kara
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి త్రికాల, బ్లాస్ట్ జోన్, కాటలాన్ లాంటి చిన్న, డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే ధనుష్ 'కర', సత్య 'జెట్ లీ', 'డ్రింకర్ సాయి' తదితర సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయగా ఇవి కాకుండా మరో 16కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు శుక్రవారం ఒక్కరోజే రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 29)అమెజాన్ ప్రైమ్లీడర్ - తెలుగు డబ్బింగ్ మూవీసుఖమానో సుఖమమ్ - మలయాళ సినిమాద లాస్ట్ వికింగ్ - డానిష్ మూవీహాట్స్టార్కజిన్స్ అండ్ కల్యాణమ్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్లార్డ్ కర్జోన్ కీ హవేలీ - హిందీ సినిమా (మే 30)జాలీ ఎల్ఎల్బీ 3 - హిందీ మూవీజెట్ లీ - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)ఆహాసచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ - తెలుగు సినిమానెట్ఫ్లిక్స్బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ - పోర్చుగీస్ సిరీస్కలబాసస్ కాన్ఫిడెంటల్ - ఇంగ్లీష్ సిరీస్రఫా - స్పానిష్ సిరీస్కర - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)సన్ నెక్స్ట్ఫేసెస్ - తెలుగు డబ్బింగ్ సినిమాజీ5ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - బెంగాలీ సిరీస్డ్రింకర్ సాయి - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ - ఇంగ్లీష్ సినిమాస్టార్ సిటీ - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేద రేస్ - రొమేనియన్ మూవీహెచ్బీఓ మ్యాక్స్ద మూమెంట్ - ఇంగ్లీష్ సినిమా(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. మే నెల కూడా చివరకొచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన 'మరీచిక', సందిగ్దం అనే తెలుగు సినిమాలతో పాటు కాటలాన్, బ్లాస్ట్ అనే డబ్బింగ్ మూవీస్.. ఈ వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో దేనిపైనా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో 19 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: మళ్లీ సినిమాల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ధనుష్ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'కర', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ', 'లీడర్' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఫేసెస్, కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంటి డబ్బింగ్ మూవీ, సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (మే 25 నుంచి 31 వరకు)నెట్ఫ్లిక్స్అన్టోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 26ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టూ మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 27మై టూ సెంట్స్ (ఇటాలియన్ సిరీస్) - మే 27కర (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 28ఎమి మార్టినజ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28మర్డర్ మైండ్‌ఫుల్లీ (జర్మన్ సిరీస్) - మే 28ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 28బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ (పోర్చుగీస్ సిరీస్) - మే 29కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29రఫా (స్పానిష్ సిరీస్) - మే 29అమెజాన్ ప్రైమ్స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 27లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 28హాట్స్టార్జెట్లీ (తెలుగు సినిమా) - మే 25బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 27కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29సన్ నెక్స్ట్ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 29జీ5రూమ్మేట్స్ (కన్నడ సిరీస్) - మే 27ఆపిల్ టీవీ ప్లస్ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 29స్టార్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29లయన్స్ గేట్ ప్లేద రేస్ (రొమేనియన్ మూవీ) - మే 29(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన
థియేటర్లలో రిలీజైన చిన్నాపెద్దా సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా సతీ లీలావతి, గాయపడ్డ సింహం, సిస్టమ్, లవ్ యూ రా, 14, రాజుగాని సవాల్, మధువిధు, టీఎన్ 2026 లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)ధనుష్, మమిత బైజు జంటగా నటించిన సినిమా 'కర'. విఘ్నేశ్ రాజా దర్శకుడు. ఓ మాదిరి అంచనాలతో గత నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగతనానికి సంబంధించిన సీన్స్ బాగున్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు అంతంత మాత్రంగానే మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ వచ్చే గురువారం(మే 28) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'కర' విషయానికొస్తే.. కరస్వామి(ధనుష్) ఓ దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి(మమిత బైజు) కోసం అదంతా వదిలేసి కష్టపడాలని నిర్ణయించుకుంటాడు. ఓ హోటల్ పెట్టాలనుకుని దానికి అవసరమైన డబ్బు కోసం ఊరిలోని తమ పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతాడు. మళ్లీ దొంగతనాలు చేసేందుకు సిద్ధమవుతాడు. ఒకే బ్యాంక్‌కి చెందిన బ్రాంచ్‌ల్లో డబ్బులు కొల్లగొట్టేస్తుంటాడు. కర ఇలా చేయడానికి కారణమేంటి? చివరకు పోలీసులకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి ఈ సామెతని అన్వయించుకుంటే.. సొంత భాషల్లో హిట్స్ కొట్టిన అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కానీ తమిళ హీరో ధనుష్ పరిస్థితి మాత్రం కాస్త చిత్రంగా అనిపిస్తుంది. రీసెంట్ టైంలో వచ్చిన ఇతడి సినిమాలు, వాటి ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)ధనుష్ పేరు చెప్పగానే ఆల్‌రౌండర్ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా విభిన్న బాధ్యతల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాడు. మధ్య పాటల రాసేస్తుంటాడు. కుదిరితే పాడేస్తుంటాడు కూడా. వీటి విషయంలో ఇతడిని వంక పెట్టడానికి ఏం లేదు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇతడి మూవీస్ చూస్తే మాత్రం పరభాషలో చేసినవన్నీ హిట్ అవుతున్నాయి. సొంత భాషలో చేసినవి మాత్రం అక్కడివరకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తుంది.గత కొన్నేళ్లలో తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ధనుష్.. అణిచివేత గురయ్యే తరహా పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నాడు. దీంతో తమిళ ప్రేక్షకులకే ధనుష్ మూవీస్‌పై మొనాటనీ వచ్చేసింది. వేరే దర్శకులు తీస్తున్నా ధనుషే సొంత డైరెక్షన్ చేస్తున్నా కాన్సెప్ట్ దాదాపు ఇదే ఉంటోంది. ఈ తరహా చిత్రాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెద్దగా ఆడట్లేదు. గత రెండేళ్లలో రిలీజైన రాయన్, ఇడ్లీ కొట్టు తరహా చిత్రాలతో పాటు గత వీకెండ్ రిలీజైన 'కర' మూవీలో ఇదే తరహా కాన్సెప్ట్స్ ఉండటం మైనస్ అవుతోంది. ఇవన్నీ తమిళంలో ఓ మాదిరిగా ఆడుతుంటే మిగతా చోట్ల మాత్రం దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి.మిగతా భాషల్లో మాత్రం ధనుష్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'సర్'లో టీచర్‌గా ధనుష్ అదరగొట్టేశాడు. శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'లో బిచ్చగాడిగా మెప్పించాడు. గతేడాది చివరలో వచ్చిన హిందీ చిత్రం 'రే ఇష్క్ మై'లోనూ శ్రుతిమించే ఎమోషన్స్ ఉండే ప్రేమికుడిగానూ ఆకట్టుకున్నాడు. చూస్తుంటే ఎప్పుడో ఇంట గెలిచేసినా ధనుష్.. రీసెంట్ టైంలో మాత్రం సొంత భాషా సినిమాలతో హిట్స్ కొట్టలేకపోతున్నాడు. అదే టైంలో తెలుగు, హిందీలో మాత్రం హిట్స్ కొడుతూ అదరగొట్టేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
ఈ వీకెండ్ థియేటర్లలోకి తెలుగులో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. కమెడియన్ సత్య హీరోగా నటించిన 'జెట్లీ', దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన 'గాయపడ్డ సింహం' చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేశాయి? వీటి కంటే ఒకరోజు ముందు రిలీజైన ధనుష్ 'కర' సంగతేంటి?(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)కమెడియన్ సత్య, లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. ప్రమోషన్స్‌తో అయితే ఆకట్టుకున్నారు గానీ మూవీలో చెప్పుకోదగ్గ కామెడీ లేదు, అలానే స్టోరీ కూడా గందరగోళంగా ఉండటం లాంటివి మైనస్ అయ్యాయి. స్టార్స్ ఎవరూ లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే వసూలు చేసింది. తొలిరోజు రూ.1.30 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ప్రారంభంలో ఓ సినిమాతో వచ్చిన తరుణ్ భాస్కర్.. మూడు నెలలు తిరిగేసరికల్లా 'గాయపడ్డ సింహం' అంటూ వచ్చాడు. ట్రంప్‌పై చేతబడి చేయడం అనే విచిత్రమైన స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలోనూ పెద్గగా చెప్పుకోదగ్గ కామెడీ లేదు. దీంతో దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.76 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇకపోతే గురువారం(ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చిన ధనుష్ 'కర' సినిమా సీరియస్‌గా సాగే డ్రామా. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. అయితేనేం రెండు రోజుల్లో రూ.20.20 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. 1990ల్లో రైతుల్ని బ్యాంక్‌లు లోన్స్ పేరు చెప్పి ఎలా మోసం చేసేవి అనే కల్పిత కథతో దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తమిళ హీరో ధనుష్‌కి టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే నేరుగా తెలుగులో సార్, కుబేర లాంటి సినిమాలు చేసి అలరించాడు. అంతేకాదు ఆయన నటించిన తమిళ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఆ మధ్య ఇండ్లీ కొట్టుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు..ఇప్పుడు ‘కర’తో వచ్చాడు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్ చేశాయి. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు. లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో కూడిన రాబిన్‌వుడ్ కథ ఇది. అంటే హీరో దొంగ..కానీ మంచి కోసం దొంగతనం చేస్తుంటాడు. కిక్ సినిమాలో రవితేజ కోటీశ్వర్లు, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులను కొట్టేస్తే.. ఇక్కడ ధనుష్ బ్యాంకుల్లోని డబ్బును మాత్రమే కొట్టేస్తాడు. అది కూడా ఒక్క బ్యాంకులోని డబ్బులు మాత్రమే. దానికీ ఓ కారణం ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు విఘ్నేష్ రాజా ఎంచుకున్న పాయింట్ రాబిన్‌వుడ్ కథలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న భావోద్వేగ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా చదువురాని రైతులను వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనేది బాగా చూపించారు. హీరో ఎమ్మెల్యే ఇంట్లో చివరి దొంగతనం చేసే యాక్షన్ సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. అతను పోలీసులకు దొరకడం.. డీఎస్పీ భరతన్ నుంచి తప్పించుకొని పారిపోవడం.. ఇదంతా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే కథ 6 నెలల ముందుకు జరిగిన తర్వాత కొంత నెమ్మదిగా సాగుతుంది. హీరోహీరోయిన్లు కలిసి హోటల్ పెట్టాలనుకోవడం.. ఈ క్రమంలో హీరో సొంతూరుకి తిరిగిరావడం.. తండ్రి-కొడుకుల బాండింగ్..ఇదంతా కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ చోరీ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ద్వితియార్థం ఆసక్తికరంగా సాగుతుంది. వరుస బ్యాంకు రాబరీలు.. డీఎస్పీ ఇన్వెస్టిగేషన్..మరోవైపు బ్యాంకు మేనేజర్ ఇచ్చే ట్విస్టు..ఇవన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. హీరో దొంగతనం కోసం బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారి..ఎలా బయటపడతాడా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా బలమైన స్క్రీన్‌ప్లేతో సెకండాఫ్ కథను రాసుకున్నారు. రైతు కష్టాలతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్‌తో కథను ముగించిన తీరు బాగుంది. ఎవరెలా చేశారంటే..ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. తనదైన సహజ నటనతో కరస్వామి పాత్రకు ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనుష్ వన్ మ్యాన్ షో ఇది. మమిత బైజు తెరపై కనిపించేంది కాసేపే అయినా.. చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. డీఎస్పీ భరతన్‌గా సూరజ్ వెంజర్మూడు, బ్యాంకు మేనేజర్‌గా జయరాంతో పాటు , కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలతో పాటు తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. తెరపై తెలుగు సినిమానే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇషారి కె గణేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కామన్ మేన్‌కి కనెక్ట్ అవుతుంది
‘‘ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యలు, భావోద్వేగాలతో ‘కర’ సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ మూవీ కనెక్ట్ అవుతుంది’’ అని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్ సతీష్ కుమార్ తెలిపారు. ధనుష్, మమితా బైజు జంటగా నటించిన తమిళ చిత్రం ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించారు. ఈ సినిమా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ద్వారా తెలుగులో నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సీహెచ్ సతీష్ కుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అర్జున్ రెడ్డి, కబాలి, సింగం 3, సలార్, కాంతారా చాప్టర్ 1’ వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ధనుష్‌గారి ‘ధర్మయోగి’ సినిమాని తెలుగులో రిలీజ్ చేశాను. ‘కర’ మూవీ తెలుగు వెర్షన్ చూడలేదు. అయినప్పటికీ ధనుష్, విఘ్నేశ్గార్లపై నమ్మకంతో రిలీజ్ చేస్తున్నాను. ఈ మూవీ కోసం నా ఫ్రెండ్ రాజేశ్‌కుమార్ బొబ్బర సపోర్ట్ తీసుకున్నాను. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తెలుగులో 80 శాతం బిజినెస్ పూర్తి చేశాం. ఈ మూవీని నైజాంలో ‘దిల్’ రాజుగారు, ఉత్తరాంధ్రలో నేను పంపిణీ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
ధనుష్‌లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?
టాలీవుడ్లో ఇప్పుడో చిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. స్టార్ హీరోల్లో చాలామంది ఒక్క సినిమా కోసం ఏకంగా ఏళ్లకు ఏళ్లు పనిచేస్తారు. పోనీ ఆ మూవీ సరిగా ఉంటుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు ఏడాదిలో రెండు మూడు చిత్రాలు చేసిన హీరోలు కూడా ఫెర్ఫెక్షన్ పేరిట టైమ్ అంతా వృథా చేస్తున్నారు. అదే టైంలో తెలుగు హీరోల్లానే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మాత్రం ఒంటి చేత్తో మూడు బాధ్యతల్ని అద్భుతంగా పూర్తి చేస్తున్నాడు. ధనుష్ వల్ల అవుతున్న ఆ పని.. మిగతా హీరోల వల్ల ఎందుకు కావట్లేదు?(ఇదీ చదవండి: స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్: తమిళ సింగర్)చాలామందికి ధనుష్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఇతడిలో ఓ డైరెక్టర్, నిర్మాత కూడా ఉన్నాడు. గడిచిన 15 నెలలు తీసుకుంటే.. గతేడాది ప్రారంభంలో తన మేనల్లుడు పవిష్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీశాడు. దీనికి దర్శకుడు నిర్మాత ధనుషే. ఇది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆకట్టుకుంది. ఇక వేసవిలో 'కుబేర'తో వచ్చాడు. బిచ్చగాడి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేశాడు. దసరా వచ్చేసరికి 'ఇడ్లీ కొట్టు' మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ చిత్రం కోసం హీరో, డైరెక్టర్, నిర్మాతగా మూడు బాధ్యతల్ని నిర్వర్తించాడు. తెలుగులో ఇది ఫెయిలైనప్పటికీ తమిళంలో సూపర్ హిట్ అయింది.గతేడాద చివరలో 'తేరే ఇష్క్ మై' అనే హిందీ సినిమాలో హీరోగా నటించాడు. రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగు నెలలు తిరిగేసరికల్లా 'కర' మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు. దీని ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.అయితే ఏడాదిన్నర కాలంలో ధనుష్.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఐదు సినిమాలు చేశాడు. మరి ఇతడి వల్ల అవుతున్న పని మిగతా హీరోలకు ఎందుకు సాధ్యం కావడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఫెర్ఫెక్షన్ పేరు చెప్పి ఆలస్యం చేయడమనేది ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. ఎందుకంటే రెగ్యులర్‌గా సినిమాలు చేస్తేనే సినిమా మీద ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అలానే రెగ్యులర్ టచ్‌లో ఉంటే ఆడియెన్స్ కూడా సదరు హీరోల చిత్రాల్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఈ విషయాన్ని తెలుగు, తమిళ హీరోలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో?(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర) -
లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకైన ధునుష్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా ఈవెంట్ కోసం ఎప్పుడు వచ్చిన.. ధనుష్‌ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తుంటారు. నిన్న(ఏప్రిల్ 26) హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ అదే జరిగింది. ధనుష్ వస్తున్నాడని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. అందులో ఓ మహిళా అభిమాని చేసిన పనికి ధనుష్ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?ధనుష్ కోసం..ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్‌కి ధనుష్ కూడా వస్తున్నాడని తెలిసి ఓ మహిళా అభిమాని ఆ హోటల్‌కి వెళ్లింది. తన అభిమాన హీరోని లైవ్‌లో చూసి మురిసిపోయింది.మోకాళ్లపై కూర్చోని.. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా.. సదరు మహిళా అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్‌ను దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను పలకరించగానే.. భావోద్వేగానికి లోనైంది. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది. ఊహించని ఈ పరిణామానికి ధనుష్ షాకయ్యాడు. క్షణాల్లో తెరుకొని వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event.#MamithaBaiju pic.twitter.com/ZtTLrqPmId— Milagro Movies (@MilagroMovies) April 26, 2026 -
నా హృదయానికి దగ్గరైన సినిమా కర : ధనుష్
‘‘అసాధారణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక సాధారణ మనిషి కథ ‘కర’. నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది’’ అని ధనుష్ అన్నారు. ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘కర’ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘విఘ్నేష్ రాజా స్పెషల్ ఫిల్మ్‌మేకర్. ‘కర’లాంటి సినిమా ఇచ్చిన తనకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘కర’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అంటున్న అతిథి బుచ్చిబాబుని రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘పెద్ది’ అప్డేట్ కోసం అడగ్గా.. ‘‘స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జూన్ 25న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మరో అతిథి వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సార్’ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందుకు రెండున్నర రెట్లు ఎక్కువగా ‘కర’ హిట్ కావాలి’’ అని చెప్పారు. ఇషారి కె. గణేశ్ మాట్లాడుతూ– ‘‘మన జీవితంలో నిత్యం జరుగుతున్నవే ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ధనుష్‌గారు ‘కర’కు ఓకే చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రేక్షకుల డబ్బు, సమయాన్ని గౌరవించేలా ఈ సినిమా వారిని ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చెప్పారు విఘ్నేష్ రాజా. సతీష్ మాట్లాడుతూ –‘‘ధనుష్ సార్‌తో ఓ మంచి హిట్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. నా మిత్రుడు రాజేశ్ స΄ోర్ట్ చాలా ఉంది’’ అన్నారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని నా ΄ాత్ర కోసం ్ర΄ోస్థటిక్ మేకప్ వేయడానికి, తీయడానికి నాలుగు గంటలు పట్టేది’’ అని అన్నారు. -
నన్ను ఎగతాళి చేశారు.. నేషనల్ అవార్డ్‌తో సమాధానం చెప్పా
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్‌కు ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
'తాను నాటింది తానే నరుక్కోవాలి'.. ఆసక్తిగా కర తెలుగు టీజర్
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తుంటే అన్యాయంపై పోరాడే పాత్రలో ధనుశ్ నటించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే ఈ ఫుల్ అగ్రెసివ్‌గా కథ ఉండనున్నట్లు అర్థమవుతోంది. 'తాను నాటింది తానే నరుక్కోవాలి.. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చను తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
బ్యాంక్ దొంగగా ధనుష్.. ఆసక్తికరంగా ట్రైలర్
ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది. పెట్రోలు ఉత్పత్తి అయ్యే చోట్ల ఇరాన్ దాడులు చేయడం లాంటివి చూశాం. ఈ అంశాన్ని ఓ పాయింట్‌గా చూపించి తీసిన సినిమా 'కర'. ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)ట్రైలర్ బట్టి చూస్తే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఓ పల్లెటూరిలో ఉండే హీరో.. బ్యాంకు దొంగతనాలు చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో వాటిని ఆపేసి పెళ్లి చేసుకుని సాధారణంగా బతుకుతుంటాడు. అలాంటి ఇతడు మళ్లీ ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది. ఇతడిని అడ్డుకునేందుకు పోలీస్(సూరజ్ వెంజరమూడు) ఏం చేశాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.గతంలో 'పొర్ తొళిల్' అనే థ్రిల్లర్ తీసి అద్భుతమైన హిట్ కొట్టిన విఘ్నేశ్ రాజా.. ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఇది థియేటర్లలోకి రానుంది. ఆ తేదీకి రావాల్సిన 'పెద్ది' వాయిదా పడింది. మరి ధనుష్ 'కర'తో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి? ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా వదులుతారు.(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా) -
సోల్ ట్రేడ్..: ఉత్తమ అత్తాకోడళ్లు
చెన్నైలోని ఎస్ఆర్యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి. నిర్మాణ్ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్ (మధ్యప్రదేశ్)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్’స్టార్టప్‌కు అంకురార్పణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్’ అంటుంది సురభి. ‘కారాగ్రీన్’ అనేది బయోడిగ్రేడబుల్ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్ పేపర్ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్ సామాగ్రిని తయారు చేస్తారు. ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి. కట్ చేస్తే... షార్క్ ట్యాంక్ ఇండియా (బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్)లో ‘కారాగ్రీన్’ 50 లక్షల ఫండింగ్ ఆఫర్‌ను గెలుచుకుంది. -
కా.రా. మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్/శ్రీకాకుళం: తెలుగు కథా సాహిత్యంలో అగ్రగణ్యులు కాళీపట్నం రామారావు (కా.రా.మాస్టారు)ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ జాతీయ అవార్డు కింద ఆయనకు బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నగదు పారితోషికాన్ని రూ. 1.50 లక్షలు చేస్తున్నామని చెప్పారు. కథా సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకువెళ్లిన శ్రీకాకుళంకు చెందిన కా.రా.మాస్టర్‌ను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులు, ట్రస్ట్ సలహాదారు డా. కె.శివారెడ్డి, ట్రస్ట్ సభ్యురాలు మృణాళిని, ఓల్గాలను రమణాచారి అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ సాహితీవేత్తలను ఈ అవార్డుకు ఎంపిక చేసి.. వారిని తగు రీతిలో గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. సాహిత్యం వల్లే ఎన్టీఆర్‌తో తనకు పరిచయమైందని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం స్థాపించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ద్వారా సాహితీ కృషీవలులకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేయడం తనకు ఆత్మానందాన్ని ఇస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సాహిత్య దిగ్గజాలను ఈ అవార్డుతో గౌరవిస్తుండటంలో సాహిత్యానికి నిలువెత్తు రూపమైన రమణాచారి కృషి ఎంతో ఉందన్నారు. సమావేశంలో మృణాళిని, డా. కె. శివారెడ్డి, ఓల్గా పాల్గొన్నారు. కథానిలయ స్థాపకుడు.. కా.రా.మాస్టారు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని మురపాక గ్రామంలో జన్మించారు. 1943 నుంచి విశాఖలో పలు ఉద్యోగాలు చేశారు. తరువాత భీమునిపట్నంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. సాహిత్యం ద్వారా పారితోషికం, సన్మానాల ద్వారా లభించిన ప్రతి పైసాను కూడబెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని 1997 పిబ్రవరిలో ‘కథానిలయం’ ఏర్పాటు చేశారు.


