Dragon Movie
-
'డ్రాగన్', 'పెద్ది'.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి?
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరోజు వ్యవధిలో రెండు అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'పెద్ది' ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మూమెంట్స్, పంచ్ డైలాగ్స్ లాంటి వాటికంటే స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఫోకస్ చేసి చూపించారు. మెగా అభిమానులు సంతృప్తి చెందారు కానీ సగటు ఆడియెన్స్‌కి మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. యాక్టింగ్ పరంగా చరణ్‌ని వంకపెట్టడానికి లేదు గానీ మాస్ మూమెంట్స్ లాంటివి ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేశారు. అవి లేకపోవడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందన్నట్లు టాక్ వినిపిస్తోంది. భోపాల్, హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేయొచ్చంటున్నారు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.'డ్రాగన్' విషయానికొస్తే ఇందులోనూ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. డ్రగ్ మాఫియా, అందులోని విలన్స్‌ని చూపించారు. ఎన్టీఆర్ కూడా అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. కానీ ట్రైలర్లో అందుకు సంబంధించిన యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ లాంటి వాటికి పెద్దగా చోటివ్వలేదు. మూవీ థియేటర్లలోకి రావడానికి మరో ఏడాది సమయముంది కాబట్టి ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌లో ఫైట్ సీన్స్ లాంటివి ఉండే అవకాశముంది.ఈ రెండింటిని పోల్చి చూడలేం గానీ రెండింటికి యునానిమస్ టాక్ అయితే రాలేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేదు. కొందరికి విపరీతంగా నచ్చేశాయి. మరికొందరికి మాత్రం ఓ మాదిరిగా మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్పందన వస్తోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు) -
ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు
కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం తారక్ చాలా బక్కచిక్కిపోయాడు. గతంలో పలు ఈవెంట్స్‌లో అలానే కనిపించాడు. అయితే అంతలా బరువు తగ్గిపోవడానికి కారణాన్ని ఇన్నాళ్లకు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'మూవీ షూటింగ్ మొదలుపెడదామనగా.. ఎన్టీఆర్‌ని కొంచెం సన్నబడమని చెప్పాను. కానీ ఆయన మాత్రం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. తారక్ భార్య, తల్లి, ఫ్రెండ్సే కాదు నా టీమ్ కూడా నన్నే తిట్టారు. నేనే ఇదంతా చేశానని అన్నారు. ఎందుకంటే మరీ బక్కగా, బలహీనంగా కనిపించాడు. నేను కూడా చాలాసార్లు ఇక సరిపోతుంది ఆపేయమని చెప్పా. అయినా వినలేదు''కథ కోసం, తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆయనని ఆపడం చాలా కష్టం. ఇంత పట్టుదల గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగతంగా సమస్య ఉందని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. పాత్ర కోసం పడిన కష్టమే అది' అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఆఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే నరహంతకుడిగా కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిల్ కపూర్, జిబు మేనన్, ఖుష్బూ, అశుతోష్ రాణా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. అతిపెద్ద దేశభక్తి సినిమా: ప్రశాంత్ నీల్)#PrashanthNeel says, 'We spent four months looking at him ( #NTR ) suffer.'“I told him that if you became THINNER for the role of the assassin, it would help.His wife, his mother, all his friends and my whole team were UPSET with me.” pic.twitter.com/FpJ7Puj0BW— Whynot Cinemas (@whynotcinemass_) May 20, 2026 -
ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న.. సమాధానానికి నాకు మూడేళ్లు పట్టింది
ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అభిమానులకు నచ్చేయగా సాధారణ ప్రేక్షకులకు మాత్రం సరైన యాక్షన్ ఏదో మిస్ అయిందే అని ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతుల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విశేషాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)'ఐదేళ్ల క్రితమే ఈ మూవీకి సంబంధించిన కోర్ ఐడియాని ఎన్టీఆర్‌కి చెప్పా. అయితే 'ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?' అని నన్ను అడిగారు. దీంతో ఆ పాత్ర ప్రవర్తన, అది చేసే పనులు జస్టిఫై చేయడానికి.. దాని వెనకున్న బలమైన కారణాన్ని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడానికి నాకు, నా టీమ్‌కి మూడేళ్లు పట్టింది. ఇదంతా సిద్ధమైన తర్వాత.. నేను రెడీ అని తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇంతటి స్టార్డమ్ ఉన్న ఓ హీరో, ఇలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం చాలా కఠిన నిర్ణయం. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు ఆ విషయం అర్థమవుతుంది''ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నేను రాసిన అన్ని పాత్రల కంటే అత్యంత క్రూరంగా ఉంటుంది. నా ట్రయాలజీ(కేజీఎఫ్, సలార్)లో.. ఈ జానర్లో 'డ్రాగన్' చివరి సినిమా. ఈ మూడు ఒకేలా కనిపించడానికి కలర్ కారణం. కానీ మూడు వేర్వేరు స్టోరీలు. దీని తర్వాత కలర్‌ఫుల్ మూవీస్ చేస్తా. మైథాలజీ ఆధారంగా ఓ కథ రాశాను. ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాన్ని సినిమాగా తీస్తాను. 'డ్రాగన్' ద్వారా అతిపెద్ద దేశభక్తి సినిమాని అందించబోతున్నాను' అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.డ్రాగన్.. దేశభక్తి సినిమా అని ప్రశాంత్ నీల్ అనగానే ఎదురుగా ఉన్న యాంకర్ కూడా షాకయ్యారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని చెప్పుకొచ్చారు. మరి డైరెక్టర్ చెప్పినట్లు ఎలాంటి దేశభక్తి చూపిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బూ, రుక్మిణి వసంత్, అశుతోష్ రానా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?) -
ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్
అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చేసింది. నాలుగున్నర నిమిషాల వీడియోతో అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. 'డ్రాగన్' ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఒపియమ్ అనే మొక్క, దీని ద్వారా వచ్చే హెరాయిన్.. దీని చుట్టూ ఉండే మాఫియా బ్యాక్‌డ్రాప్ ఇందులో చూపించబోతున్నారు. అయితే ఇందులో ఏకంగా ఎనిమిది విలన్స్ కనిపించడం అందరికీ షాకిచ్చింది. అసలు వీళ్లెవరు? ఏ ఇండస్ట్రీకి చెందినవాళ్లు? ఏయే సినిమాలు చేశారు? వాళ్ల వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!)మొదటగా ఎన్టీఆర్ విషయానికొస్తే.. పేరుకే హీరో అయినప్పటికీ విలనీ టచ్ ఉన్న లూగెర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన హంతకుల ముఠాకు నాయకుడిగా నటించాడు.మొత్తం ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ అయిన దాదా సర్కార్ పాత్రలో తెలుగు, తమిళ, హిందీలో గతంలో పలు సినిమాలు చేసిన అశుతోష్ రాణా నటించాడు. తెలుగులో ఈయన వెంకీ, బంగారం, బలుపు, తడాఖా, పటాస్ తదితర మూవీస్ చేశాడు. ముంబైకి చెందిన ఇతడు ఎక్కువగా హిందీ మూవీస్ చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ అయిన సుజోయ్ సర్కార్ పాత్రని అన్షుమాన్ పుష్కర్ అనే హిందీ నటుడు చేశాడు. ఇతడో సీరియల్ నటుడు. 2018 నుంచి హిందీ సీరియల్స్ చేస్తున్నాడు. 12th ఫెయిల్, మాలిక్ లాంటి మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన బాబీ సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా కనిపించబోతున్నాడు. ఇతడు కూడా హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసమే తొలుత మలయాళ హీరో టొవినో థామస్‌ని అడిగారని అంటున్నారు. బాబీ సర్కార్, లూగెర్.. అన్నదమ్ముల పాత్రలట.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో రావ్ అనే అకౌంటెంట్ పాత్రని తమిళ నటుడు గురు సోమసుందరం చేశాడు. ఇతడు గతంలో తెలుగులో చీకటిరాజ్యం, స్కార్క్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. కానీ మలయాళ మూవీ 'మిన్నళ్ మురళి' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ద ట్రైనర్ పాత్రలో 'ధురంధర్'లో షిరానీ సాబ్‌గా నటించిన బిమల్ జీత్ ఒబెరాయ్ కనిపింతబోతున్నాడు. ఇతడికో పెద్ద సైన్యమే ఉండబోతుంది. ముంబైకి చెందిన ఇతడు గతంలో పీకే, టైగర్ 3 చిత్రాల్లోనూ కనిపించాడు గానీ 'ధురంధర్' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.రష్యన్ డిస్ట్రిబ్యూటర్ విక్టర్ మేన్స్కోవ్ పాత్రలో రష్యన్ నటుడు అలెగ్జాండర్ మిజేవ్, సోమాలియా నియంత జనరల్ దురాన్ పాత్రలో బ్రిటీష్ నటుడు బెన్డిక్ట్ పాల్ గారెట్, ఆఫ్రికా-యూరప్ డిస్ట్రిబ్యూటర్ బిలే క్సెర్సీ పాత్రలో దక్షిణాఫ్రికా నటుడు తుతేలో ప్రిన్స్ గ్రాట్బూమ్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ విలన్ పాత్రలే.వీళ్లతో పాటు ఆఫ్గానిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహ్మాన్ పాత్రలో మలయాళ ప్రముఖ నటుడు బిజు మేనన్ కనిపించబోతున్నారు. ఈయన గతంలో తెలుగులో 'రణం', ఖతర్నాక్ మూవీస్‌లో నటించారు. ఓటీటీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈయన కాస్త సుపరిచితమే.అలానే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్(ఇండియా) రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించారు. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా చేశారు. రీసెంట్ టైంలో 'యానిమల్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిజు మేనన్, అనిల్ కపూర్‌వి 'డ్రాగన్'లో పాజిటివ్ పాత్రలనిపిస్తోంది.పైన చెప్పిన నటులతో పాటు ఈ మూవీలో తమిళ నటి ఖుష్బూ కూడా నటించింది. గ్లింప్స్‌లో విలన్స్ అందరి గురించి చెప్పే పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది గానీ ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు. వీళ్లతో పాటు రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, శత్రు తదితరులు ఇతర సహాయ పాత్రలు చేశారు.ప్రస్తుతం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అందులో విలన్స్‌ని మాత్రమే చూపించారు. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, అందులో విలన్స్ ఎవరెవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. మరి అందులో ఎంతమంది విలన్స్ ఉంటారో ఏంటో?(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)


