ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ‍థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన | Kara Movie OTT Telugu Streaming Details Latest | Sakshi
Sakshi News home page

Kara OTT Telugu: దొంగతనాల కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

May 23 2026 2:44 PM | Updated on May 23 2026 2:48 PM

Kara Movie OTT Telugu Streaming Details Latest

థియేటర్లలో రిలీజైన చిన్నాపెద్దా సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా సతీ లీలావతి, గాయపడ్డ సింహం, సిస్టమ్, లవ్ యూ రా, 14, రాజుగాని సవాల్, మధువిధు, టీఎన్ 2026 లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

ధనుష్, మమిత బైజు జంటగా నటించిన సినిమా 'కర'. విఘ్నేశ్ రాజా దర్శకుడు. ఓ మాదిరి అంచనాలతో గత నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగతనానికి సంబంధించిన సీన్స్ బాగున్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు అంతంత మాత్రంగానే మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ వచ్చే గురువారం(మే 28) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'కర' విషయానికొస్తే.. కరస్వామి(ధనుష్) ఓ దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి(మమిత బైజు) కోసం అదంతా వదిలేసి కష్టపడాలని నిర్ణయించుకుంటాడు. ఓ హోటల్ పెట్టాలనుకుని దానికి అవసరమైన డబ్బు కోసం ఊరిలోని తమ పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతాడు. మళ్లీ దొంగతనాలు చేసేందుకు సిద్ధమవుతాడు. ఒకే ‍బ్యాంక్‌కి చెందిన బ్రాంచ్‌ల్లో డబ్బులు కొల్లగొట్టేస్తుంటాడు. కర ఇలా చేయడానికి కారణమేంటి? చివరకు పోలీసులకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement