మెక్సికో సిటీ: ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన ఈవెంట్ వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నేడు తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు మెక్సికో సిటీలో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది.
23వ ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 జట్లు పాల్గొంటున్నాయి. 1998 నుంచి 2022 వరకు ప్రపంచకప్ టోర్నీల్లో 32 జట్లు పోటీపడ్డాయి. అంతేకాకుండా తొలిసారి మూడు దేశాలు (అమెరికా, మెక్సికో, కెనడా) కలిసి టోర్నీని నిర్వహిస్తున్నాయి.
అమెరికాలో 11 వేదికల్లో... మెక్సికోలో 3 వేదికల్లో... కెనడాలో 2 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.


