu Make Directorial Debut Soon

ఒకప్పుడు కాస్త అటుఇటుగా ఉన్నాసరే సినిమాలు ఆడేసేవి. ఇప్పుడలా అస్సలు లేదు. ఏ మాత్రం కంటెంట్ తేడాగా ఉన్నాసరే తొలి ఆట నుంచి డిజాస్టర్ టాక్ లేదంటే విపరీతమైన ట్రోలింగ్ గ్యారంటీ. దీంతో యువ హీరోలకు ఏం చేయలో దిక్కుతోచట్లేదు. పలువురి దర్శకులు చెబుతున్న స్టోరీలో వింటున్నప్పటికీ పెద్దగా నమ్మకం కుదరట్లేదే ఏమో గానీ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడా లిస్టులోకి మహేశ్ బాబు బావమరిది, హీరో సుధీర్ బాబు కూడా చేరినట్లు కనిపిస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)

2012లో 'శివ మనసులో శృతి' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన సుధీర్ బాబు.. ఇప్పటివరకు 20కి పైగా మూవీస్ చేశాడు. వీటిలో ప్రేమకథా చిత్రం, సమ్మోహనం తప్పితే చెప్పుకోదగ్గవి పెద్దగా లేవు. గతేడాది 'జటాధర' అంటూ పాన్ ఇండియా ప్రయత్నాలు చేశాడు గానీ ఘోరంగా బెడిసికొట్టింది. అప్పటినుంచి డైలామాలో పడిపోయిన సుధీర్ బాబు.. ఇప్పుడు తానే దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నాడట.

కొన్నిరోజుల క్రితం హీరో రామ్ ఎలా అయితే తనే కథ రాసుకుని, హీరో కమ్ దర్శకుడు అయ్యాడో ఇ‍ప్పుడు అదే దారిలోకి సుధీర్ బాబు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కథ రాసుకుని హీరోగా నటించి దర్శకుడిగానూ మారే ప్రయత్నాలు సుధీర్ బాబు ఉన్నాడట. త్వరలో ఈ విషయమై ప్రకటన రానుందని టాక్.

సుధీర్ బాబు, రామ్ అనే కాదు విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం లాంటి యువహీరోలు కూడా తామే స్టోరీ రాసుకుని దర్శకులుగా మారిపోయారు. సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్, నవీన్ పొలిశెట్టి లాంటి హీరోలైతై డైరెక్షన్ తప్పితే దాదాపు అన్ని పనులు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'రాయన్'కి జాతీయ అవార్డ్‌.. విమర్శలకు ధనుష్ కౌంటర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement