‘నీట్’ లీక్: పరీక్షకు కొన్ని గంటల ముందే.. | NEET UG 2026 Paper Leak, CBI Uncovers Digital Trail From Delhi To Kerala Hostel, Reveals WhatsApp And Telegram Network | Sakshi
Sakshi News home page

‘నీట్’ లీక్: పరీక్షకు కొన్ని గంటల ముందే..

Aug 8 2026 7:58 AM | Updated on Aug 8 2026 10:29 AM

NEET UG 2026 Paper Leak CBI Traces Digital Trail from Delhi to Kerala

తిరువనంతపురం: నీట్‌ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో సీబీఐ దర్యాప్తు పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఢిల్లీ నుంచి కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్ వరకు డిజిటల్ ఆధారాల ఆధారంగా ఈ అక్రమ నెట్‌వర్క్‌ను దర్యాప్తు సంస్థ ఛేదించింది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి, పరీక్షకు కొన్ని గంటల ముందే కేరళలోని అదూర్ (పతనంతిట్ట) విద్యార్థులకు చేరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.

రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ విద్యార్థి, కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో తన రూమ్‌మేట్‌కు లీకైన పీడీఎఫ్ ఫైళ్లను పంపడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుమారు 450కి పైగా పరిష్కరించిన ప్రశ్నలతో కూడిన ఈ పత్రాలను పరీక్షకు ముందు రోజు విద్యార్థులకు అందించారు. మధ్యవర్తులు ఫోన్‌పే ద్వారా రూ. 30,000 వసూలు చేసి ఈ ప్రశ్నాపత్రాలను చేరవేశారు. సికార్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆర్కే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ’ ఈ లీకేజీకి ప్రధాన కేంద్రమని, అక్కడి నుంచి దళారుల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చేరాయని తేలింది.

ఈ భారీ లీకేజీకి మూల కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నియమించిన పూణేకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే. ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఎన్‌టీఏ భవనంలో ప్రశ్నపత్రాల తయారీ, అనువాదాల సమయంలో భద్రతా లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. చిన్న చీటీలు, చేతితో రాసుకున్న నోట్స్ లేదా జ్ఞాపకశక్తి ద్వారా ప్రశ్నలను బయటికి తీసుకువచ్చారు. నిపుణులు, విద్యార్థుల కదలికలను గుర్తించేందుకు పూణేలోని ఒక నివాస సముదాయం విజిటర్ యాప్, మొబైల్ లొకేషన్ డేటాను సీబీఐ ఫోరెన్సిక్ ఆధారాలుగా ఉపయోగించింది. ఢిల్లీలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలను కేరళలోని లబ్ధిదారులతో అనుసంధానించడంలో ఈ డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి.

ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement