జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే డ్రాగన్‌కు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ భాజ్‌పేయి నటించనున్నారని లేటేస్ట్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే అతన్ని మేకర్స్ సంప్రదించారని టాక్. ఓ కీలక పాత్ర కోసం మనోజ్‌ను చిత్ర యూనిట్ అడిగినట్లు తెలుస్తోంది. ఓకే అయితే వచ్చే షూటింగ్ షెడ్యూల్‌లోనే మనోజ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. కాగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.


