నా హృదయానికి దగ్గరైన సినిమా కర : ధనుష్‌ | Dhanush Made Interesting Comments About Kara Movie At Pre Release Event, Praises Film And Team Promises Strong Emotional Drama | Sakshi
Sakshi News home page

Dhanush: నా హృదయానికి దగ్గరైన సినిమా కర

Apr 27 2026 8:13 AM | Updated on Apr 27 2026 10:50 AM

Dhanush Talk About Kara Movie At Pre Release Event

‘‘అసాధారణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక సాధారణ మనిషి కథ ‘కర’. నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది’’ అని ధనుష్‌ అన్నారు. ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్‌ సమర్పణలో విఘ్నేష్‌ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్‌ సతీష్‌ కుమార్, రాజేశ్‌కుమార్‌ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. 

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘కర’ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో ధనుష్‌ మాట్లాడుతూ– ‘‘విఘ్నేష్‌ రాజా స్పెషల్‌ ఫిల్మ్‌మేకర్‌. ‘కర’లాంటి సినిమా ఇచ్చిన తనకు థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు. ‘‘కర’ ట్రైలర్‌ బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అంటున్న అతిథి బుచ్చిబాబుని రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ‘పెద్ది’ అప్‌డేట్‌ కోసం అడగ్గా.. ‘‘స్పెషల్‌ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. జూన్‌ 25న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. 

మరో అతిథి వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సార్‌’ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్‌ అయిందో అందుకు రెండున్నర రెట్లు ఎక్కువగా ‘కర’ హిట్‌ కావాలి’’ అని చెప్పారు. ఇషారి కె. గణేశ్‌ మాట్లాడుతూ– ‘‘మన జీవితంలో నిత్యం జరుగుతున్నవే ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ధనుష్‌గారు ‘కర’కు ఓకే చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ప్రేక్షకుల డబ్బు, సమయాన్ని గౌరవించేలా ఈ సినిమా వారిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అని చెప్పారు విఘ్నేష్‌ రాజా. 

సతీష్‌ మాట్లాడుతూ –‘‘ధనుష్‌ సార్‌తో ఓ మంచి హిట్‌ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. నా మిత్రుడు రాజేశ్‌ స΄ోర్ట్‌ చాలా ఉంది’’ అన్నారు. కేఎస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని నా ΄ాత్ర కోసం ్ర΄ోస్థటిక్‌ మేకప్‌ వేయడానికి, తీయడానికి నాలుగు గంటలు పట్టేది’’ అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement