బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి | Rukmini Vasanth Reacts Her Bikini Look | Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: బికినీ ఫొటోలపై 'డ్రాగన్' హీరోయిన్ ఆగ్రహం

May 23 2026 3:04 PM | Updated on May 23 2026 3:14 PM

Rukmini Vasanth Reacts Her Bikini Look

కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరు చెప్పగానే సంప్రదాయ పాత్రలే గుర్తొస్తాయి. అలాంటిది ఈమె స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి ఫొటోషూట్ చేసిందని చెప్పి ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. నిజంగానే రుక్మిణి ఇలా చేసిందా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు సదరు బికినీ పిక్స్‌పై ‍స్వయంగా రుక్మిణినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్‌.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: టాలీవుడ్ హీరోయిన్‌)

'ఏఐ సాయంతో సృష్టించిన నా ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడం నేను, నా టీమ్ గుర్తించాం. అవన్నీ ఫేక్. ఏఐతో తయారు చేశారని క్లారిటీ ఇస్తున్నాను. ఇలాంటివి క్రియేట్ చేయడం నిజంగా బాధ్యతారాహిత్యమే. అలానే మా వ్యక్తిగత గోప్యతని ఉల్లంఘించడమే అవుతుంది. దీన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఫొటోలని సృష్టించిన వాళ్లతో పాటు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు మొదలుపెట్టాం. ఇలాంటి వాటిని పోస్ట్ చేయడం, షేర్ చేయడం లాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని రుక్మిణి చెప్పుకొచ్చింది.

రీసెంట్ టైంలో ఇలా జరగడం మరీ ఎక్కువైపోయింది. గతంలో పలువురు ఫొటోగ్రాఫర్లు.. వెనక వైపు నుంచి, అసభ్యకర యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నారని రుక్మిణితో పాటు పలువురు కన్నడ హీరోయిన్లు ఆ‍గ్రహం వ్యక్తం చేశారు. ఇప్పడిలా జరిగింది. యాంకర్ అనసూయకి కూడా ఇలానే జరగడంతో కేసు పెట్టింది.

రుక్మిణి సినిమాల విషయానికొస్తే.. కన్నడలో చేసిన 'సప్త సాగర ఎల్లో దాచే' రెండు భాగాలతో పాటు 'కాంతార' సీక్వెల్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'డ్రాగన్'లో నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ‍థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement
 
Advertisement
Advertisement