breaking news
cbi
-
‘‘సీబీఐ విచారణ జరపాలి.. లోకేశ్ రాజీనామా చేయాలి’’
నగరి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని చెప్పారు. నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.మెగా డీఎస్సీలో అక్రమాలకు బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ నగిరి నియోజక వర్గంలో ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన రాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పుత్తూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రోజా మాట్లాడారు.‘‘ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. ఆ తర్వాత జరిగిన అవకతవకతల గురించి చూశాం. క్వశ్చన్ పేపర్ తయారు చేసే నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడే మీకు పేపర్ లీకేజ్ అయింది అనేది అందరికీ అర్థమయింది. పేపర్ లీకేజ్ కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? రెండో ర్యాంక్ నుంచి ఎందుకు ఇచ్చారు అనేది వాళ్లు చెప్పాలి. రెండోది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్ ద్వారా సర్టిఫికేట్లు వెరిఫై చేసే ఉద్యోగాలు ఇస్తారు. కానీ వీళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాక దొంగ జీవోలు తీసుకొచ్చారు. పోస్ట్ లను అమ్ముకునేందుకు దాని ద్వారా డబ్బులు దోచుకోవడానికి ఈ జీవోలని వాడారు’’ అని వ్యాఖ్యానించారు. -
కోర్టు వ్యాఖ్యలు.. వైరల్ కంటెంట్(మీమ్స్)గా మారుతున్నాయా?
కోర్టు వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా? వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నారా?.. ఈ అంశాలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం, సీబీఐ సహా పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది.డిజిటల్-రాజకీయ సంస్థగా పేర్కొంటున్న సీజేపీ కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాది రాజా చౌద్రి ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను(Oral Comments) సందర్భం నుంచి వేరు చేసి వైరల్ చేయడం, వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడాన్ని పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.కోర్టు వ్యాఖ్యలు.. వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా?న్యాయ విచారణల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగే సంభాషణలను కొన్ని భాగాలుగా కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో న్యాయ ప్రక్రియ అసలు ఉద్దేశం పక్కదారి పడుతోందని తెలిపారు. “కోర్టు వ్యాఖ్యలను మీమ్స్, వైరల్ వీడియోలు, ఆన్లైన్ ప్రచారాలుగా మార్చి సందర్భం లేకుండా చూపిస్తున్నారు” అని పిటిషన్లో పేర్కొన్నారు.‘కాక్రోచ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదంనకిలీ న్యాయ డిగ్రీల అంశంపై విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసినట్లు ప్రచారమైన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం సీజేఐ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా ‘కాక్రోచ్ జంతా పార్టీ’ పేరుతో ఓ ఆన్లైన్ వేదిక ఏర్పడటం, అది రాజకీయ-డిజిటల్ ఉద్యమంగా మారడంపై పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదన్న పిటిషనర్తమ పిటిషన్ ప్రజాస్వామ్య విమర్శలు, వ్యంగ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని రాజా చౌదరి తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ సంస్థలపై జరిగే వ్యాఖ్యలను వాణిజ్య ప్రయోజనాల కోసం వక్రీకరించడం సమస్యగా పేర్కొన్నారు.నీట్ వివాదం నేపథ్యంలో CJP చర్చనీట్ యూజీ పేపర్ లీక్‌లపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలు, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యల నేపథ్యంలో ఈ సంస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు నోటీసులతో సీజేపీ కార్యకలాపాలు, కోర్టు వ్యాఖ్యల వినియోగంపై తదుపరి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రం, సీబీఐ సమాధానాల అనంతరం ఈ కేసులో తదుపరి పరిణామాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
సీబీఐ విచారణకు పట్టు
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(జేపీఎస్సీ) నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, లేకపోతే పోరాటం ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. జేఎస్ఎస్సీ–సీజీఎల్ పరీక్షలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్ మినహా, 98 శాతం డిమాండ్లను అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య ఆదివారం జరిగిన ఆరోవిడత చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సహా చాలావరకు డిమాండ్లు నెరవేరాయని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ అన్నారు.సీబీఐ విచారణ జరగాలన్న డిమాండ్ నెరవేరే వరకు రాజీ పడబోమని స్పష్టంచేశారు. ఆగస్టు 10న అసెంబ్లీ వరకు తలపెట్టిన ర్యాలీని కొనసాగిస్తామని ప్రకటించారు. జేఎస్ఎస్సీ–సీజీఎల్ పరీక్ష హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించామని, దానిపై సీబీఐ విచారణ జరపాలన్న విద్యార్థుల డిమాండ్‌ను అంగీకరించలేమని సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ వెల్లడించారు. ‘‘విద్యార్థులతో మేము సానుకూల చర్చలు జరిపాం. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణకు ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ఇప్పుడు ఆందోళనను విరమించుకోవాలా వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలి’’అని చెప్పారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా ఒక ఫాస్ట్–ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టంచేశారు. ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం విద్యార్థుల డిమాండ్లలో చాలావాటికి అంగీకరించామని, అయినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం అని జార్ఖండ్ ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లలో చాలావరకు తాము అంగీకరించినప్పటికీ, వారు ఆందోళనను విరమించడానికి సిద్ధంగా లేకపోవడం సరైంది కాదని అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం తమకు లేదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఆందోళనను పక్కనపెట్టి, చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.పరీక్షల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై విద్యార్థుల నుంచి సూచనలు కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, అలాగే ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందిస్తుందని వివరించారు. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీకి నిరసనకారులు చేపట్టనున్న ర్యాలీ దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ముగ్గురు జేపీఎస్సీ సభ్యుల రాజీనామా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ)కు చెందిన ముగ్గురు సభ్యులు అజీత భట్టాచార్య, అనీమా హన్స్దా, జమాల్ అహ్మద్ ఆదివారం రాజీనామా చేశారు. జేపీఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారు పదవుల నుంచి తప్పుకున్నారు. ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సహా అక్రమాల ఆరోపణలకు సంబంధించి విచారణ కోసం ఆ ముగ్గురు సభ్యులకు సీఐడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జూలై 22న జేపీఎస్సీ చైర్పర్సన్ ఎల్.ఖియాంగ్టే రాజీనామా సమరి్పంచారు. ఆయనను సీఐడీ అధికారులు ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రశ్నించారు. -
CBI సంచలన రిపోర్టు CBI NEET పేపర్ లీక్ చేసింది ఆ ముగ్గురే..!
-
‘నీట్’ లీక్: పరీక్షకు కొన్ని గంటల ముందే..
తిరువనంతపురం: నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో సీబీఐ దర్యాప్తు పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఢిల్లీ నుంచి కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్ వరకు డిజిటల్ ఆధారాల ఆధారంగా ఈ అక్రమ నెట్‌వర్క్‌ను దర్యాప్తు సంస్థ ఛేదించింది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి, పరీక్షకు కొన్ని గంటల ముందే కేరళలోని అదూర్ (పతనంతిట్ట) విద్యార్థులకు చేరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాజీ విద్యార్థి, కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో తన రూమ్మేట్కు లీకైన పీడీఎఫ్ ఫైళ్లను పంపడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుమారు 450కి పైగా పరిష్కరించిన ప్రశ్నలతో కూడిన ఈ పత్రాలను పరీక్షకు ముందు రోజు విద్యార్థులకు అందించారు. మధ్యవర్తులు ఫోన్‌పే ద్వారా రూ. 30,000 వసూలు చేసి ఈ ప్రశ్నాపత్రాలను చేరవేశారు. సికార్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆర్కే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ’ ఈ లీకేజీకి ప్రధాన కేంద్రమని, అక్కడి నుంచి దళారుల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చేరాయని తేలింది.ఈ భారీ లీకేజీకి మూల కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నియమించిన పూణేకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే. ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఎన్టీఏ భవనంలో ప్రశ్నపత్రాల తయారీ, అనువాదాల సమయంలో భద్రతా లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. చిన్న చీటీలు, చేతితో రాసుకున్న నోట్స్ లేదా జ్ఞాపకశక్తి ద్వారా ప్రశ్నలను బయటికి తీసుకువచ్చారు. నిపుణులు, విద్యార్థుల కదలికలను గుర్తించేందుకు పూణేలోని ఒక నివాస సముదాయం విజిటర్ యాప్, మొబైల్ లొకేషన్ డేటాను సీబీఐ ఫోరెన్సిక్ ఆధారాలుగా ఉపయోగించింది. ఢిల్లీలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలను కేరళలోని లబ్ధిదారులతో అనుసంధానించడంలో ఈ డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి.ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు.. -
బోఫోర్స్ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది!
దేశ రాజకీయాలను దశాబ్దాల పాటు కుదిపేసిన సంచలన బోఫోర్స్ కేసుకు ఎట్టకేలకు న్యాయపరంగా ముగింపు పడింది. ఒకప్పుడు అధికార పీఠాలను కదిలించిన ఈ వివాదంలో మిగిలిన చివరి న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన ఈ కేసులో ఇకపై కొత్త విచారణకు అవకాశం లేకుండా పోయింది. రాజకీయ ప్రకంపనల నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం వరకు సాగిన బోఫోర్స్ అధ్యాయానికి తాజా తీర్పుతో ముగింపు లభించింది.2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అజయ్ కె. అగర్వాల్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించేందుకు నిరాకరించింది.ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు కేసును కొట్టివేయడం, దానిపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ కూడా తిరస్కరణకు గురికావడంతో మళ్లీ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో హిందూజా సోదరులు, స్వీడన్ ఆయుధ సంస్థ ఏబీ బోఫోర్స్‌పై ఉన్న కేసును తిరిగి తెరవడానికి ఇక మార్గం లేకుండా పోయింది.“ఇంకా ఏం మిగిలింది?”.. సుప్రీం ప్రశ్నవిచారణ సందర్భంగా పిటిషన్లో ఉన్న హిందూజా సోదరులు శ్రీచంద్ పీ. హిందూజా, గోపీచంద్ పీ. హిందూజాలు మరణించిన నేపథ్యంలో వారి పేర్లు తొలగించేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పటికే 2005లో ఢిల్లీ హైకోర్టు అన్ని క్రిమినల్ కేసులను కొట్టివేసిందని, 2018లో సీబీఐ అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో దశాబ్దాల నాటి వివాదాన్ని కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టం చేసింది.అసలు బోఫోర్స్ వివాదం ఏంటి?1986లో భారత్–స్వీడన్ ఆయుధ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. భారత సైన్యం కోసం 400 హోవిట్జర్ తుపాకుల కొనుగోలుకు ఈ ఒప్పందం జరిగింది. 1987లో స్వీడిష్ రేడియో ఈ ఒప్పందంలో అక్రమ కమీషన్లు చెల్లించారంటూ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఆయుధ ఒప్పందంలో మధ్యవర్తులకు భారీగా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.భారత రాజకీయాల్లో కల్లోలంబోఫోర్స్ ఆరోపణలు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మారాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించాయి. 1989 లోక్‌సభ ఎన్నికల్లోనూ బోఫోర్స్ ప్రధాన ప్రచార అంశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వివాదం కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా భారీ నష్టం జరిగిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ కేసులో ఇటాలియన్ వ్యాపారవేత్త ఒట్టావియో క్వత్రోచ్చి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఆయుధ ఒప్పందంలో మధ్యవర్తిత్వం, కమీషన్ల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు సాగింది. అయితే ఆయనను భారత్‌కు తీసుకురావడంలో దర్యాప్తు సంస్థలు చివరకు విజయం సాధించలేకపోయాయి.14 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు2005లో ఢిల్లీ హైకోర్టు సీబీఐ ఆధారాలు బలంగా లేవని పేర్కొంటూ హిందూజా సోదరులు, ఏబీ బోఫోర్స్‌పై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు తీరుపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ దర్యాప్తుకు భారీగా ప్రజాధనం ఖర్చయిందని పేర్కొంది. ఆ తర్వాత సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. 4,522 రోజుల ఆలస్యంపై 2018లో ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది.తాజా తీర్పుతో బోఫోర్స్ కేసులో మిగిలిన చివరి న్యాయ మార్గం కూడా మూసుకుపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో అధికారికంగా తెరపడింది. అయితే భారత రాజకీయ చరిత్రలో మాత్రం బోఫోర్స్ వివాదం ఎప్పటికీ ఒక కీలక అధ్యాయంగానే మిగిలిపోనుంది. -
RRRపై పెండింగ్ లో ఉన్న CBI కేసుల్లో సాక్ష్యాలను మార్చే ప్లాన్..
-
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్‌లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్‌తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
పేపర్ లీక్‌కు అక్కడే బీజం!
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, అనువాదంలో ఒకే బృందంలోని వ్యక్తులు పాలుపంచుకోవడం నీట్ పేపర్ లీకేజీకి గల కారణాల్లో ఒకటని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ లోపాలను అనధికారికంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి తెలియజేశామని, తమ అధికారిక సిఫార్సుల్లో కూడా ఈ అంశాన్ని చేర్చే అవకాశం ఉందని వెల్లడించాయి. నీట్–యూజీ 2026 అవకతవకలు 2024 నాటి అక్రమాలకు పూర్తిగా భిన్నమైనవి పేర్కొన్నాయి. 2024లో ఒక పరీక్ష కేంద్రం ఇన్చార్జ్ పేపర్ లీక్ ముఠాతో కుమ్మక్కై ప్రశ్నపత్రాల దొంగతనానికి, వ్యాప్తికి సహకరించాడని దర్యాప్తులో పాల్గొన్న అధికారులు తెలిపారు. 2024 నాటి కేసులో దర్యాప్తు అనంతరం ప్రశ్నపత్రాల రవాణా, నిర్వహణ, పరీక్షకు సంబంధించిన వ్యవస్థాగత మార్పులపై సీబీఐ ఎన్టీఏకు పలు సూచనలు చేసిందని తెలియజేశారు. ఈ సూచనలను 2025, 2026లో నీట్ నిర్వహణలో ఎన్టీఏ అమలు చేసిందని, అందువల్ల సాంకేతికంగా ఎటువంటి ‘లీక్’జరగలేదని చెప్పారు. 2026లో ఎన్టీఏ ప్యానెల్‌లోని ప్రశ్నపత్రాల రూపకర్తలు, వాటిని మరాఠీ భాషలోకి అనువాదం చేసిన పి వి.కుల్కారీ(కెమిస్ట్రీ), మనీషా గురునాథ్ మంధారే(ఫిజిక్స్), మనీషా సంజయ్ హవల్దార్(బయాలజీ) పుణెలో తమ ట్యూషన్ తరగతుల్లోని విద్యార్థులతో తుది ప్రశ్నలను కంఠస్థం చేయించారని సీబీఐ అధికారులు తెలిపారు. ఆ ప్రశ్నలతో ఒక ప్రశ్నల నిధిని తయారుచేసి, ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చారని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రాల రూపకర్తలతో పరిచయం ఉన్న స్థానిక బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ఆ విద్యార్థుల నుంచి ఈ ప్రశ్నల సమాచారాన్ని సంపాదించింది, ధనంజయ్ నివృత్తి లోఖండే అనే వ్యక్తికి విక్రయించిందని పేర్కొన్నారు. అతడు ఆ పేపర్‌ను ఇతర మధ్యవర్తులకు అందించాడని తెలియజేశారు. ఆ తర్వాత నీట్ ప్రశ్నలు పలు రాష్ట్రాల్లో పంపిణీ అయ్యాయని స్పష్టంచేశారు. మనీషా వాఘ్మారే గనుక ఈ వ్యవహారంలోకి రాకపోయి ఉంటే ప్రశ్నపత్నం ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు చేరి ఉండేది కాదని, ఈ లీకేజీ ఉదంతం వెలుగులోకి వచ్చేది కాదని వివరించారు. లోఖండే లక్షలాది రూపాయలకు నీట్ పేపర్లు విక్రయించాడని చెప్పారు. -
ఎట్టకేలకు మన్మోహన్ సింగ్‌కు క్లీన్చిట్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, దివంగత మన్మోహన్ సింగ్‌కు బొగ్గు బ్లాక్‌ల అక్రమ కేటాయింపులకు సంబంధించిన కీలకమైన కేసు నుంచి ఉపశమనం లభించింది. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ ప్రమేయం లేదని గతంలో సీబీఐ దాఖలుచేసిన నివేదికను బుట్టదాఖలుచేస్తూ 11 ఏళ్ల క్రితం ట్రయల్ కోర్టు మన్మోహన్‌కు ఇచ్చిన సమన్ల ఉత్తర్వును కొట్టేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన పలుకేసులను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా 11 ఏళ్ల క్రితం ట్రయల్ కోర్టు జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మన్మోహన్ దాఖలుచేసిన పాత పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు గుర్తుచేశారు. ‘‘2005లో ఒడిశాలోని తలబిరా–2 బొగ్గు బ్లాకుల కేటాయింపులో నాటి ప్రధాని, బొగ్గు శాఖ మంత్రి మన్మోహన్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు అని సీబీఐ తన ముగింపు నివేదికను ట్రయల్ కోర్టుకు అందజేసింది. అయినాసరే నాటి జడ్జి ఆ నివేదికను పట్టించుకోలేదు. ఇప్పుడు మన్మోహన్ జీవించి లేరు. ఆయనను ప్రశ్నించాలంటూ జారీ అయిన సమన్ల ఉత్తర్వుకు అర్థమేలేదు’’అని సిబల్ వాదించారు. దీంతో ఈయన వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించి గతంలో ట్రయల్ కోర్టు జడ్జి ఇచి్చన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. దీంతో మరణించిన రెండేళ్ల తర్వాత మన్మోహన్‌కు బొగ్గుకుంభకోణం కేసు నుంచి క్లీన్చిట్ వచ్చినట్లయింది. -
నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేశ్, వికాస్, శుభమ్, ధనుంజయ్, ప్రహ్లాద్ సహా మొత్తం 13 మంది పేర్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించిన కుట్ర, ప్రశ్నపత్రాల అక్రమ సేకరణ, పంపిణీ తదితర అంశాలపై సీబీఐ విస్తృతంగా దర్యాప్తు జరిపి ఈ చార్జ్‌షీట్‌ను సమర్పించింది. ఈ కేసును నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు తీసుకోనుంది. చార్జ్‌షీట్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో కేసులో మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. -
డిజిటల్ అరెస్ట్‌లపై దేశంలో ఎక్కడైనా సీబీఐ దర్యాప్తు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా నేరాలు దేశంలో ఎక్కడ వెలుగు చూసినా దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి పూర్తి అధికారాలు కల్పించింది. అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి నిలువునా దోచుకుంటున్న ఈ సైబర్ నేరాలను వ్యవస్థీకృత నేరంగా అత్యున్నత న్యాయస్థానం అభివరి్ణంచింది. హరియాణాకు చెందిన 73 ఏళ్ల వద్ధురాలిని నకిలీ ఆదేశాలతో భయపెట్టి రూ.కోటి మేర దోచుకున్న ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. విచారణలో భాగంగా శుక్రవార న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్, స్కైప్, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తు సంస్థలు నోటీసులు, సమన్లు జారీ చేయరాదని స్పష్టం చేసింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 35 ప్రకారం నోటీసులను భౌతికంగానే అందజేయాలని తేలి్చచెప్పింది. ద ర్యాప్తునకు ఆటంకాలు లేకుండా అన్ని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం–1946 కింద సీబీఐకి అనుమతులు ఇవ్వాల ని ఆదేశించింది. సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్మును గుర్తించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెరి్నంగ్ టూల్స్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంక్‌కు సూచించింది. ఏకంగా మూడు వేల కోట్లు కొట్టేశారుడిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాల తీవ్రతను గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 1.23 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫిర్యాదులు నమోదయ్యాయి. కేవలం ఆ ఒక్క ఏడాదే బాధితుల నుంచి రూ.1,935 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. 2025 మొదటి రెండు నెలల్లోనే కొత్తగా 17,718 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటివరకు మొత్తంగా సుమారు రూ.3,000 కోట్ల మేర సీనియర్ సిటిజన్లు, ఇతర సామాన్యుల నుంచి నేరగాళ్లు లాగేసినట్లు అంచనా. మన దేశ చట్టాల్లో గుర్తింపు లేదుడిజిటల్ అరెస్ట్ అనే పదానికి దేశ చట్టాల్లో ఎలాంటి గుర్తింపూ లేదని న్యాయస్థానం తెలిపింది. వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్, విచారణల పేరుతో బెదిరింపులకు గురిచేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 కల్పిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇవి కేవలం ఆర్థిక నేరాలు మాత్రమే కాదని, అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న వ్యవస్థీకృత నేరాలని స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 111 కింద సైబర్ నేరాలపై కేసులు నమోదు చేయాలని సూచించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) అధికార పరిధి సమస్యలు తలెత్తకుండా ‘మకోకా’లాంటి కఠినమైన చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.మోసం సాగుతోందిలా... పోలీసులు, సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారుల పేరుతో నేరగాళ్లు బాధితులకు వీడియో కాల్స్ చేస్తారు. నకిలీ యూనిఫాంలు, ఐడీ కార్డులు, సెట్టింగులతో నమ్మిస్తారు. డ్రగ్స్ పార్శిల్, మనీ లాండరింగ్ లాంటి తీవ్రమైన నేరాల్లో ఇరుక్కున్నారని భయపెడతారు. ఎవ్వరితోనూ మాట్లాడనివ్వకుండా రోజుల తరబడి వీడియో కాల్‌లోనే ఉంచుతూ మానసికంగా వేధిస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. భయపడిన బాధితులు అడిగినంత డబ్బు పంపగానే నేరగాళ్లు అదృశ్యమవుతారు. వాస్తవానికి వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు?: హైకోర్టు
విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీబీఐ విచారణ కోరుతూ గత నెల 26వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. అయితే, నిన్న అనూహ్యంగా సీబీఐ విచారణ విచారణ కోసం వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. దీంతో పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టుకు ఆదేశించింది.మొదట సీబీఐ విచారణ ఎందుకు కోరారు? మళ్లీ వద్దని ఎందుకు కోరుతున్నారో చెప్పాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. -
ట్విషా శర్మ కేసు: సీబీఐకి సహకరించని అత్త, భర్త
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సహకరించకపోవడంతో, మాజీ జిల్లా జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీని భోపాల్ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. నిందితులు వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.గతంలోనే నిందితుల నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, జైలులో అధికారులు శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సమర్థ్ సింగ్ నిరాకరించారని, గిరిబాల సింగ్ కేవలం పాక్షికంగా మాత్రమే సహకరించారని సీబీఐ పేర్కొంది. డిజిటల్ సాక్ష్యాల ఫోరెన్సిక్ విశ్లేషణ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు రావాల్సి ఉందని, పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని దర్యాప్తు సంస్థ తెలిపింది.ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, జూలై 28 వరకు వారి కస్టడీని పొడిగిస్తూ, మరోసారి వాయిస్ శాంపిల్స్ సేకరించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కాగా మే 12న భోపాల్‌లోని కతారా హిల్స్ నివాసంలో ట్విషా శర్మ మృతి చెందారు. ఇది ఆత్మహత్య అని అత్తమామలు వాదిస్తుండగా, ఆమెది హత్యేనని త్విష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
నటి త్విషా శర్మ కేసులో కీలక పరిణామం.. తర్వాత ఏం జరగబోతోంది?
ఇండోర్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. త్విషా శర్మది ఆత్మహత్య కాదని, ఆమెను దారుణంగా హత్య చేశారని నిర్ధారించేలా బలమైన శాస్త్రీయ ఆధారాలు లభ్యమయ్యాయి ఆమె శరీరంపై ఉన్న గాయాల గుర్తులు జిమ్ బెల్ట్ వల్ల ఏర్పడినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం తేల్చింది . ఈ మేరకు సిద్ధం చేసిన 11 పేజీల సుదీర్ఘ నివేదికను ఎయిమ్స్ అధికారులు అత్యంత రహస్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అందజేశారు. సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టుల ప్రత్యేక ఆదేశాల మేరకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని నిపుణుల బృందం త్విషా శర్మ చర్మ కణజాలాలను సేకరించి అత్యాధునిక హిస్టోపాథాలజీ పరీక్షలు నిర్వహించింది .ఈ శాస్త్రీయ పరీక్షల్లో ట్విషా శర్మ మెడ, శరీరంపై ఉన్న లోతైన గాయాలు, ఆమెను లొంగదీసుకుని ఉరి బిగించేందుకు జిమ్నాస్టిక్ లేదా జిమ్ బెల్టును క్రూరంగా ఉపయోగించడం వల్లే సంభవించాయని వెల్లడైంది ఈ మృతికి గల ఖచ్చితమైన కారణాలను, అంతర్గత గాయాలను విశ్లేషించడానికి మెడికల్ బోర్డు నెల రోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ వైద్య జర్నల్స్, ఫోరెన్సిక్ శాస్త్రీయ పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించిందికోర్టు ఆదేశాల ప్రకారం నివేదికలోని పూర్తి వివరాలను బహిర్గతం చేయడానికి డాక్టర్ సుధీర్ గుప్తా నిరాకరించారు ఈ ఎయిమ్స్ నివేదిక ఆధారంగా ఇకపై సీబీఐ దర్యాప్తు జరిపి త్వరలోనే అసలు నిజానిజాలను, నిందితులను చట్టం ముందు నిలబెట్టనుందని ఆయన పేర్కొన్నారు నటి ట్విషా శర్మకు వివాహమైన కేవలం 5 నెలలకే, గత మే 12న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల తన అత్తగారి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ట్విషా భర్త సమర్థ్ సింగ్ తల్లి గిరిబాలా సింగ్ ఒక విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కావడంతో, స్థానిక పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని, దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని త్విషా తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేకపోవడంతో వారు న్యాయం కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాధితుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, ఈ కేసు దర్యాప్తును తక్షణమే సీబీఐకి బదిలీ చేయడమే కాకుండా, ఎయిమ్స్ చేత ఫోరెన్సిక్ రీ-ఎగ్జామినేషన్ చేయించాలని ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఎయిమ్స్ నివేదికతో ఈ కేసులో అత్తగారి కుటుంబ సభ్యుల చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. -
అయోధ్యలో విరాళాల చోరీపై.. 13న సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు, ఆర్థిక లావాదేవీల ఆడిట్ కోరుతూ దాఖలైన మూడు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు పునఃప్రారంభమయ్యే రోజున, ఈ నెల 13న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందే విరాళాలు, కానుకలు చోరీకి గురవుతున్నాయని, నిధులు దురి్వనియోగమవుతున్నాయని న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేశ్ కుమార్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్, నరేంద్ర కుమార్ గోస్వామి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదన్నారు. నిధుల గల్లంతు విషయాన్ని తేల్చేందుకు పూర్తి పారదర్శకత కోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో నిర్దిష్ట కాల పరిమితిలోగా దర్యాప్తు జరిపించాలని కోరారు. అలాగే, ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై కాగ్ లేదా స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. ప్రత్యేక అర్హతలు లేని సిట్ విచారణ కంటే ఇటువంటి దర్యాప్తు ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆలయ సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ లావాదేవీల రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని వారు అభ్యరి్థంచారు. అంతకుముందు, జూన్ 29న ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్లు కోరగా.. అప్పటి వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. ‘వేసవి సెలవుల తర్వాత కోర్టు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక ఈ పిటిషన్లను విచారిస్తే కొంపలేమీ మునిగిపోవు‘అని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించడం తెల్సిందే. తదుపరి విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ తీర్పు మేరకే సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. -
బొల్లినేని శ్రీనివాస్ పై క్రిమినల్ కేసు నమోదు..
-
రూ.25... 24 ఏళ్లు!
రూ. వందల కోట్లు లేవు; బంగారం కుప్పలు, బినామీ ఆస్తులు, విదేశీ మద్యం సీసాలు లేవు; వందల ఎకరాల భూములూ లేవు. రూ. 25 లంచం కేసు. తాను హక్కుగా పొందాల్సిన సేవకు లంచం ఎందుకు ఇవ్వాలనే ఓ సగటు ఉద్యోగి ప్రతిఘటన. ఓ డాక్టర్‌ను సీబీఐకి పట్టించింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పింది. మానసిక వేదనకు గురి చేసింది. అయితే ఎంత లంచం తీసుకున్నారని కాదు. నేరానికి శిక్ష తప్పదని ఈ కేసు రుజువు చేసింది. ఈ కేసు పూర్తవ్వడానికి మాత్రం 24 ఏళ్లు పట్టింది.రమేష్రామ్ అనే ఓ వ్యక్తి ఈస్ట్రన్ రైల్వేలో స్వీపర్‌గా పట్నాలోని మహేంద్రఘాట్లో విధులు నిర్వహిస్తున్నాడు. 1985 జనవరి 8న అనారోగ్యానికి గురవ్వడంతో రైల్వే ఉద్యోగులకు ఉచితంగా సేవలు అందించే డిస్పెన్సరీకి వెళ్లాడు. అక్కడ డాక్టర్ బాల్గోవింద్ ప్రసాద్ పట్నా డివిజనల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.రమేష్రామ్ ఆ డాక్టర్‌ను సంప్రదించి వైద్య సేవలు పొందాడు. మందులతో పాటు సిక్ లీవ్ మెమోను డాక్టర్ ఇచ్చాడు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరోసారి వైద్యుడ్ని కలిసి మందులు తీసుకున్నాడు. సిక్ లీవ్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు. దానికి డాక్టర్ రూ. 25 లంచం డిమాండ్ చేశాడు.సీబీఐకి ఫిర్యాదు‘నాకు ఆరోగ్యం బాగోలేదు. వైద్య సేవలతో పాటు సిక్ లీవ్ సర్టిఫికెట్ పొందే హక్కుంది’ అని రమేష్ భావించాడు. అందువల్ల లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాంతో అదే రోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేసి ఫిర్యాదు వాస్తవమేనని ధ్రువీకరించింది. డాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నింది. ఫినాప్తిలిన్ పూసిన కరెన్సీ నోట్లను ఫిర్యాదుదారుకు అందజేసింది. ‘డబ్బులు డిమాండ్ చేసినప్పుడు మాత్రమే ఇవ్వాలని, డిమాండ్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకూడద’ని రమేష్రామ్ను సీబీఐ హెచ్చరించి పంపింది. ఫిర్యాదుదారు నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత సీబీఐ బృందం డాక్టర్‌ను పట్టుకుంది.ట్రయల్ కోర్టులో విచారణ1986లో ట్రయల్ కోర్టులో విచారణ మొదలైంది. ‘తనపై మోపిన అభియోగాలు పూర్తి అవాస్తవమని, తన పదవిపై కన్నేసిన కొంతమంది ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని, పూర్తి విచారణ జరిపి తనను నిర్దోషిగా ప్రకటించాలని డాక్టర్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ప్రాసిక్యూషన్ తన వాదనకు మద్దతుగా పలు పత్రాలు, వస్తువులను సాక్ష్యాధారాలుగా కోర్టు ముందుంచింది. మొత్తం 19మంది సాక్షులను విచారించారు.అనంతరం డాక్టర్ బాల్గోవింద్ ప్రసాద్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 161 కింద ఏడాది, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు..శిక్షను రద్దు చేయాలని డాక్టర్ బాల్గోవింద్ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాధారాల్లో అనేక వైరుధ్యాలున్నాయని, సహేతుకమైన సందేహాలకు అతీతంగా అవి ఉన్నందున దోషిగా నిర్ధారించడానికి అవి సరిపోవని అప్పిలెంట్ తరపు న్యాయవాది వాదించారు.ఈ కేసు కారణంగా కొంతకాలం సస్పెండై, పదోన్నతులు కోల్పోయి, తర్వాత రిటైర్ అయ్యాడని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా అందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అతని వయసు 75 సంవత్సరాలని పేర్కొన్నారు. ఒకవేళ నేరం రుజువైందని కోర్టు భావిస్తే ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షా కాలాన్ని తగ్గించాలని కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగి అధికారికంగా ఓ పని చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి విలువైన వస్తువును స్వీకరించడం, లంచం డిమాండ్ చేయడం, తీసుకోవడం ఇలాంటి కేసుల్లో ముఖ్యమని సీబీఐ న్యాయవాది వాదించారు. ఇవన్నీ ఈ కేసులో రుజువయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు.హైకోర్టు తీర్పువిచారణ అనంతరం 24 ఏళ్ల తర్వాత హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసును ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో నిరూపించిందని పేర్కొంది. ఇవన్నీ అప్పిలెంట్ను దోషిగా నిరూపిస్తున్నాయని కోర్టు తేల్చింది. ట్రయల్ కోర్టు తీర్పు కొనసాగుతుందని పేర్కొంది. నిందితుడి వయస్సు అప్పటికే 75 సంవత్సరాలు ఉండడం, కేసు సుదీర్ఘకాలం నడవడం తదితర కారణాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐపీసీ సెక్షన్ 161 కింద దోషిగా తేలినా ఎటువంటి అదనపు శిక్ష విధించలేదు. మిగిలిన మరో ఏడాది శిక్షా కాలాన్ని మూడు నెలలకు తగ్గించింది. జరిమానాను రూ. 1000 నుంచి రూ. 2000కు పెంచుతూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. - దిలీప్ మాదిరెడ్డి -
కీలక పరిణామం.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి
విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు. మొదట అదృశ్యం కేసుగా నమోదైంది ఈ వ్యవహారం. ఆ తర్వాత కస్టడీలో మృతి చెందాడన్న ఆరోపణలు వచ్చాయి.సాయికృష్ణను 2026 మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అదుపులోకి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకపోవడంతో పాటు ఇంటికి కూడా రాకపోవడంతో, అతని తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కస్టడీలోనే తన కుమారుడిని హింసించి చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు మాయం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. -
16 రాష్ట్రాల్లో సీబీఐ భారీ దాడులు : ఇద్దరు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. 'ఆపరేషన్ చక్ర-VI' (Operation Chakra-VI) పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాల్లోని 80కి పైగా ప్రాంతాల్లో సీబీఐ అధికారులుదాడులు నిర్వహించారు. ఈ దాడుల అనంతరం కోల్‌కతాలో ఒకర్ని, చెన్నైలో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు.సుదీర్ఘ ఆపరేషన్‌లో భాగంగా సీబీఐ ప్రత్యేక బృందాలు గురువారం దేశంలోని 16 రాష్ట్రాలలో 80కి పైగా ప్రదేశాలలో సమన్వయంతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. తెలంగా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టింది. నకిలీ (షెల్) కంపెనీలను ఏర్పాటు చేసి, సైబర్ నేరాల సొమ్మును మళ్లించడానికి వీలుగా 'మ్యూల్ బ్యాంక్ ఖాతాలను' (మరోకరి పేరిట తెరిచే ఖాతాలు) నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను చెన్నై, కోల్‌కతాలలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులలో భాగస్వామ్యమై, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద నేరపూరిత నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. -
కాపు యువకుని లాకప్‌డెత్ కేసు సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రొపర్టీ అండ్ ఎని్వరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘సాయికృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూపుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో పారదర్శక, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరపకపోవడమన్నది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించడమే అవుతుంది. పోలీసుల చర్యలను ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ఈ కేసులో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై ముఖ్యంగా అధికారులు, రాజకీయ పెద్దలు పాత్రపై పక్షపాతానికి తావు లేకుండా, స్వతంత్రంగా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలి. స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు. కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గం.సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎల్రక్టానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్ట్‌మార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామాగ్రి, పోలీసు వాహనాల రాకపోకల రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా దర్యాప్తులో పాలుపంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఈ వ్యాజ్యం తేలేంత వరకు, కేసును అధికారికంగా సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు తక్షణ రక్షణ ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. స్వయంగా పోలీస్ అధికారులపైనే ఆరోపణలు వచ్చినప్పుడు, స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరవచ్చునని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని పిటిషనర్ పిల్లో ప్రస్తావించారు. ‘సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క అధికారిపైనే చర్యలు చేపట్టారు. వాస్తవానికి ప్రజలు, మీడియా సమాచారం ప్రకారం ఈ ఘోరంలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని స్పష్టమవుతోంది. స్వయంగా రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన అధికారులపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు.. రాష్ట్ర పోలీసులే ఈ దర్యాప్తును కొనసాగించడం అసమంజసం’’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కొట్టి చంపేశారు... ‘సాయికృష్ణను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 9వ తేదీన ఓ నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలుకు సంబంధించి మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని మొదట కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీస్ స్టేషన్లలో రెండు రోజులు ఉంచారు. ఆ తర్వాత విజయవాడ బెంజ్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించి, మే 23 వరకు తీవ్రంగా హింసించారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిపి దాదాపు 12 మంది పోలీసులు ఈ హత్య ప్రణాళికలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మాకుంది.కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీసుల దాడి కారణంగా సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని మొదట విజయవాడలోని ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఒక రోజు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మళ్లీ హోటల్ గదికే తీసుకెళ్లి, ఒక డాక్టర్‌తో ప్రథమ చికిత్స చేయించారు. చివరికి సాయికృష్ణ గాయాలు తట్టుకోలేక మరణించాడు. సాయికృష్ణ మరణించిన తర్వాత, కృష్ణలంక పోలీసులు శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశారు.ప్రజలను నమ్మించడానికి, ఆ మృతదేహాన్ని విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్ నంబర్ 43 వద్ద పడేశారు. అది గుర్తుతెలియని శవంగా భ్రమింపజేసి, మున్సిపల్ అధికారుల సహాయంతో తప్పుడు పంచనామా రికార్డులు సృష్టించారు. స్మశానవాటిక సిబ్బందిని లొంగతీసుకుని, మే 24న మున్సిపల్ కార్పొరేషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసేశారు. కొడుకు జాడ కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించి, చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ సమయంలో పోలీసులు తాము అసలు సాయికృష్ణను అరెస్టు చేయలేదని అబద్ధం చెబుతూ, మే 29 వరకు సమయం కోరారు.కానీ ఈ లోపే, విచారణ పేరుతో పోలీసులు అతన్ని కొట్టి చంపేశారనే నిజం బయటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సాయికృష్ణ తల్లి సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇకపై పెద్దది చేయవద్దని ఆమెను ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా కోరుతున్నారు. అయితే, ఒక బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా. అందులో భాగంగానే ఈ పిల్ దాఖలు చేస్తున్నా.’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. -
పోలీసులే హంతకులైతే.. సీబీ‘ఐ’తోనే న్యాయం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ రాష్ట్ర పోలీసుల క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పౌరులను, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే హంతకులుగా మారినప్పుడు జరిగే ఘోరానికి.. తమిళనాడులోని తూత్తుకుడి (సాతాన్‌కుళం), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (కృష్ణలంక)లలో జరిగిన రెండు భయంకరమైన లాకప్‌డెత్‌లు ప్రత్యక్ష నిదర్శనాలు. తమిళనాడులో కరోనా సమయం 2020 జూన్‌లో పాన్ షాపు మూసివేతకు సంబంధించిన ఒక చిన్న వ్యవహారంలో జయరాజ్–బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి లాకప్‌డెత్ చేసిన 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించింది. సదరు కేసులో ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అప్పట్లో జరిగిన ఆ దారుణంపై రేవతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ కోర్టులో చెప్పిన సాక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జయరాజ్–బెన్నిక్స్ కేసు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు దర్యాప్తుతో ఏమాత్రం న్యాయం జరగదని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. హైకోర్టుకు ఇచ్చే సమాధానంపై ఆసక్తి విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు సాయికృష్ణ ఆచూకీ తెలియకపోవడం, అతడి శవాన్ని మాయం చేసి కాల్చి బుడిద చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు 29వ తేదీన హైకోర్టుకు ఏం చెబుతారు? దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు
మోడల్ , నటి ట్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్‌లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. ట్విషా శర్మ మృతి కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది.భోపాల్ పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అత్త, భార్తలను నిందితులుగా చేర్చింది. సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్‌కు చెందిన ఒక బృందం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుని, స్థానిక పోలీసులు ఇప్పటివరకు సేకరించిన కేస్ డైరీ, పోలీసు పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య పత్రాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించింది.ఇదీ చదవండి: ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్ఇప్పటికే వరకట్నం డిమాండ్ చేశారన్న ఆధారాలు లభించినట్లు ఆరోపణలు రావడంతో, వరకట్నం మరణనం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి) చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్‌ను ఫిర్యాదిదారుగా పేర్కొన్నారు.మరోవైపు పోలీసు విచారణలో భర్త సమర్థ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్కు, లభించిన ఆధారాలకు మధ్య తేడాలను సీబీఐ గమనించింది. తనకు గర్భం రావడంపై అనుమానంతో, బలంతంగా అబార్షన్ చేయించారని ట్విషా వాట్సాప్ ద్వారా తెలుస్తుండగా, తనకు తండ్రి కావాలని ఉందని, కానీ ట్విషాకు ఇష్టం లేకపోవడం వల్లే వైద్యుల సలహా మేరకు పరస్పర అంగీకారంతో గర్భస్రావం చేయించామని చెప్పాడు. గర్భం దాల్చినప్పటి నుండి ట్విషా తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నాడుబైపోలార్ డిజార్డర్దీంతోపాటు మరో షాకింగ్ ఆరోపణలు కూడా చేశాడు భర్త. ట్విషాకు బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) 'అడ్జస్ట్మెంట్ డిజార్డర్' ఉన్నాయని, ఆమె ప్రవర్తన అకస్మాత్తుగా మారేదని తెలిపాడు. ఒత్తిడి తగ్గించడానికి వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు ఇచ్చామని చెప్పాడు.ట్విషా కుటుంబం వాదన: పెళ్లికి ముందు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గొడవల వల్లే మానసిక చికిత్స, మందులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో ట్విషా సుమారు 15 కిలోల బరువు తగ్గిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ చికిత్స గురించి ఆమెకు, పుట్టింటివారికి సమాచారం ఉందా లేదా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడని, కనీసం ఆన్లైన్ జాబ్స్ కూడా చేసుకోనివ్వడం లేదని ట్విషా చనిపోవడానికి ముందు తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విషా తన సొంత ఇష్టపూర్వకంగా, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఉద్యోగం మానేసిందని, తాము ఎక్కువ సమయం కలిసి గడపడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమర్థ్ తెలిపాడు. చనిపోయే రోజు కూడా ఆమె మామూలుగానే ఉందనీ, ఇద్దరమూ జిమ్‌కు వెళ్లామని, కలిసి భోజనం చేసి, వాకింగ్‌కు కూడా వెళ్లామని సీబీఐకి చెప్పాడు.సమర్థ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పెళ్లయిన కొత్తలో అంతా నార్మల్‌గానే ఉందని, శారీరక, మానసిక వేధింపులేవీ లేవని చెప్పినప్పటికీ, అతని మొబైల్ ఫోన్ నుండి ట్విషాకు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ చాట్లను రికవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ చాట్స్ రికవర్ అయితే, సమర్థ్ చెప్తున్న "నార్మల్ రిలేషన్షిప్" వాదనలోని నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది అంటున్నారు దర్యాప్తు అధికారులు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ రజనీష్ కాశ్యప్ కౌల్ ఫిర్యాదుదారుగా సీబీఐ ఈ కేసును దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. అయితే, దర్యాప్తు చేతులు మారుతున్న కొద్దీ, మూడు రోజులు, దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సమర్థ్ సింగ్ పోలీసులకు ఏమి చెప్పాడు, వాట్సాప్ చాట్లు, వైద్య రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు వ్యతిరేకంగా అతని వాదనలో ఎంత నిజం ఉంది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోట్విషా శర్మ మరణానికి సంబంధించిన కేసులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి తరువాత వధువును అత్తవారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం సందర్భంగా, ఆమె అత్త, తన కోడలి వరకట్నం మరణం కేసులో నిందితురాలిగా ఉన్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి గిరిబాల సింగ్ రూ. 2 లక్షల వరకట్నం డిమాండ్ చేసిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ట్విషా శర్మ వరకట్న మరణం కేసును విచారిస్తున్న సీబీఐ ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్‌లపై సీబీఐ కొత్తగా కేసునమోదు చేసి, భోపాల్ పోలీసుల నుండి ఆధారాలను స్వాధీనం చేసుకుంది.గత ఏడాది డిసెంబర్ 9న మోడల్, నటి ట్విషా శర్మకు , న్యాయవాది సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగింది. కట్నం భారీగానే చెల్లించారు. అయితే పెళ్లి ముగిసి అత్తగారింటికి పంపించే సమయం (విదాయి)లో సమర్థ్ సింగ్ తల్లి గిరిబాల సింగ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని, ఒత్తిడి తట్టుకోలేక వధువు కుటుంబం ఆ డబ్బు చెల్లించిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అదీ చాలదన్నట్టు పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తగారు కలిసి ట్విషాను శారీరకంగా, మానసికంగా వేధించారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొదట జరిగిన రూ. 2 లక్షల డిమాండ్ తదుపరి తీవ్ర వేధింపులకు దారితీసిందా? అసలు ఆమె మరణానికి గల కారణాలేంటి? అనే కోణంలో సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.కాగా పెళ్లైన ఐదు నెలలకే అత్తగారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసింది. అలాగే పోస్ట్‌మార్టంలో అవకవతవకలు జరిగాయంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో మధ్య ప్రదేశ్ హైకోర్టు రీ పోస్ట్‌మార్టంకు ఆదేశించింది. అంతకు ముందే భోపాల్ పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ ప్రత్యేక బృందం భోపాల్ చేరుకుని ఆధారాలను సేకరించడం, నిందితులను విచారించడం ప్రారంభించింది. భార్య మరణం తరువాత పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సమర్థ సింగ్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. సెక్షన్లు 80(2), 85, 3(5) లతో పాటు, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్‌లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ట్విషా కుటుంబం చేస్తున్న ఆరోపణలను భర్త సమర్థ్ సింగ్ కుటుంబం పూర్తిగా నిరాకరిస్తోంది. తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉండేదని, దానివల్లే ఆమె ఇబ్బంది పడేదని గిరి బాల సింగ్ వెల్లడించారు. ఈమె వ్యాఖ్యలపై ఇంటర్నెట్లో దుమారంరేగింది. విక్లిమ్ను బ్లేమ్ చేస్తూమొసలి కన్నీళ్లు కారుస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకొని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం గమనార్హం. -
‘నీట్’ కేసు: 40 రోజుల్లో రిటైర్మెంట్.. ఇంతలోనే అరెస్ట్!
పూణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్-యూజీ - 2026’ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పూణెలోని సేథ్ హీరాలాల్ సరాఫ్ పాఠశాల ప్రిన్సిపల్ మనీషా సంజయ్ హవాల్దార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం విద్యాశాఖ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె మరో 40 రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా ఇంతలోనే ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.పాఠశాల యాజమాన్యం షాక్సీబీఐ చర్య దరిమిలా విద్యా ప్రసరిణి సభ ట్రస్ట్.. మనీషా హవాల్దార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాల 102 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వివాదం జరగడం ఇదే మొదటిసారని ట్రస్ట్ కార్యదర్శి సతీష్ గవాలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ అక్రమ కార్యకలాపాలపై తమకు ముందస్తు సమాచారం లేదని, నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.అంకితభావం కలిగిన ఉపాధ్యాయురాలిగా గుర్తింపు1992లో అసిస్టెంట్ టీచర్‌గా వృత్తిని ప్రారంభించిన మనీషా హవాల్దార్, తన విద్యా అర్హతలతో పాఠశాలలో క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయురాలిగా పేరు తెచ్చుకున్నారు. 2024లో ఆమె ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందారు. సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె ఇలాంటి నేరంలో చిక్కుకోవడం నమ్మశక్యంగా లేదని తోటి ఉపాధ్యాయులు అంటున్నారు. ఒక సీనియర్ విద్యావేత్త ఇటువంటి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం శుక్రవారం ఉదయం మనీషా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి, ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అదే సమయంలో పాఠశాలలోనూ సోదాలు జరిపి, కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్కులు, అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్ పరీక్షకు ముందే గోప్యమైన సమాచారం లీక్ అయ్యిందా లేదా అనే కోణంలో సీబీఐ ఫోరెన్సిక్ విశ్లేషణను ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో ఇటువంటి అక్రమాలు వెలుగుచూడటం పరీక్షల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. -
‘నీట్’ మరో మాస్టర్‌మైండ్ మనీషా అరెస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్‌చేశారు. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా కొనసాగుతూ నీట్–యూజీకి సంబంధించిన నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్టీఏ) వారి పేపర్ సెట్టింట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న పుణెకు చెందిన మనీషా గురునాథ్ మంధరేను సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్‌చేశారు. ఇప్పటికే అరెస్టయిన మరో మాస్టర్‌మైండ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని లోతుగా ప్రశ్నించడంతో ఈమె పేరు బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు. బయాలజీ పేపర్ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు అని సీబీఐ పేర్కొంది. మనీషాను ఢిల్లీకి తీసుకొచ్చి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారించి, ఆమె నేరాన్ని నిర్ధారించుకున్నాక అరెస్ట్‌చేశారు. నీట్–యూజీ పరీక్ష ప్రక్రియలో ఈమె భాగస్వామిగా ఉన్నారు. ఈమెను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా గతంలో ఎన్టీఏ నియమించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉండటంతో ఈమె బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను నేరుగా పరిశీలించే అధికారం పొందారు. ఆ అధికారాన్ని దురి్వనియోగంచేసినట్లు తేలింది. ఈ ప్రశ్నలను తనకు లక్షల రూపాయలు చెల్లించిన కొద్దిమంది నీట్–యూజీ అభ్యర్థులకు చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎవరీ మనీషా? మహారాష్ట్రకు చెందిన మనీషా వృత్తిరీత్యా బాటనీ లెక్చరర్. పుణెలోని మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఐదారేళ్లుగా ఎన్టీఏలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది నీట్–యూజీ ప్రవేశపరీక్షకు సంబంధించి బాటనీ, జువాలజీ విభాగంలో రావాల్సిన ప్రశ్నల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ఆయా ప్రశ్నపత్రాల తుదిరూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఇటు జాతీయస్థాయి సంస్థలో కీలకభూమిక పోషిస్తూనే పుణె కాలేజీతో సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. రహస్యంగా ఉంచాల్సిన క్వశ్చన్ పేపర్లను తరచిచూసే సర్వాధికారం ఉండటంతో వాటిని ఈమె తస్కరించారు. ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థుల జాబితాను వాఘ్మరే అనే మరో నిందితుని ద్వారా తెప్పించుకుని వాళ్లకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లను పుణెలోని సొంతింట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులపేరిట అందజేశారు. వాఘ్మరేను నాలుగు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్చేయడం తెల్సిందే. ఈ బాటనీ, జువాలజీ ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, జవాబులు అచ్చుగుద్దినట్లుగా 2026 నీట్–యూజీ ఎంట్రన్స్ బయాలజీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో అంతర్గత వ్యక్తులు మొదలు మధ్యవర్తులు, అభ్యర్థుల దాకా అన్ని స్థాయిలో పకడ్బందీ నెట్వర్క్ ద్వారా ప్రశ్నపత్రాలను లీక్చేశారు. కులకర్ణి, వాఘ్మరేలను 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తుర్వులిచ్చింది. వేట వేగవంతం ఈ ఉదంతంలో ఇంకెంత మంది సూత్రధారులు, పాత్రధారులు దాక్కున్నారనేది కనిపెట్టి సంకెళ్లు వేసేందుకు సీబీఐ విస్తృతస్థాయిలో దర్యాప్తును వేగవంతంచేసింది. గత 24 గంటల్లో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చాలా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లను సీజ్చేసింది. డబ్బులు ఆన్లైన్లో లావాదేవీలు జరిగిన కొన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు, నేరపూరిత డాక్యుమెంట్లను సేకరించింది. వీటన్నింటీ మధ్య ఉన్న సంబంధాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వాఘ్మరీ ద్వారానే ప్రశ్నలను కులకర్ణి ఇతర పరీక్షార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్‌లలో మొత్తం 9 మందిని అరెస్ట్‌చేశారు. వాళ్ల జాబితా.. 1. మనీషా గురునాథ్(బాటనీ లెక్చరర్) 2. పీవీ కులకర్ణి( రసాయనశాస్త్ర అధ్యాపకుడు) 3. వాఘ్మరే(విద్యార్థులను పోగుచేసిన వ్యక్తి) 4. ధనంజయ్ లోఖండా(అహల్యానగర్వాసి) 5. శుభం ఖైర్నర్( నాసిక్ వాసి) 6. మంగీ లాల్ బివాల్( జైపూర్‌వాసి) 7. వికాస్ బిలాల్( జైపూర్‌వాసి) 8. దినేశ్ బిలాల్( జైపూర్‌వాసి) 9. యశ్ యాదవ్(గురుగ్రామ్వాసి) -
డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలకు.. సీబీఐ చెక్
డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ మోసాలను అరికట్టడానికి CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సరికొత్త ఏఐ ఆధారిత వెరిఫికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఏవరైనా సీబీఐ నోటీసులు, డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలకు నోటీసులు అందితే అది సరైనదా కాదా అనే విషయం ఇక అభయ్ పోర్టల్‌లో సులువుగా తెలుసుకోవచ్చని పేర్కొంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే నేరాలు సైతం అప్డేట్ అవుతున్నాయి. ఇది వరకులా ప్రత్యక్షపద్దతినో ప్రజలను లూటీ చేయడం కాకుండా కేవలం ఒక్క ఓటీపీతో ఖాతాలో ఉన్న డబ్బంతా సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. అదే విధంగా సామాన్య ప్రజలను నేరాలు చేశావని భయపెడుతూ వారని అరెస్టు చేస్తామని జైళ్లో వేస్తామని బెదిరిస్తూ నకిలీ నోటీసులు అందజేసీ డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ఏవరైనా సైబర్ నేరాలు పేరుతో ప్రజలని బెదిరిస్తే అది అసలైందా లేదా నకిలీదా అనే విషయం క్షణాల్లో తెలుసుకునేలా ఒక అభయ్ అనే సరికొత్త ఏఐ ఆధారిత పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చింది.అభయ్ పోర్టల్‌ను వాడే విధానం?మొదటగా సీబీఐ అధికారిక వెబ్సైట్ www.cbi.gov.in లోకి వెళ్లాలి.హోమ్ పేజీలో కనిపించే ‘ABHAY’ లోగోపై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్కువచ్చే OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.ఇప్పుడు మీకు వచ్చిన నోటీసు కాపీని పీడీఎఫ్ లేదా చిత్రం (Image) అక్కడ అప్లోడ్ చేయాలి.మీ నోటీసును స్కాన్ చేసి, అది నిజమైనదా లేక నకిలీదా అనే విషయాన్ని ఈ AI చాట్‌బాట్ కేవలం నిమిషాల వ్యవధిలోనే తేల్చి చెబుతుంది.ఈ సందర్భంగా ప్రజలకు సీబీఐ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. భారతీయ చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలిపింది. మిమ్మల్ని భయపెట్టి, కెమెరాల ముందు కూర్చోబెట్టి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామనే సైబర్ నేరగాళ్ల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపింది. నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
నీట్ పేపర్ లీకేజీ కేసులో కింగ్‌పిన్ అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ వెనుక మాస్టర్ మైండ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్ పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్ పేపర్ కమిటీలో సబ్జెట్ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. నీట్ ఎగ్జామ్‌కు ముందే క్వశ్చన్ పేపర్ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్ పేపర్‌ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్ విద్యార్థికి లీక్ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్‌వర్క్‌కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ అయ్యారు. -
సీబీఐ కస్టడీకి నీట్ లీక్ సూత్రధారి
న్యూఢిల్లీ: నీట్(యూజీ)–2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జైపూర్‌లో మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేశ్ బివాల్‌ను, గురుగ్రామ్‌లో యశ్ యాదవ్‌ను, నాసిక్‌లో శుభమ్ ఖైర్నార్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం చెప్పారు. వేర్వేరు ప్రాంతాల్లో మరికొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, వారిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. పేపర్ లీకేజీ వెనుక మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న 30 ఏళ్ల శుభమ్ ఖైర్నార్‌ను నాసిక్ నుంచి ఢిల్లీకి తరలించారు. అంతకుముందు నాసిక్ మేజి్రస్టేట్ కోర్టు అతడిని సీబీఐ ట్రాన్సిట్ రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శుభమ్ ఖైర్నార్‌ను ప్రశ్నిస్తున్నారు. రాజస్తాన్ పోలీసుల సూచన మేరకు నాసిక్ పోలీసులు మంగళవారం ఖైర్నార్‌ను అరెస్టు చేశారు. సోదాల్లో భాగంగా అనుమానితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా పలు డిజిటల్ పరికరాలను సీబీఐ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించనున్నారు. వాటిలోని మెసేజ్ యాప్‌లను క్షుణ్నంగా తనికీ చేయబోతున్నారు. పేపర్ లీక్ కేసులో సమగ్రమైన, నిష్పక్షపాతమైన దర్యాప్తు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు అధికార వర్గాలు స్పష్టంచేశాయి. రద్దు చేసిన నీట్(యూజీ) పరీక్షకు సంబంధించిన పత్రాలను సేకరించేందుకు బుధవారం సీబీఐ అధికారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పరీక్షల ప్రక్రియలో పాలుపంచుకున్న సిబ్బందితో మాట్లాడారు. గురుగ్రామ్ డాక్టర్ ద్వారా రాజస్తాన్ సోదరులకు.. నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్‌లోని జామ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్‌కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్‌ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్‌గఢ్ నుంచే పేపర్ సికార్‌లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్‌కు చేరింది. అతడు ఈ పేపర్‌ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యారి్థకి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్‌లో హాస్టల్‌ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్‌ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పేపర్ లీక్‌కు సంబంధించి రాజస్తాన్ పోలీసులు 150 మంది అభ్యర్థులను ప్రశ్నించారు. ఇందులో కోచింగ్ సెంటర్ల పాత్ర ఇప్పటిదాకా బయటపడలేదని పేర్కొన్నారు. నిందితుడు బీజేపీ సభ్యుడే: కాంగ్రెస్ రాజస్తాన్‌లో అనుమానితుల అరెస్టు వ్యవహారం రాజకీయంగా దుమారం సృష్టిస్తోంది. నిందితుల్లో ఒకరికి అధికార బీజేపీతో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. అరెస్టయిన దినేశ్ బివాల్ బీజేపీ సభ్యుడేనని బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అందులో దినేశ్ బివాల్ బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, అశోక్ గహ్లోత్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. దినేశ్ బివాల్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. -
నేను రబ్బర్ స్టాంప్‌ను కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తదుపరి నూతన సారథి ఎంపిక ప్రక్రియలో అవలంభించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను తనకు తెలియజేయని కారణంగా ఉన్నతస్థాయి ఎంపిక ప్యానెల్లో ఇకపై భాగస్వామిగా కొనసాగబోనని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు.మంగళవారం ఢిల్లీ ప్రధాని అధికార నివాసం 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో జరిగిన భేటీలో ప్యానెల్ సభ్యుని హోదాలో రాహుల్ పాల్గొన్నారు. ప్యానెల్ చైర్పర్సన్ ప్రధాని మోదీ, సభ్యునిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ‘‘ఏఏ అంశాల ప్రాతిపదికన తుది అభ్యర్థులను ఎంపికచేశారనే కీలక సమాచారాన్ని ఇచ్చేందుకు సెలక్షన్ కమిటీ నిరాకరించింది. తద్వారా ఎంపిక ప్యానెల్ భేటీని ఎన్డీఏ సర్కార్ అలంకారప్రాయంగా మార్చింది. ఇలాంటి పక్షపాత ప్యానెల్లో నేను కొనసాగబోను. కొనసాగి విపక్షనేతగా రాజ్యాంగబద్ధ బాధ్యతను విస్మరించజాలను. అందుకే నా విముఖతను స్పష్టంగా తెలియజేస్తున్నా’’ అని రెండు పేజీల లేఖలో రాహుల్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు.ఇదిలా ఉండగా.. మే 24వ తేదీతో ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో స్వీయ మదింపు పత్రాలు సహా ప్రభుత్వ నిఘా నివేదికలను పరిశీలించి తుది అభ్యర్థుల జాబితా పరిశీలనకు ఎంపిక ప్యానెల్ సమావేశంకాగా రాహుల్ తన విముఖత వ్యక్తంచేశారు. I have written to the Prime Minister recording my dissent from the CBI Director selection process.I cannot abdicate my constitutional duty by participating in a biased exercise.The Leader of Opposition is not a rubber stamp. pic.twitter.com/WfSt5gGPPR— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2026 -
షాకింగ్: నీట్ యూజీ 2026 రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్‌లో ‘గెస్ పేపర్’ లీకైందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.అసలేం జరిగింది?కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో ‘గెస్ పేపర్’ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయింది? దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేతికి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సీబీఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.త్వరలోనే రీ-ఎగ్జామ్.. విద్యార్థులకు ఊరటపరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగినా, పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహులకు న్యాయం చేయడానికే ఈ రీ-ఎగ్జామ్ జరగనుంది. త్వరలోనే అధికారిక మార్గాల ద్వారా కొత్త తేదీలను ప్రకటించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూ విద్యార్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది.కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఫీజు వాపసుమళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలే దాదాపు చెల్లుబాటు అవుతాయి. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరు సరికాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును విద్యార్థులకు వాపసు (రీఫండ్) చేయనున్నారు. కొత్త పరీక్ష తేదీకి ముందు ఎన్టీఏ తాజా అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. -
కరెంట్ అక్రమాలపై సీబీఐ!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా..వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. జస్టిస్ లోకూర్ నివేదికను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించింది. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా 9 నెలల క్రితం సీబీఐ విచారణను కోరిన రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా విద్యుత్ రంగ నిర్ణయాలపై సైతం సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం గమనార్హం. మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. కొనుగోళ్లు, నిర్మాణం పేరిట నిధుల దుర్వినియోగం ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. అలాగే 4000 మెగావాట్ల యాదాద్రి, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కింద జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే ఏడాది జూలైలో ఆయన విచారణ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జస్టిస్ లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించగా, అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి 114 పేజీల నివేదికను సమర్పించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. కాగా నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు..’ అని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఆదాయ వనరుల నివేదికపై చర్చ ‘ఆదాయ వనరుల సమీకరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి 4 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యం సిఫారసుల మేరకు శాస్త్రీయ విధానంలో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీలోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి కొత్త ధరలు, చార్జీలను ప్రకటించాలని అధికారులను ఆదేశించింది. పరిహారం రేట్లపై అసంతృప్తి వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తి ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల పరిహారం ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరించనున్నాయి. హిల్ట్ పీ దరఖాస్తుదారులకు అవకాశం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేలోపు హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ) కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించేలా వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి..’ అని మంత్రి చెప్పారు. ఎన్డీడీబీకి నార్మాక్ ‘నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల సహకార సంస్థ (నార్మాక్)ను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఎంఓయూను ఆమోదించింది. – యాసంగిలో పండిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరూ అభద్రతకు లోనుకావద్దని సూచించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో పంట నష్టం అంచనాలను తెప్పించాలని ఆదేశించింది. – 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బకాయిల వసూళ్లకు ఓటీఎస్ – క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడిన పన్నుల వసూళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.5,864 కోట్ల బకాయిలుండగా.. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి ఓటీఎస్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ జల మండలికి ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సి ఉన్న నీటి బకాయిలపై వడ్డీలు, జరిమానాలు రద్దు చేయాలని నిర్ణయించింది. – రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో అధునాత కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు గాను 42 ఎకరాలను అప్పగించాలని తీర్మానించింది. ‘స్కిల్స్’ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు – రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్‌లు, టీ శాట్‌ను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. – ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది..’ అని పొంగులేటి తెలిపారు. -
రూ. 2.5 లక్షల లంచం : సోదాల్లో రూ. 37 లక్షలు, భారీగా బంగారం,వెండి
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు చెందిన ఉన్నతాధికారి అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీజీసీఏలో పెండింగ్‌లో ఉన్న అనుమతులు మరియు ఆమోదాలను మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన కేసు విచారణలో భాగంగా సీబీఐకి దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి.రూ. 2.5 లక్షల లంచం ఆరోపణలతో డీజీసీఏ ఎయిర్‌వర్దినెస్ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న అధికారిని, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రతినిధిని సిబీఐ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 18న కేసు నమోదు చేసిన సీబీఐ లంచం తీసుకుంటుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో లభించిన భారీ నగదు , ఆస్తులు చూసి అధికారులే విస్తుపోయారు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు ఏకంగా రూ. 37 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారు, వెండి నాణేలను గుర్తించారు. వీటితోపాటు పలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై లోతైన విచారణ కొనసాగుతోందని సిబిఐ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను విశ్లేషించడం ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి -
పిల్ పెండింగ్‌లో ఉండగానే బాబు కేసును మూసేసిన ఏసీబీ కోర్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే, ఏసీబీ కోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకుందని న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పిల్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసిందని ఆయన వివరించారు. పైపెచ్చు ఈ కేసు డాక్యుమెంట్లను కోరితే అందుకుసైతం ‘థర్డ్ పార్టీ పేరుతో’ ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్నారు. ఇదే తరహా వ్యాజ్యాలు ఇప్పటికే ఇదే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. పిటిషనర్ తిలక్‌కు చంద్రబాబుపై నమోదైన కేసులతో సంబంధం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇదే తరహా అంశాలపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశి్నస్తూ తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ సరి్టఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు. -
చంద్రబాబు మద్యం కుంభకోణం కేసు డాక్యుమెంట్లు ఇప్పించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన వేల కోట్ల రూపాయల భారీ నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశ్నిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ హైకోర్టును ఆశ్రయించారు. తనను థర్డ్ పార్టీగా పేర్కొంటూ తాను కోరిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందని తాజా పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ తాలూకు సర్టిఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరారు. పిటిషన్లో ముఖ్యాంశాలు.. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులు వారికి అనుకూలమైన కొన్ని డిస్టిలరీలకు, అధికారంలో ఉన్న వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా మద్యం విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, మద్యం నాణ్యత కూడా క్షీణించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో కొంతమంది ప్రజా సేవకులు (పబ్లిక్ సర్వెంట్లు) ఉన్నారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి అనేది కేవలం వ్యక్తిగతమైనది కాదు.. అది మొత్తం రాష్ట్రానికి, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. కాబట్టి, చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ను ప్రశ్నించే హక్కు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఉంటుంది. ఆ ప్రకారమే, నాకు కూడా ఈ కేసును ప్రశ్నించే చట్టపరమైన హక్కు ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాను. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఈ పిల్ పెండింగ్‌లో ఉండగానే, మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్లో తదుపరి విచారణ నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్లు చాలా అవసరం. పిల్ దాఖలు చేసింది నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరాను. అయితే ఏసీబీ కోర్టు దీనికి నిరాకరించింది. -
20 ఏళ్లకు నిందితుడిని పట్టుకున్న సీబీఐ
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఓ విద్యార్థి హత్య కేసును ఎట్టకేలకు సీబీఐ ఛేదించింది. 2005లో కేరళలో జరిగిన హత్య కేసులో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అండమాన్ వాసిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మారుపేరుతో చలామణీ అవుతున్నాడని గుర్తించి అరెస్ట్ చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన శ్యామ్ మండల్ అనే విద్యార్థి 2005 అక్టోబర్‌లో కిడ్నాపయ్యాడు. దుండగులు అతడి తండ్రికి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. అదే నెల 23వ తేదీన తిరువనంతపురంలోని వెల్లార్ వద్ద శ్యామ్ మృతదేహం కన్పించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అండమాన్ నికోబార్‌కు చెందిన దుర్గా బహదూర్ భట్ ఛత్రి, మహ్మద్ అలీలను పోలీసులు నిందితులుగా గుర్తించారు. అలీని అరెస్ట్ చేసి, 2022లో జైలుకు పంపారు. ఛత్రి జాడ మాత్రం దొరకలేదు. 2008 డిసెంబర్లో ఈ కేసును కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి ఇరవయ్యేళ్లుగా ఛత్రి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సూరజ్ భట్ అనే మారుపేరుతో ఛత్రి చలామణి అవుతున్నట్లు సీబీఐ వర్గాలు కనిపెట్టాయి. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఛత్రి స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై సీబీఐ స్థానిక పోలీసుల సాయం కోరింది. వారు గుర్తింపు కార్డులతోపాటు అతడి నేపథ్యం గురించి చుట్టుపక్కల వారిని ఆరాతీశారు. ఛత్రినే సూరజ్ భట్ అని పోలీసులు ధ్రువీకరించడంతో శుక్రవారం సీబీఐ బృందం అరెస్ట్ చేసింది. -
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) నిధుల మళ్లింపు కేసులో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన రూ.2929.05 కోట్ల బ్యాంకు మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది.నిధుల మళ్లింపుపైనే ప్రధాన దృష్టితెల్లవారుజామునే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని ఆర్‌కామ్‌కు కేటాయించిన రుణాల వినియోగంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కంపెనీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే ఆరోపణలున్నాయి. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అనిల్ అంబానీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 19, 20 తేదీల్లో ఆయన దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరు అవుతున్నారు.ముగిసిన ‘జై అన్మోల్’ విచారణఇదే క్రమంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని కూడా సీబీఐ వదిలిపెట్టలేదు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)లో జరిగిన రూ.228.06 కోట్ల ఆర్థిక అవకతవకలపై గత వారం (మార్చి 14, 2026) ఆయన్ను అధికారులు విచారించారు. ‘చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అనిల్ అంబానీ కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ విచారణకు హాజరవుతున్నారు’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి చెప్పారు.ఈ కేసులో మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, రిలయన్స్ గ్రూప్ మాజీ ఉన్నతాధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే జై అన్మోల్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
‘ఇన్నర్’లో సీఐడీని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై వాదనలు ముగిశాయి. అలాగే ఈ కేసులో చంద్రబాబుకు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణార్హతతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును ఏసీబీ కోర్టు నుంచి విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ విచారణార్హతపై కూడా వాదనలు ముగిశాయి. ఈ మూడు వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆధారాలు ఉన్నాయన్న అదే సీఐడీ.. ఇప్పుడు లేవంటోంది అంతకు ముందు ఆళ్ల తరఫున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు.. » ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నారు. » ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ప్రస్తుతం సీఐడీ పనిచేస్తోంది. » ఈ నేపథ్యంలో సీఐడీ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. » గతంలో ఆళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ ఆ తరువాత ప్రాథమిక విచారణ జరిపి పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి, చార్జిషీట్ దాఖలు చేసింది. » అయితే ప్రభుత్వం మారిన వెంటనే సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఏకంగా కేసును మూసివేసేందుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. » ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన కింద పనిచేసే సీఐడీని ప్రభావితం చేస్తున్నారు. అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. » ఇక చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పలు షరతులు విధించింది. దర్యాప్తును ప్రభావితం చేయరాదన్నది కూడా ఓ షరతు. చంద్రబాబు ఆ షరతును ఉల్లంఘించారు. అందుకే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలి. » అంతేకాక ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టే వినాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పింది. చార్జిషీట్ దాఖలు చేయడం పూర్తయిన నేపథ్యంలో ట్రయల్ నిర్వహించే నిమిత్తం ఏసీబీ కోర్టు ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సి ఉంటుంది. » కాగా, సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. రాజకీయ కారణాలతో ఆళ్ల ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని తెలిపారు. -
ఢిల్లీ మద్యం కేసులో కవితకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందించారు. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మద్యం కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పుపై సీబీఐ.. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ వేసింది. ఈ మేరకు కేసులో నిందితులుగా పేర్కొన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సహా 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం సీబీఐ అధికారులు కోర్టు నోటీసుల కాపీని బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో అందించారు. సీబీఐ అధికారులు తనకు నోటీసులు ఇచ్చినట్టు కవిత ధ్రువీకరించారు. ఈ విషయంపై తమ లీగల్ బృందంతో చర్చిస్తున్నామని, విచారణకు సహకరిస్తానని కవిత ఎక్స్‌లో పోస్ట్ పేర్కొన్నారు. -
వివేకా కేసులో సునీతకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి చుక్కెదురైంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని తాజాగా సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని వెల్లడించింది. దీంతో, సునీతారెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. -
టీవీకే చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ను మార్చి 15న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు మంగళవారం సమన్లు పంపారు.విజయ్ను సీబీఐ జనవరిలో రెండు సార్లు విచారించింది. మరోసారి మార్చి 9న హాజరుకావాలని చెప్పింది. అయితే, 15 రోజుల పాటు తన విచారణను వాయిదా వేయాలని ఆయన అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ విచారణ చెన్నైలో లేదా తమిళనాడులోని ఇతర ఏ కార్యాలయంలోనైనా నిర్వహించాలని విజయ్ కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే, సీబీఐ మాత్రం తమ ప్రధాన కార్యాలయం ఉన్న ఢిల్లీలో మార్చి 15న హాజరుకావాలని సూచించింది.కరూర్ నుంచి ద్రావిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా బాలాజీ స్పందిస్తూ.. మార్చి 17న సీబీఐ ముందు హాజరై కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.కాగా, 2025 సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లాలో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో సీబీఐ నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.గత సంవత్సరం అక్టోబరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. అదే సమయంలో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేలా సీనియర్ అధికారిని నియమించాలని సీబీఐ డైరెక్టర్‌కు ఆదేశించింది.న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసిందని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగితేనే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం తిరిగి ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. -
కల్తీ పాల కేసు CBIకి అప్పగించాలి
-
TVK అధినేత, దళపతి విజయ్ కు సీబీఐ సమన్లు
-
‘ఇన్నర్’ను సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలని సోమవారం హైకోర్టుకు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ విన్నవించారు. కేసులో అప్పుడు నిందితునిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ముఖ్యమంత్రికి కొమ్ముకాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసు మూసివేతకు ఏకంగా ఏసీబీ కోర్టులో రెఫర్డ్ చార్జిïÙట్ దాఖలు చేసిందన్నారు. అయితే ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తదుపరి విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టులో చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు.. n 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేశ్, నారాయణ మంత్రులుగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయి. n దీనిపై సీఐడీ కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది. ఐదు వేల పేజీలకు పైగా ఆధారాలను సేకరించింది. ఆ మేరకు ఏసీబీ కోర్టులో చార్జిïÙట్ కూడా దాఖలు చేసింది. n సాంకేతిక కారణాలతో ఈ చార్జిïÙట్ను కోర్టు వెనక్కి ఇచి్చంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. n సీఐడీ అదనపు డీజీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తారు. n సీఐడీ అధికారుల పదోన్నతులు, బదిలీలు అన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే సాగుతాయి. n అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును సీబీఐకి బదలాయించాల్సిన అవసరం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలి కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తమిళనాడులో ట్విస్ట్.. విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: టీవీకే అధినేత, నటుడు విజయ్‌కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలని తాజాగా నోటీసులు పంపింది. ఈ క్రమంలో మార్చి 10న దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట హాజరుకావాలన్న సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, కరూర్ ఘటనలో విజయ్ ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఢిల్లీలోని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.#TamilNadu: #CBI has reportedly issued a summons to actor and Tamilaga Vettri Kazhagam (#TVK) chief #Vijay, asking him to appear for inquiry on March 10 in connection with the #Karur crowd stampede case.— South First (@TheSouthfirst) March 9, 2026గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్‌ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.ఇక, తమిళనాడులో కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. -
స్కామ్ కథ కంచికేనా?
కథలన్నీ కంచికి చేరతాయో లేదోగానీ... రాజకీయ ప్రయోజనాలనాశించి పెట్టే కేసులన్నీ, సీబీఐ, ఈడీల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం గాలికి కొట్టుకుపోతున్నాయి. ఆ వరసలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తాజా ఉదాహరణ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతోపాటు 23 మందిపై అవినీతి, కుంభకోణం ఆరోపణలు చేస్తూ 2022లో సీబీఐ దాఖలు చేసిన కేసులో అందరూ నిర్దోషులని ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సీబీఐకి చెంపపెట్టు. పనిలో పనిగాతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవితను కూడా నిందితురాలిగా చేర్చారు. ఆమె సైతం ఇప్పుడు నిర్దోషిగా తేలారు. 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూరేలా మద్యం విధానం తీసుకొచ్చిందంటూ ఈ కేసు అల్లారు. అధికారంలో కొచ్చిన ఏ రాజకీయ పక్షమైనా అమల్లో ఉన్నవాటిని కాదని, తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త విధానాలు ప్రవేశపెడుతుంది. అవన్నీ సరైనవి కాకపోవచ్చు. వాటి వెనక స్వీయ ప్రయోజనాలుండొచ్చు. ఆ నిర్ణయాల పర్యవసానంగా ఖజానా నష్టపోతే, ప్రజల ప్రయో జనాలు దెబ్బతింటే చర్యలు తీసుకోవాల్సిందే. వాటినెవరూ ప్రశ్నించరు. కానీ అందుకు తగిన మౌలిక ఆధారాలు, ప్రాతిపదిక ఉండాలి. విధానం మార్చడం దానికదే ఒక కుంభ కోణంగా చిత్రించటం, ఆ పేరిట కేసులు, అరెస్టులతో వేధించటం, ఏళ్ల తరబడి దర్యాప్తు, చివరకు నిరూపించలేక న్యాయస్థానాలతో చీవాట్లు తినడం ఏం మర్యాద? ఇందువల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయత దెబ్బతినడం లేదా? తాత్కాలికంగా మీడియాలో భారీ యెత్తున ప్రచారం జరగొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదని జనం అభిప్రాయపడేలా చేయొచ్చు. ఎన్ని చేసినా ఆరోపణల్ని రుజువు చేయటం అంతిమంగా దర్యాప్తు సంస్థ బాధ్యత. పత్రికల్లో రోజుల తరబడి పతాక శీర్షికలు ఆక్రమించి, టీవీ చానెళ్లలో గంటల తరబడి చర్చలకు కారణమైన కేసులు చివరకు దూదిపింజెల్లా తేలిపోవటం, గాలి పోగేయటం తప్ప ఇందులో ఆవగింజంతైనా వాస్తవం లేదని తేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ కేసుల్ని ఆధారం చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు ఇష్టానుసారం వ్యాఖ్యా నాలు చేయటం, అవమానించేలా శీర్షికలు పెట్టడం మరో ప్రహసనం. ఎవరికీ తెలియని ‘సౌత్ గ్రూప్’ను సృష్టించి, దానికి లబ్ధి కలిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చిందని, ఇందులో రూ. 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. 2023 ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియానూ, 2024 మార్చిలో కవితనూ, కేజ్రీవాల్‌నూ అరెస్టు చేశారు.అన్ని కేసుల్లో మాదిరే ఇక్కడ కూడా మనీశ్ సన్నిహితుడు దినేశ్ అరోరా, ఏపీకిచెందిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వంటివారిని అప్రూవర్లుగా మార్చుకున్నారు. ఈ ముగ్గురూ పూసగుచ్చినట్టు చెప్పారంటూ లీకులిచ్చారు. కానీ అలా అంటే సరిపోదు... వాటిని ధ్రువపరిచే సాక్ష్యాలుండాలి. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తే కాదు... అంత మొత్తం ఎలా ప్రయాణించిందో, ఏయే ఖాతాలకు మళ్లిందో చూపాలి. అడుగడుగునా ఆధారాలుండాలి. ఫలానా అంశాలు రాబట్టామని ఏకరువు పెట్టినంత మాత్రాన కుదరదు. వాటిమధ్య పరస్పర సంబంధాన్ని సందేహాతీతంగా రుజువు పరచాలి. ఆ సంగతలా ఉంచి కనీసం అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 7, 13 కింద ఆరోపించిన లంచం ఆరోపణల్ని కూడా సీబీఐ ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. అందుకే కాబోలు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యకు కోర్టు ఆదేశించింది.అయితే ఈ కేసులో సీబీఐ అప్పీలుకెళ్లింది. అంటే ఈడీ దర్యాప్తు ఇంకా సాగుతూనేఉంటుందనుకోవాలి. కాకపోతే ఇందులో అవినీతిపరుడిగా ముద్రపడిన కేజ్రీవాల్నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. నిందితులంతా కారాగారవాసంతో సహా మూడున్నరేళ్లపాటు నానా కష్టాలు పడ్డారు. బహుశా వారిని ఆర్థికంగా కూడాకుంగదీసి ఉండొచ్చు. కానీ దర్యాప్తు పేరిట ప్రజాధనం, న్యాయస్థానాల విలువైన సమయం వృథా కావటం మాటేమిటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణులు కొనసాగనీయటం అవాంఛనీయం, ప్రమాదకరం. -
ఢిల్లీ లిక్కర్ కేసు.. హైకోర్టులో సీబీఐ అప్పీల్
ఢిల్లీ: లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మంది నిందితులను ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. అభియోగాలకు తగిన ఆధారాలను సీబీఐ చూపకపోవడంతో నిందితులను స్పెషల్ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే.. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్‌తోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలనుకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో కేజ్రీవాల్, మణీష్ సిసోడియా సహా 20 మంది నిందితులందరికీ కోర్టు శుక్రవారం విముక్తి కల్పించింది.అలాగే సీబీఐ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల చార్జ్‌షీట్‌లో అనేక అంశాలు సాక్ష్యాలు లేదా సాక్షుల వాంగ్మూలాలతో మద్దతు పొందలేదని పేర్కొంది. చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని కూడా న్యాయ మూర్తి గమనించారు. సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేక పోయిందని కోర్టు తెలిపింది. -
లడ్డూపై ఏకసభ్య కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం రేపు(సోమవారం) విచారణ చేపట్టనుంది.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌పై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు.అయితే, తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కల్తీ కుతంత్రం పనిచేయకపోవడంతో చంద్రబాబు.. తన సొంత కమిటీ వేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపింది. సిట్ సూచనలకు భిన్నంగా కమిటీ ఏర్పాటు చేసి.. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది. -
మణిపూర్ హింసపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. అదేవిధంగా, సుప్రీంకోర్టుకు బదులుగా మణిపూర్ హైకోర్టు లేదా గౌహతి హైకోర్టు లేదా రెండు కోర్టులు కలిపి అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ఇతర పరిణామాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మణిపూర్ హింసాత్మక ఘటనల బాధితుల పునరావాసం, సంక్షేమంపై ఏర్పాటైన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ సిఫారసులను తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జాతుల మధ్య వైరంతో 2023లో మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి దాఖలైన 11 ఎఫ్ఐఆర్లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘బాధితులకు న్యాయం చేకూర్చేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు కమిటీలు 27 నివేదికలను కోర్టుకు అందజేశాయి. మా చేతికి ఒక్కటీ అందలేదు. అయితే, ఆ నివేదికల్లోని అత్యంత సున్నితమైన అంశాలు లీకవుతాయేమోనని ఆందోళన చెందుతున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. బాధితుల తరఫు లాయర్ గొన్జాల్వెస్ స్పందిస్తూ సున్నితమైన అంశాలను తొలగించడం లేదా నల్లటి గీతతో మూసివేయవచ్చని సూచించారు. అదేవిధంగా, గ్యాంగ్ రేప్‌నకు గురైన కుకీ వర్గానికి చెందిన బాధితురాలు ఇటీవలే చనిపోయారని సీనియర్ లాయర్ వృందా గ్రోవర్ తెలిపారు. ఈ కేసులో చార్జిషీట్ వేసిన సీబీఐ అధికారులు బాధితురాలి కుమార్తెకు అందుకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘దిగువ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సీబీఐ ప్రతినిధి రాలేదు. ప్రధాన నిందితుడిని హాజరుపర్చలేదు. అధికారుల నిర్లక్ష్యం చూసి షాకవుతున్నాం’అని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. -
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్‌షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్‌మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్‌రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్‌లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్‌లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్‌లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్‌షీట్‌లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్‌షీట్‌లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్‌షీట్‌లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్‌ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్‌గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్‌షీట్‌లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్‌గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్‌లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్‌రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్‌ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్‌ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్‌పై నమోదైన కేసులే నిదర్శనం. -
సీబీఐ క్లీన్‌చిట్‌పై ‘ఏకసభ్య’ డ్రామా!
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి సీబీఐ సిట్ రిపోర్టుతో చెక్ పడటం.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని సీబీఐ సిట్ చెప్పలేదని.. దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మరి సిట్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ సిట్ చార్జిషీట్లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఇంకా కుట్రలు పన్నుతారా? అని ధ్వజమెత్తారు. ఏమీ లేకపోయినా రాజకీయ కుట్రలతో వైఎస్సార్ సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం’ జోక్యంతో సాగని బాబు ఆటలు.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్‌ను నియమించి వాటినే రిపోర్టులో ఇచ్చేద్దామని భావించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు కావడంతో ఆయన ఆటలు సాగలేదు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దర్యాప్తులో అన్నీ తేలిపోవడంతో.. చంద్రబాబు తనను తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు. కానీ సీబీఐ సిట్ చెప్పింది.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమనే. ఆ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ముతున్న జగన్ పేరు ఉందా? సిట్ రిపోర్టులో జగన్ కానీ, అప్పటి దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో.. ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైఎస్ జగన్‌కు ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నెయ్యి కిలో రూ.291కే మీరు కొనలేదా? శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్ కలిశాయని, మార్కెట్ కన్నా తక్కువ రేటు రూ.319కే ఎలా ఆవు నెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్‡్ష ఫ్రెష్ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమోదిస్తే... ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాడు ఫిబ్రవరి తర్వాత ఉన్న ప్రభుత్వం మాదే అయితే మే నెలలో ఈసీతో పోట్లాడి మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పోలింగ్ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్గానే పని చేసింది. 2019లో జగన్ సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్‡్ష ఫ్రెష్ డెయిరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మీరు కిలో నెయ్యి రూ.291కి ఎలా కొన్నారు? మా హయాంలో రూ.319, రూ.329కి కొనుగోలు చేస్తే తప్పు అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. టెండర్లు వివరాలు తేదీలతో సహా బయటపెట్టండి. ఎవరు దొంగో ఎవరు దొరో తేలుతుంది. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామా.. పవన్ కళ్యాణ్ ఉచ్ఛం నీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి! క్రిస్టియన్ అంటారు.. బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా? అని పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెబుతున్నారు. దేవుడంటే భయం లేని వారు ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య.. గతంలో దేవుడే లేడని అంటాడు! దేవుడిని విమర్శించను.. లేని వారి గురించి ఎలా మాట్లాడతా? అంటాడు. తమ్ముడు కోటింగ్ ఇచ్చాక బయటికి వచ్చి.. నేను సనాతన హిందువును! వైఎస్ జగన్ క్రిస్టియన్ అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్లెవరో పవన్‌కు తెలియదా? ఆ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చేయించి హైందవ సంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా? అంతర్వేది రథాన్ని కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. మీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడులో రథాన్ని తగలబెడితే చర్యలు తీసుకున్నారా? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మరి మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా? గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర బాబుదే 2015–16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో పలు ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబు... 250 గుళ్లు జగన్ ధ్వంసం చేశారని అనటానికి సిగ్గుందా? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా అవి. ఉత్సవమూర్తులే కాదు.. గర్భగుడిలో ఉన్న మూర్తులను కూడా మీ ప్రభుత్వంలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెంపలు వాయించుకున్నారా? ఎక్కడైనా మెట్లు కడిగారా? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని జగన్ తిరిగి నిర్మించారు. దేవుడి మీద పగ పెట్టుకున్నారని అంటున్న పవన్.. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా? నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని, అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్ కళ్యాణ్ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్.. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు? తండ్రి చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట. తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైఎస్సారే ఏడు కొండలను నాడు వైఎస్సార్ రెండు కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్ దు్రష్పచారం చేస్తున్నారు. తిరుమల ఏడు కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలని, ఆ కొండల మీద అన్యమత ప్రచారం నిషిద్ధమని 2007 జూన్ 2న వైఎస్సార్ జీవో ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పాలి. తమ ఇంట్లో నుంచి చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తి పారవశ్యం చెందుతున్నట్లు చంద్రబాబు చెబుతున్న మాటలు.. వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెబుతున్నట్లుంది! మీ మాటలు నమ్మటం లేదని పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నట్లున్నారు. జనం ఆయన మాటలు కూడా నమ్మడం ఎప్పుడో మానేశారు.జంతు కొవ్వు ప్రచారం మీ నలుగురిదే వైఎస్ జగన్ క్రిస్టియన్ అని... శ్రీవేంకటేశ్వరస్వామికి హిందూ భక్తులను తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచి్చమాటలు చెబుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు! జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని గద్దిస్తున్న చంద్రబాబు... అది ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి మినహా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని ఈ డ్రామాలు చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒకలా.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు రూ.4.65 కోట్లు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. మరి మీ పీఏ శ్రీనివాస్‌కు రూ.2 వేల కోట్లు వచ్చాయని ‘ఈడీ’ చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నారు. అది బహిర్గతం కాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసి తానూ, తన కుమారుడు కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో ఎక్కడా వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ వితండవాదం చేస్తున్నారు. రేపు కొత్త కమిషన్ (వన్‌మెన్ కమిషన్) వేసి జగన్‌ను, వైవీ సుబ్బారెడ్డిని చేర్చే దుర్బుద్ధితో ఉన్నారని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వీళ్ల మాటలున్నాయి. మతం పేరుతో జగన్‌ను నాశనం చేయాలని ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అపచారాలను ప్రశ్నించాలని, కట్టడి చేయాలని స్వామీజీలను ప్రవచనకారులను, హైందవ ధర్మ పరిరక్షకులను కోరుతున్నాం.ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? శ్రీవేంకటేశ్వరస్వామివారికి తలపెట్టిన అపచారం తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్మీట్లో అస్మదీయులు అడుగుతున్న ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. టీటీడీని ప్రక్షాళన చేయమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు... నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేశ్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో జగన్ లడ్డూలు చేయించారని, తాము మాత్రం నాలుగు లారీలను వెనక్కి పంపామని చెప్పుకున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్ రిపోర్టులో పేర్కొంది.ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? ఎవరు మట్టికొట్టుకుపోవాలి? ఎవరు సర్వనాశనం అవుతారు? -
సమాధానం చెప్పలేక బాబు అసహనం
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడేందుకు జనసేన, బీజేపీతో కలసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర అసహనం ప్రదర్శించారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేయడంపై తన అనుకూల మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులతో సీఎం గురువారం సమావేశం నిర్వహించి లడ్డూ వ్యవహారంపై చర్చించారు. అనంతరం వారందరితో పాటు ఐదుగురు మంత్రులతో కలసి మీడియాతో మాట్లాడారు. సిట్ చార్జిషీట్లో జంతువుల కొవ్వు లేదని ఉంది కదా? అన్న విలేకరుల ప్రశ్నకు ఒక్కసారిగా ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘లేదని ఎక్కడుంది..? నీకేమైనా కల వచ్చింందా..? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా..? వాట్ ఆర్ యూ టాకింగ్..? మర్యాదగా చెబితే వినాలి..’ అంటూ చిందులు తొక్కారు. ఆ ప్రశ్న అడిగింది ఎల్లో మీడియా రిపోర్టరే కావడంతో కొంత తమాయించుకున్నా, ఆగ్రహాన్ని మాత్రం దాచుకోలేకపోయారు. సిట్ వేసిన చార్జిషీట్ ఇంకా నంబర్ అవలేదని, ఒక నివేదికను తమకు పంపి చర్యలు తీసుకోవాలని కోరిందని తెలిపారు. దానిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే కోర్టుకు అదనపు వివరాలు ఇస్తామని చెప్పారు. సిట్ నివేదికలో రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారైనట్లు ఉందన్నారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదన్నారు. ఎన్డీడీబీ నివేదికలోని అంశాన్నే తాను ప్రస్తావించానని చెప్పారు. హిందూ మతంలో విడాకులు ఇవ్వడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదికను చంద్రబాబు తమకు చదివి వినిపించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీటీడీ సహా అనేక పెద్ద ప్రాజెక్టుల్లో అక్రమాలకు గత ప్రభుత్వం తెర తీసిందని పీవీఎన్ మాధవ్ ఆరోపణలు చేశారు. -
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీత రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ పేర్కొంది.విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఇలా అయితే మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చు. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వం అని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు.గత విచారణలో(జనవరి 20) కూడా.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా.. సునీత పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్‌లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్‌ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్‌షీట్‌లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌లతో సమావేశమై చార్జ్‌షీట్‌లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్‌షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్‌ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌కు చీఫ్‌గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్‌కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
Operation CyStrike: నకిలీ వీసా రాకెట్.. గుట్టురట్టు చేసిన సీబీఐ
కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్లించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛేదించింది. అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సై-స్ట్రైక్ (Operation CyStrike)తో ముఠా ఆటకట్టించారు. జనవరి 30న ఢిల్లీతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలతో పాటు రూ. 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించారు. తద్వారా నిరుద్యోగులను ఆకర్షించి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు వీరు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు eservicemoi-kw.com అనే వెబ్‌సైట్‌ను ప్రధాన నకిలీ పోర్టల్‌గా గుర్తించారు.కువైట్ వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రానిక్ వీసా దరఖాస్తుల కోసం www.indianvisaonline.gov.in మాత్రమే అధికారిక పోర్టల్ అని స్పష్టం చేసింది. అనధికారిక వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే!
సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బరి తెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని ప్రఖ్యాత ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు నిర్వహించిన పరీక్షల్లో నిర్థారణ కావడం.. సాక్షాత్తూ సీబీఐ కూడా దర్యాప్తులో అదే విషయాన్ని తేల్చి న్యాయస్థానానికి నివేదించడంతో దిక్కు తోచని చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీడీబీ) పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు చంద్రబాబు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. తన రాజకీయ స్వార్థం కోసం ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్థారిస్తూ 2025 మార్చి 27న ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక ఇవ్వగా.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీ 2025 మే 16న రిపోర్టు ఇచ్చింది. అదే విషయాన్ని తన దర్యాప్తులో నిర్థారిస్తూ, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని పేర్కొంటూ సీబీఐ ఈ ఏడాది జనవరి 23న న్యాయస్థానంలో చార్జిషీట్‌ను సమర్పించింది. అయినా సరే.. ఏమాత్రం పాపభీతి లేకుండా.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని రీతిలో చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలాడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ నియమించిన సిట్ తేల్చిచెప్పినా... లెక్క చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సిందిపోయి రాజకీయ కుట్రలతో చంద్రబాబు మరింత దిగజారి వ్యవహరిస్తుండటం పట్ల శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ ధర్మం, కలియుగ దైవం తిరుమల శ్రీవారి పట్ల ఏమాత్రం భయభక్తులు లేకుండా చంద్రబాబు అసత్యాలు వల్లిస్తుండటం.. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు కుతంత్రాలకు పాల్పడటం పట్ల కన్నెర్ర చేస్తున్నారు. ఈ దారుణమైన అబద్ధాలు, నిందలను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసుల సమక్షంలోనే దాడులకు పురిగొల్పుతూ ప్రభుత్వ పెద్దలు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. ఈ అరాచకాలను స్వయంగా పర్యవేక్షిస్తూ కుట్రలకు పదును పెడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. సీబీఐ తేల్చిచెప్పినా అదే కుట్రా బాబూ! ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యా»ొరేటరీల్లో తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, గొడ్డు, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ తన చార్జిషిట్‌లో స్పష్టం చేసింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లేదని అంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయాలను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది.రాజకీయ స్వార్థంతోనే చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది జాతీయ స్థాయిలో స్పష్టమైంది. అయితే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే నిరూపిస్తున్నారు. అందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారమే తాజా తార్కాణం. 2024 అక్టోబర్‌లో మొదలు పెట్టిన ఈ కుతంత్రాన్ని ఏడాదిన్నరగా కొనసాగిస్తుండటం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అందుకే వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసు విచారణను చేపట్టింది. వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిళ్లను హర్యానాలోని ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ)లో ల్యాబరేటరీకి పంపించి పరీక్షించింది. ఆ నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని ఆ పరీక్షల్లో వెల్లడైంది. ఈమేరకు శాస్త్రీయంగా విశ్లేíÙంచి ఎన్డీఆర్ఐ 2025 మే 16న సాధికారికంగా వెల్లడించిన ఆ నివేదికనే సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షిట్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’ను పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు కుట్రలడ్డూ ప్రసాదంపై తమ దు్రష్పచారం బెడిసికొట్టడంతో చంద్రబాబు కంగు తిన్నారు. దాంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన మళ్లీ అదే కుట్రను పదును పెట్టడం గమనార్హం. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించడంతోనే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ దు్రష్పచార కుట్రకు తెగబడుతున్నారు. వాస్తవానికి నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలసి ఉండొచ్చని ఎన్డీడీబీ నివేదిక అభిప్రాయపడింది. అంటే మొక్కల నుంచి వచ్చే వెజిటబుల్ ఫ్యాట్‌నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా చెబుతూ నివేదికలో అభిప్రాయపడింది. అది సర్వసాధారణ అంశమే. పశువులు తినే మొక్కలు, దాణాను బట్టి అది ఆధారపడి ఉంటుందని ఆహార శాస్త్ర నిపుణులే చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.కానీ చంద్రబాబు మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే టీటీడీ నెయ్యిపై దు్రష్పచారం కొనసాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిపే అవకాశం లేనే లేదని గుజరాత్‌లోని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైంది. అదే విషయాన్ని 2025 మార్చి 27న సీబీఐకి నివేదించింది. సీబీఐ ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషిట్లోనూ అదే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది. టీటీడీ నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిసే అవకాశమే లేదని చార్జీషిట్లోని 208వ పేజీలో పేర్కొంది. అయినాసరే చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్పచ్రార కుట్రలను కొనసాగిస్తున్నారు. ఎన్డీడీబీ చెప్పని విషయాలను చెప్పినట్లుగా పదేపదే విష ప్రచారం చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అదే నిజమైతే సీబీఐ ప్రస్తావించేది కదా! లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించి ఉంటే... సీబీఐ తన చార్జ్షిట్లో ఆ విషయాన్ని ప్రస్తావించేది కదా అని నిపుణులు చెబుతున్నారు. కానీ 219 పేజీల చార్జ్షిట్లో సీబీఐ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. ఎన్డీడీబీ నివేదిక గురించి కూడా చార్జ్షిట్లో ప్రస్తావించింది.. కానీ టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైనట్టు ఎక్కడా పేర్కొననే లేదు. అదే సమయంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ఇచ్చిన నివేదికనే సీబీఐ తన చార్జ్షిట్లో ప్రముఖంగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా ఏమాత్రం ఇష్టపడటం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం!
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ – నెల్లూరు న్యాయస్థానంలో తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమై స్థానంలో ఉంటూ రాజకీయ కుట్రలతో ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసిందన్న తన నిరాధార ఆరోపణలు బెడిసికొట్టడం.. ముఖ్యమంత్రి హోదాలో మహాపచారానికి పాల్పడటంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటం, దారుణమైన అబద్ధాలాడిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తుండటంతో సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో తన పాచిక పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం మరో పన్నాగం పన్నింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టులు కేటాయించారని.. చిన్నప్పన్నను వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ వక్రీకరణలకు పాల్పడుతోంది. కట్టబెట్టింది టీడీపీ హయాంలోనే.. చార్జ్‌షీట్‌లో వెల్లడించిన సీబీఐ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించేందుకు చంద్రబాబు బృందం పడరాని పాట్లు పడుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. భోలే బాబా డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. భోలే బాబా కంపెనీకి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారని సీబీఐ చార్జ్‌షీట్‌లో వెల్లడించడం గమనార్హం. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొంది. ‘లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ అని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. .ఆ శాంపిల్స్.. బాబు సీఎం అయ్యాక తీసినవే ఇక ప్రస్తుతం కల్తీ అంటూ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక తీసిన శాంపిల్స్ అవి! ఆ నెయ్యి శాంపిల్స్ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో తీసినవే. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగింది. మరి ఆ నెయ్యిలో కల్తీ ఉంటే అందుకు బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనన్నది సుస్పష్టం. కొనుగోలు కమిటీలో కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చంద్రబాబు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే... వైఎస్సార్సీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సభ్యులుగా ఉన్నారు. నాడు టీటీడీ పర్చేజ్ కమిటీలో సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. అదంతా కల్తీయేనా బాబూ?2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి నెయ్యి కిలో రూ.276 – రూ.314 మధ్య కొనుగోలు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే అది తక్కువే. మరి దాన్ని బట్టి బాబు సర్కారు కొన్న నెయ్యి అంతా కల్తీయేనని భావించాలా? శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే..! తిరుమల శ్రీవారి నిధుల వినియోగంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. అందుకు టీటీడీ తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవరే నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లలో టీటీడీ 67 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం వెచ్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ కనీసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని వారించినా లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్ నిర్మాణానికి టీటీడీ పాలకమండలిలో తీర్మానం చేసింది. అంతేకాదు.. నిర్మాణ వ్యయాన్ని రూ.40 కోట్లు తగ్గించి శ్రీవారి నిధులను ఆదా చేసింది. ఇక టీడీపీ హయాంలో టీటీడీ నిధులు రూ.1,300 కోట్లు ప్రైవేట్ రంగంలోని ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడంపై తీవ్ర విమర్శలు రేగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించి... ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయించింది. తప్పుడు నివేదిక బాబు హయాంలోనే.. గతంలో భోలే బాబా డెయిరీ పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ’. ఆ పేరుతోనే 2018 మేలో తొలిసారి టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. లీటరు నెయ్యి కేవలం రూ.290కే సరఫరా చేస్తామని టెండరు వేస్తే టీటీడీ సమ్మతించి కాంట్రాక్టు కట్టబెట్టింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. హర్ష్ డెయిరీని తనిఖీ చేసేందుకు 2018 ఏప్రిల్ 17న అప్పటి టీటీడీ ఈవో నిపుణుల కమిటీని పంపారు. కానీ ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చి మోసగించింది. హర్ష్ డెయిరీ రోజుకు 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని... రోజుకు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ విధంగా తప్పుడు నివేదిక ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 18న 82 వేల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ మళ్లీ పాల్గొని టెండరు దక్కించుకుంది. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు...ఏపీ భవన్ ఉద్యోగి తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్ర చారం చేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన్ను వైవీ సుబ్బారెడ్డి పీఏగా దుష్ప్ర చారం చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. తిరుమల లడ్డూపై దుష్ప్ర చారం ఆపాలని, నిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ నేతలు కాదు. ఇక సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో వైఎస్సార్ సీపీ నేతలు సహా గత ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లు ఏ ఒక్కరివీ లేవు. రాజకీయ కుట్రతో ఇంతటి బరితెగింపా బాబూ...! కేవలం రాజకీయ స్వార్థం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డారు. సీఎం హోదాలో దుష్ప్ర చార కుట్రకు బాబు నేతృత్వం వహించగా టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన సాగించి అమలు చేశారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది, చేప కొవ్వులు కలిపారంటూ చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేశారు. ఏమాత్రం పాపభీతి లేకుండా శ్రీవారి ఆలయ పవిత్రతకు కళంకం తీసుకువచ్చేందుకు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేందుకు కుతంత్రం పన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం..’ అనే పేరుతో 2024 సెప్టెంబర్ 20న ఒంగోలులో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని దీనికి వేదికగా చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారు. ఇక నారా లోకేశ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపి అపవిత్రం చేశారని దారుణమైన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిపినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొనడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే... తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడి కాలేదు. కేవలం రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు, ఆయన ముఠా ఎల్లో మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పక్కా పన్నాగం పన్నింది. ఇదిగో.. పంది కొవ్వు ఇంత శాతం..! ఆవు కొవ్వు ఇంత శాతం..! చేప కొవ్వు ఇంత శాతం..! అంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా పేజీలకు పేజీలు అవాస్తవ కథనాలతో దుష్ప్రచారం చేశాయి. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తెచ్చే కుట్రలో పాత్రధారిగా మారిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశి్చత్తం డ్రామాకు తెరతీశారు. మీడియా కెమెరాల ముందు విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లు కడిగి హైడ్రామాను రక్తి కట్టించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతారం ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు.. సీబీఐ దర్యాప్తులో వెల్లడి.. చార్జ్‌షీట్‌లో స్పష్టీకరణ తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. ఈమేరకు నెల్లూరులోని న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సీబీఐ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్ర చార కుట్రలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు వెంటనే ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ప్రభుత్వ పెద్దలు అమరావతికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాతే ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ నివేదిక వెల్లడించింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. శాస్త్రీయంగా విశ్లేషణ... సాధికారికంగా నిర్ధారణ... టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఆ విషయాన్ని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ)లకు పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యా»ొరేటరీలు 2025 మార్చి 27, 2025 మే 16న రెండు వేర్వేరు నివేదికల్లో నిర్ధారించాయని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలె్రస్టాల్ ఉంటుంది. కొలె్రస్టాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. నెయ్యి కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థరాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే కుట్రతో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. టీటీడీ అనుసరించే పటిష్ట విధానం ఇదీ... లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్ 1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి. ఓ ట్యాంకర్ నెయ్యి శాంపిల్‌లో 99.618 శాతం మిల్క్ ఫ్యాట్ ఉందని తేల్చుతూ ఎన్డీడీబీ కాల్ఫ్ 2024 జూలై 23న ఇచ్చిన టెస్ట్ రిపోర్టు ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చునని ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు 2024 జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులో పేర్కొన్న టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా కేజీ నెయ్యిలో 208.851 మిల్లీ గ్రాముల వెజిటబల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కూడా కలిసి ఉండే అవకాశం ఉందని 2024 జూలై 28న ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులో స్పష్టం చేసిన టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ 2024 జూలై 6, జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అదే నెల 22న సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న టీటీడీ అప్పటి ఈవో శ్యామలరావు (ఈయనే నెయ్యిలో జూలై 23న వనస్పతి డాల్డా వంటి వెజిటబుల్ ఆయిల్ కలిసిందని తిరుమలలో ఏడుకొండలస్వామి సాక్షిగా మీడియాకు చెప్పారు) » అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు. » తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవాలు. బాబు దుష్ప్రచారంపై జాతీయ మీడియాలో విమర్శల వెల్లువ తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కుట్ర పన్నడంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. జంతువుల కొవ్వు కలిసింది అంటూ నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ శ్రీవారి భక్తులు, వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేయడాన్ని జాతీయ మీడియా ప్రస్తావించింది. -
బాబు కుట్రకు శిక్ష ఉండొద్దా?
‘ఆత్రగాడికి బుద్ధి మట్టు...’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ప్రత్యర్థులపై బురద జల్లడం కోసం, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్మాదం ఆవహించిన చందాన 2024 సెప్టెంబర్‌లో ఒక మహాపరాధానికి పాల్పడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ఆరోపణకు సాహసించి ప్రపంచవ్యాప్తంగావున్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నిజం నిలకడ మీద తేలుతుందన్నట్టు ఇన్ని నెలల తర్వాత ఇదంతా పచ్చి బూటకమని సీబీఐ దర్యాప్తు నిగ్గుతేల్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి లడ్డూకు వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలో ఆవగింజంతైనా నిజం లేదని నిర్ధారించింది. హరియాణాలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)లు వేర్వేరుగా ఆ నెయ్యి నమూనాలను పరీక్షించి వెల్లడించాయని సీబీఐ తన చార్జిషీటులో తెలియజేసింది. ఈ నమూనాలు నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించామని వివరించింది. చిత్రమేమంటే తమ కుట్ర భళ్లున బద్దలైనా టీడీపీ నాయకు లకూ, వారి వందిమాగధ మీడియాకూ బుద్ధి రాలేదు. కిందపడ్డా తమదే పైచేయి అని చెప్పటానికి నానా తంటాలూ పడుతున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మరిన్ని వేల అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ఇలాంటి వంచకులను ఆ భగవంతుడు క్షమిస్తాడా? ప్రత్యర్థులపై పైచేయి సాధించ టానికి ఎత్తులు, పైయెత్తులేయటం... ఎలాగైనా గెలిచితీరాలని ఆత్రపడటం రాజకీ యాల్లో సర్వసాధారణం. కానీ మనిషి జన్మ ఎత్తినందుకు కనీసంగానైనా ఇంగితంఉండొద్దా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంపైనే నదురూ బెదురూలేకుండా విషం చిమ్మటం మహాపచారమన్న స్పృహ ఉండనవసరం లేదా? ఈ కుట్ర వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయి. అప్పటికి ఎడతెరిపి లేని వానలతో పొంగి ప్రవహిస్తున్న బుడమేరును కనీస ముందస్తు హెచ్చరిక లేకుండా, చడీచప్పుడూ కాకుండా వదలటం వల్ల విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. 50 మందికి పైగా దుర్మ రణం పాలయ్యారు. అది సర్కారీ జలప్రళయమని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు తన కొంప కాపాడుకునేందుకే ఇలా చేయించారన్న విమర్శలూ వచ్చాయి. అంతేకాక ఎన్నికల సంఘం ఎంతో తాత్సారం చేసి, నిబంధనలు కాలరాసి ఏపీలో ఎన్నికలు జరిగిన 108 రోజుల తర్వాత బూత్‌ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలతో కూడిన ఫామ్–20ని సెప్టెంబర్ 19న ఆన్లైన్లో పెట్టడానికి నిర్ణయించుకుంది. సరిగ్గా ఈ రెండు ఉపద్రవాలనుంచీ కాపాడుకోవటం కోసం అర్జెంట్‌గా జనందృష్టిని మళ్లించాలన్న ఆత్రుతలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు కూతలు మొదల య్యాయి. ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్కతాళం వేశారు. అయోధ్యకు జంతువుల కొవ్వు కలిసిన లక్ష లడ్డూలు వెళ్లాయంటూ వదిరారు. ఇరు పార్టీలూ ఇలా దుష్ప్రచారం చేస్తున్నా, అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. సొంత మనుషులతో సిట్ వేసే ప్రయత్నం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌తో బెడిసికొట్టింది.అవకాశం దొరికినప్పుడల్లా ‘నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువున’ని స్వోత్కర్షలకు పోయే చంద్రబాబుకు వాస్తవంగా అలవాటైన ఏకైక విద్య అబద్ధాలాడటం. దాని సాయంతోనే తన మామ ఎన్టీఆర్ నుంచి కుట్రపూరితంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంతకు ముందూ తర్వాతా కూడా తన ఎదుగుదల కోసం ఆయన చేయని పాపమంటూ లేదు. వీటన్నిటికీ పరాకాష్ఠ లడ్డూ ప్రసాదంపై సాగించిన దుష్ప్రచారం. ఇదే నేరాన్ని మరెవరైనా చేసివుంటే వ్యవస్థలు ఊరుకుంటాయా? కేసులు, శిక్షలూ లేకుండా వదులుతాయా? అందలాలెక్కినవారికి మాత్రం ఎందుకు మినహాయింపులుండాలి? ఇన్నేళ్ల పాపాలను ఈ అవసాన దశలోనైనా కడిగేసుకుందామనీ, ఇక బుద్ధెరిగి ప్రవర్తిద్దామనీ చంద్రబాబు అనుకోకపోవటం తెలుగు ప్రజల దురదృష్టం. -
‘పవన్ ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారో..’
సాక్షి,నగరి: రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో సీబీఐ రిపోర్టుపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు.తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారు. కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలి. చంద్రబాబు ప్యాకేజీ అందగానే పవన్ ఊగిపోయాడు.సనాతన ధర్మం ముసుగులో ప్యాకేజీల కోసం ఆడించే డ్రామా ఆర్టిస్టులు. పవన్ ఏ గుడిమెట్లు కడుగుతారో చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?.వైఎస్ జగన్ కాళ్లు కడిగి చంద్రబాబు, పవన్ నెత్తిన చల్లుకోవాలి. ఆడవాళ్లకు అబార్షన్లు చేయించి.. రోడ్డున పడేసిన వాళ్లు.. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?. తప్పుడు ప్రచారం చేసిన నోర్లను పినాయిల్‌తో కడగాలి. శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెప్తారు.విజయవాడ మునిగినప్పుడు చంద్రబాబు, ఇతర మంత్రులు హైదరాబాద్‌లో ఉన్నారు. కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు’అని మండిపడ్డారు. -
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్‌షీట్‌ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదువైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారంరాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటాహుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. బాబు కుట్రకు పవన్ వత్తాసుశ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వరద సహాయక చర్యల్లో వైఫల్యం...డైవర్షన్ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారంవిజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.కుట్రతోనే ‘పచ్చ’ సిట్... అడ్డుకున్న సుప్రీంకోర్టుతమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివాదాస్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్‌షీట్‌ను సమర్పించింది. -
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్‌ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది.తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన సంచలన రిపోర్ట్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు చెంపపెట్టులా మారింది. చంద్రబాబు, పవన్‌లు చేసింది తప్పుడు ప్రచారమేనని నిర్థారణ అయ్యింది. సీబీఐ రిపోర్ట్‌తో చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు, పవన్.. రాజకీయ దురుద్ధేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మతిరిగేలా సీబీఐ నివేదిక ఇచ్చింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్‌లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. -
కాసేపట్లో మరోసారి సీబీఐ ముందుకు విజయ్
-
కరూర్ తొక్కిసలాటకు బాధ్యులెవరు?..సీబీఐకి విజయ్ ఇచ్చిన సమాధానం ఇదే!
న్యూఢిల్లీ: ‘గతేడాది జరిగిన కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాటపై విజయ్ సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆరు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన సీబీఐ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లారు.విచారణలో కరూర్ తొక్కిసలాటపై విజయ్ సీబీఐ అధికారులకు ఏం చెప్పి ఉంటారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో విజయ్ కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీ బాధ్యత వహించబోదని సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన విజయ్‌ని.. తొక్కిసలాట ఘటనపై విచారణ అధికారులకు ఏం చెప్పారని మీడియా ప్రశ్నించింది. తొక్కిసలాట తీవ్రత తగ్గించేందుకు వేదికను విడిచివెళ్లానని తెలిపారు. ఇదే విషయాన్ని విజయ్ పలు పార్టీ బహిరంగ కార్యాక్రమాల్లో చెప్పుకొచ్చారు.ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి కాలేదని, విజయ్ స్టేట్మెంట్ను వెరిఫై చేసిన తర్వాత మళ్లీ పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు సమాచారం. ‘విజయ్ను విచారించడం పూర్తి కాలేదు. సంక్రాంతి పండుగ కారణంగా విచారణ ప్రస్తుతానికి వాయిదా వేశాం. పండుగ తర్వాత సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామం’అని సీబీఐ విచారణ అధికారులు జాతీయ మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు పోలీసులు మాత్రం కరూర్ తొక్కిసలాటకు విజయ్ కారణమని ఆరోపిస్తున్నారు. సభ నిర్వహించే సమయం కంటే ఆలస్యంగా వచ్చారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమయం గడిచే కొద్దీ అభిమానులు,పార్టీ కార్యకర్తలు విజయ్ను చూసేందుకు భారీ ఎత్తున గుమిగూడారు. ఊపిరాడడక జనసందోహాన్ని కట్టడి చేసే సమయంలో ఈ ఘోర జరిగినట్లు స్పష్టం చేస్తున్నారు. సభకు వచ్చిన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆహారం, మంచినీరు,టాయిలెట్ సౌకర్యం కల్పించడంలో టీవీకే విఫలమైందన్నారు. తొక్కిసలాటపై అధికార డీఎంకే పార్టీ కుట్రకు పాల్పడిందని విజయ్ ఆరోపించారు. డీఎంకే మాత్రం పోలీసుల వైఫల్యం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని విజయ్ ఆరోపణల్ని ఖండించింది. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ ప్రసంగించిన భారీ రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఇది ఇటీవలి తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. #WATCH | Delhi: TVK Chief and actor Vijay leaves from Central Bureau of Investigation (CBI) office where he appeared for a probe into the Karur stampede. pic.twitter.com/0G7zmLQl6Q— ANI (@ANI) January 12, 2026 -
సీబీఐ ఆఫీస్ లో హీరో విజయ్
-
విజయ్ ను సీబీఐ అడగబోయే ప్రశ్నలివే..!
-
చెక్కేస్తారు రెడీగా ఉండు.. RRRకు బిగ్ షాక్
-
బ్యాంకులకు రఘురామ టోకరా
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు చేసిన మోసాలపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మోసాలపై దర్యాప్తు చేయకుండా కృష్ణరాజు గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తొలగించి, దీనిపై ముందుకు వెళ్లడానికి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో మరోసారి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ చేసిన మోసాలు చర్చనీయాంశంగా మారాయి. మోసాల చిట్టా బారెడు.. » ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీ పేరుతో రఘురామ కృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు. » థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకున్న రుణాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకుల నెత్తిన చేయిపెట్టారు. » పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి. » తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు కాలిపోయిందని చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. » 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్‌్కలను స్వాధీనం చేసుకున్నాయి. సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురామతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశాయి.దివాళా ప్రక్రియ షురూ.. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాళా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్‌ని ఆశ్రయించాయి. ఇండ్ భారత్ థర్మల్ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంక్‌లకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నాయి. అయితే కంపెనీ తనఖా చేసిన ఆస్తుల విలువ కేవలం రూ. 872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి.. దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ దివాళా ప్రక్రియకు అనుమతించింది.ఫెమా నిబంధనల ఉల్లంఘన.. రంగంలోకి ఈడీ ఇండ్ – భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ. 202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ. 200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) దృష్టిలో పడింది. దాంతో విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన ఫెమా అధికారులు.. మారిషస్ కంపెనీ నుండి ఏపీకి చెందిన కంపెనీ ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. -
రఘురామకు సుప్రీంకోర్టులో భారీ షాక్
సాక్షి, అమరావతి: వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఆయన చైర్మన్, ఎండీగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినందుకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు విషయంలో ముందుకెళ్లొద్దంటూ 2022 సెపె్టంబర్ 30న తానిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అలాగే కేసులు నమోదు చేసే ముందు సీబీఐ తమకు నోటీసులు ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో నిందితులకు ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఇదీ జరిగింది.. రఘురామకృష్ణరాజు, ఆయన చైర్మన్, ఎండీగా ఉన్న ఇండ్ భారత్ పవర్, ఇండ్ భారత్ ఇన్ఫ్రాలతో సహా ఇతర అనుబంధ సంస్థలు పలు ఆర్థిక సంస్థల నుంచి దాదాపు రూ.947.71 కోట్ల రుణం తీసుకున్నాయి. అలాగే పలు జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి కూడా రూ.826.17 కోట్ల రుణాలు తీసుకున్నాయి. థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామంటూ బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను రఘురామరాజు కంపెనీలు దారి మళ్లించాయి. ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. విచిత్రమేమిటంటే.. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను మళ్లీ తనఖా పెట్టి, మరోసారి రుణాలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా దారి మళ్లించారు. మే 2012 నుంచి మే 2017 వరకు ఐదేళ్ల పాటు నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. రుణాల ఎగవేతపై, రఘురామకృష్ణరాజు మోసాలపై పలు ఆరి్థక సంస్థలు, బ్యాంకుల కన్సార్షియం 2019లో సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలపై ఫోర్జరీ పత్రాల సృష్టి, నిధులు స్వాహా చేయడం వంటి అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 120బీ (కుట్ర), 420 (మోసం), 467, 468, 471 (ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేసింది. దీనిపై రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. అటు తరువాత ఈ ఉత్తర్వులను 2021లో హైకోర్టు ఎత్తివేసింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు.. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ ఇండ్ భారత్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2022లో సుప్రీంకోర్టు ధర్మాసనం, రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ముందుకెళ్లొద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కాగా రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ.. తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసు ఇవ్వలేదని, తమ వాదన వినకుండానే కేసులు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదని, తమకు వాదన వినిపించే హక్కు కల్పించలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఫ్రాడ్ డిక్లరేషన్ వల్లే ఎఫ్ఐఆర్ వచ్చిందని, కాబట్టి రక్షణ కల్పించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసే దశలో అది వర్తించదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్‌పై గానీ, ఎఫ్ఐఆర్లోని అంశాలపై గానీ పిటిషనర్లకు అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించింది. మాజీ ఎమ్మెల్సీ కేసులోనూ..బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఆయన కంపెనీల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై నమోదు చేసిన కేసు విషయంలో ముందుకెళ్లేందుకు సీబీఐ, బ్యాంకులకు అనుమతిచ్చింది. నారాయణరెడ్డి , ఆయన కంపెనీలు సైతం పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.500 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేశారు. దీనిపై పలు బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. దీంతో సీబీఐ నారాయణరెడ్డి, ఆయన కంపెనీలపై కేసులు నమోదు చేసింది. -
అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన రూ.228.06 కోట్ల బ్యాంకింగ్ మోసం కేసులో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) క్రిమినల్ కేసు నమోదు చేసింది. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఈ కేసులో ఆర్హెచ్ఎఫ్ఎల్, దాని మాజీ సీఈవో, పూర్తికాల డైరెక్టర్ రవీంద్ర శరద్ సుధాల్కర్‌తో పాటు వివరాలు తెలియని కొందరు ప్రభుత్వోద్యోగుల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత దుష్ప్రవర్తన కారణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228.06 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జై అన్మోల్ అంబానీ, రవీంద్ర సుధాల్కర్ తదితరులు రుణాలు ఇవ్వడం, తిరిగి చెల్లించడంలో అవకతవకలకు పాల్పడి ఆర్థిక నష్టాన్ని కలిగించే చర్యలకు పాల్పడ్డారని సీబీఐకి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో స్పష్టం చేశారు. మోసం, పదవి దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కింద ఏజెన్సీ కేసు నమోదు చేసింది.మోసం జరిగిందిలా..యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అనూప్ వినాయక్ తరాలే దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆర్హెచ్ఎఫ్ఎల్ ఆర్థిక సహాయం కోరుతూ ముంబైలోని ఎస్సీఎఫ్ (SCF) శాఖను సంప్రదించింది. దాంతో 2015-2019 మధ్య యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ఎఫ్ఎల్కు రూ.450 కోట్ల టర్మ్ లోన్లను మంజూరు చేసింది. దీనితో పాటు కంపెనీ అందించే రూ.100 కోట్ల విలువైన ప్రైవేటుగా ఉంచిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు కూడా బ్యాంకు సబ్‌స్క్రైబ్ చేసింది. ఆర్థిక క్రమశిక్షణ, సకాలంలో తిరిగి చెల్లించడం, సెక్యూరిటీలు, ఫైనాన్షియల్స్‌ను సరిగ్గా బహిర్గతం చేయాల్సిన షరతులపై ఈ రుణాలు మంజూరు చేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా నమోదు చేయబడి, సెప్టెంబర్ 2017లో నేషనల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది.రుణ నిధులను జై అన్మోల్ అంబానీ, రవీంద్ర శరద్ సుధాల్కర్ సహా మాజీ డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాల్లోకి మళ్లించారని బ్యాంక్ ఆరోపించింది. 30 సెప్టెంబర్ 2019న డెట్ అకౌంట్ నిలిపేశారు. తదుపరి పరిశీలన తరువాత బ్యాంక్ 10 అక్టోబర్ 2024న ఖాతాను ‘ఫ్రాడ్’గా ప్రకటించింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించింది.ఆడిట్లో బట్టబయలుఏప్రిల్ 2016 నుంచి జూన్ 2019 వరకు గ్రాంట్ తోర్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో తీవ్ర ఒడిదొడుకులు బయటపడ్డాయి. రుణం తీసుకున్న నిధులు ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు ఆడిట్లో కనుగొన్నారు. కంపెనీ జనరల్ పర్పస్ కార్పొరేట్ రుణాల్లో దాదాపు 86 శాతం, అంటే రూ.12,573.06 కోట్లు పరోక్షంగా అనుసంధానించిన సంస్థలకు పంపిణీ చేసినట్లు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో సర్క్యులర్ లావాదేవీలను కూడా నివేదించారు.ఈ నేపథ్యంలో నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), 13(1)(డీ), సవరించిన పీసీ చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తును న్యూఢిల్లీలోని సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రోషన్ లాల్‌కు అప్పగించారు.ఇదీ చదవండి: అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు -
కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్ కు YS జగన్
-
నాగమణి, వామన్ రావు కేసు.. పుట్ట మధుకు సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో, ఆయన విచారణకు హాజరు కానున్నారు.వివరాల ప్రకారం.. హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసు విచారణలో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు రామగుండంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక, ఇప్పటికే మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావుతో పాటు, వారి కుటుంబీకులు, బంధువులు, పలువురిని సీబీఐ విచారించింది. కాగా, రామగుండం కమిషనరేట్ కేంద్రంగా గత నెల రోజుల నుంచీ ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరుగుతోంది. అయితే, పుట్ట మధు సీబీఐ విచారణతో ఈకేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. -
వ్యక్తిగత ప్రయోజనాలకు సీబీఐని వాడుకోలేరు
సాక్షి, హైదరాబాద్: స్వప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను వినియోగించుకోవాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ప్రయత్నిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. అంతకుముందు ప్రతివాదుల తరఫున న్యాయవాదులు సాయి వంశీకృష్ణ, ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ, ‘సునీత పరస్పర విరుద్ధ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఒకవైపు కేసు సత్వర విచారణకు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ, మరోవైపు మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు నచ్చినట్లు విచారణ చేయాలని కోరడం ఎంతమాత్రం చెల్లదు. ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే భవిష్యత్‌లో బాధితులమని చెప్పుకొనేవారంతా దర్యాప్తు సంస్థలను సొంత లబ్ధికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. సునీత చర్యలన్నీ అర్థం లేకుండా ఉన్నాయి. సత్వర విచారణ కోరుతున్నారా? లేదా విచారణ ఇంకా జాప్యం కావాలని కోరుకుంటున్నారా? అనే అంశంపై స్పష్టత లేకుండా ఆమె న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇష్టమొచ్చినట్లు వేస్తున్న పిటిషన్లతో కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాదు.. విచారణ ఏళ్లకు ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో రోజూ విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే, ఈ కోర్టు మళ్లీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా నిష్ప్రయోజనం అవుతుంది. న్యాయస్థానంలో కేసు విచారణ ఆలస్యం చేయడానికే సునీత ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని నివేదించారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు ఏమిటి?‘సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ దిగువ కోర్టును నిర్ణయం తీసుకోమని చెప్పింది. అయితే, వాస్తవ పరిధి ఉన్న కడప కోర్టును ఆదేశించిందా? లేక హైదరాబాద్‌లోని ఈ కోర్టును ఆదేశించిందా? అనేది సందేహాస్పదంగా మారింది. ‘అధికార పరిధి’ తేలిస్తే ఈ పిటిషన్ మెయింటెనబుల్ అవుతుందో? లేదో? తెలుస్తుంది. సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్లలో ప్రతివాదులుగా సీబీఐని తప్ప నిందితులను చేర్చలేదు. దీంతో వారి వాదనలు వినిపించే అవకాశం లేకుండా పోయింది. సుప్రీం కోర్టు మరింత దర్యాప్తునకు ఆదేశించలేదు. దిగువ కోర్టును ఆశ్రయించాలని మాత్రమే ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో వేసిన పలు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం వద్ద ప్రస్తావించలేదు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదంటూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత మళ్లీ దర్యాప్తు చేయాలని కోరడం చట్టవిరుద్ధం. ఏ కేసులోనైనా చార్జెస్ ఫ్రేమ్ చేశాక దర్యాప్తు కొనసాగించడం సాధ్యం కాదు. ఫలాన ఫలాన అంశాలపై దర్యాప్తు చేయాలని సునీత కోరలేరు. ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఆమె చెబుతుండడం సరికాదు. సీబీఐ తనకు నచ్చినట్లు, తను చెప్పినట్లు దర్యాప్తు చేయాలని ఆమె పట్టుబట్టడం చెల్లదు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టులో వెల్లడించిన సీబీఐ, మళ్లీ విచారణ ఎలా ప్రారంభిస్తుంది’’ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది. -
నకిలీ మద్యం కేసు దర్యాప్తు... ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ... న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోగి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికిముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్‌ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, , ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
సుప్రీం పేరుతో డిజిటల్ స్కాం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం పేరుతో ఉత్తుత్తి ఉత్తర్వులు చూపించి వృద్ధ దంపతుల నుంచి రూ.కోటికి పైగా డబ్బు కాజేసిన ఘటనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా న్యాయస్థానాల పేర్లతో జరిగే డిజిటల్ నేరాలతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతామని పేర్కొంది. వ్యవస్థ గౌరవం దెబ్బతింటుందని తెలిపింది. ఇవి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. డిజిటల్ స్కాంలపై తక్షణ ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జాయ్మాల్య భాగ్చీల ధర్మాసనం నోటీసులు పంపింది. తమను డిజిటల్ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను బాధిత పిటిషనర్లు చూపించారు. కేటుగాళ్లు సెప్టెంబర్ 3 నుంచి 16వ తేదీ మధ్యలో సీబీఐ, ఈడీ అధికారులుగా, జడ్జీలుగా నటిస్తూ ఆడియో, వీడియో కాల్స్ ద్వారా కోర్టు నకిలీ ఉత్తర్వులను చూపించి, అరెస్టు, నిఘా అంటూ బెదిరించారని బాధితులు కొన్ని పత్రాలను చూపారు. వీటితో పలు దఫాలుగా రూ.1.05 కోట్లు కాజేశారన్నారు. హరియాణాలోని అంబాలాకు చెందిన వృద్ధ దంపతులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌కి ఈ మోసంపై సెప్టెంబర్ 21న లేఖ రాశారు. వృద్ధ దంపతులకు జరిగిన అన్యాయంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధితుల ఫిర్యాదుపై సుమోటోగా విచారణ చేపట్టింది. విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమిది..న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల పేరిట సృష్టించిన ఫోర్జరీ పత్రాలతో న్యాయస్థానంపై ప్రజలకు గల విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీల సంతకాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి సంతకాలు, కోర్టు స్టాంప్ కూడా వేయడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ‘జడ్జీ్జల సంతకాలతో సృష్టించిన ఫోర్జరీ పత్రాలు న్యాయస్థానంపై ప్రజల విశ్వాసంతోపాటు, వ్యవస్థ మూలాలు దెబ్బ తింటాయి. ఇటువంటి క్రిమినల్ చర్యలను సాధారణ మోసం, సైబర్ క్రైమ్‌గా పరిగణించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్‌లో న్యాయస్థానాల పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలను ఉపేక్షించరాదని పేర్కొంది. త్వరగా ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈవ్యవహారంలో తాము భారత అటార్నీ జనరల్ సహాయం కోరుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇది ఈ వృద్ధ దంపతుల సమస్య మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజానీకం సమస్య అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పోలీసులను దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పి వదిలేయడానికి వీలు లేదని పేర్కొంది. కేవలం ఇదొక్క కేసు మాత్రమే కాదు. ఇటువంటి నేరాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా జరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటువంటి విస్తృత ప్రభావం కలిగిన నేరపూరిత చర్యలను పూర్తిగా దర్యాప్తు జరిపి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంగా కృషి చేయాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో సాయం అందించాలని అటార్నీ జనరల్‌ను కోరిన ధర్మాసనం, వృద్ధ దంపతుల కేసు దర్యాప్తు పురోగతిని తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వం, అంబాలా సైబర్ క్రైమ్ విభాగాలను ఆదేశించింది. -
అవినీతి తిమింగళం.. డీఐజీ ఇంట్లో నోట్ల కట్టలు, కిలోన్నర బంగారం..
చండీగఢ్: పంజాబ్‌లో అవినీతి తిమింగలం బయటపడింది. పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)(DIG Harcharan Bhullar) ఆఫ్ పోలీస్ హర్చరణ్ భుల్లార్‌ను లంచం ఆరోపణలపై సీబీఐ(CBI) అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎనిమిది లక్షల రూపాయల లంచం కేసులో సీబీఐ.. భుల్లార్‌కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా విస్తుపోయే దృశ్యాలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ బట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్ డిమాండ్ చేశారు. ఇందుకుగాను కిషన్ అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. ఈ మేరకు వ్యాపారి ఆకాశ్ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. గురువారం చండీగఢ్‌లో ఆకాశ్ నుంచి డీఐజీ తరఫున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్‌ను పట్టుకున్నామని సీబీఐ తెలిపింది. Images from DIG Ropar (Punjab) Harcharan Singh Bhullar's residence.CBI raid unearthed ₹5Cr cash, Merc, Audi, 22 Expensive watches, 1.5kg gold..He was part of anti-drug campaign as well.Routine news of highly corrupt clans of India — IAS and IPS officers. pic.twitter.com/P8HEo0o1Jh— The Hawk Eye (@thehawkeyex) October 17, 2025ఈ సందర్భంగా డీఐజీ, మధ్యవర్తి కిషను, వ్యాపారి ఆకాశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా డీఐజీని అరెస్ట్ చేశామని పేర్కొంది డీఐజీ కార్యాలయం, నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, కిలోన్నర బరువున్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు, మెర్సిడెజ్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించింది. ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోపర్ రేంజ్ DIGగా భుల్లార్ విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.Recovery from DIG Harcharan Bhullar Ropar of #PunjabPolice from his house by @cbic_india today.What a corruption it would be very small amount of items? 😂😂😂😂 pic.twitter.com/jRd3tHUOlI— Thomas 🇮🇳🇷🇺🇮🇱🕊️✌️ (@Thomas11P) October 16, 2025 -
గట్టు వామన్ రావు దంపతుల కేసులో సీబీఐ దూకుడు
సాక్షి,హైదరాబాద్: అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు జంట హత్యల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ వామన్ రావు అనుచరులు బొల్లంపల్లి సంతోష్, ఇనుముల సతీష్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. వామన్ రావుతో సాన్నిహిత్యం, ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో పలు రకాల అంశాలపై ఆరా తీశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ రెండో ఫ్లోర్లో విచారణ చేపట్టిన అధికారులు.. విచారణ కోసం ముందస్తు నోటీసులు అందించారు. గత 20 రోజుల నుంచి కొనసాగుతున్న సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇక తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు మొత్తం 130మందిని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్‌రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్‌లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు అదే ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది.చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది. ఈ క్రమంలో వామన్‌రావు దంపతుల కేసు దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు వామన్ రావు కేసును విచారిస్తున్నారు. -
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
-
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమన్న వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2025ఇదీ చదవండి: చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! -
తిరుమల లడ్డూ కేసు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తిరుమల లడ్డు కేసులో సిట్ పనిచేయడం ఆపేసిందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు. ‘‘సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా?. చిన్నప్పన్నను ఇంటరాగేషన్‌లో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా’’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.చిన్నప్పన్నకు సిట్‌లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం.. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సవీంద్ర అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. పోలీసులు.. కోర్టును తప్పుదోవ పట్టించారని సవీంద్ర తరపు లాయర్ తన వాదనలు వినిపించారు. ‘‘ రాత్రి 7:30 గంటలకు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. 6:30కు అరెస్ట్ చేశారని నిందితుడు చెబుతున్నాడు...కన్ఫెషన్ రిపోర్టులో రాత్రి 7.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 8.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. లాలాపేట ఎస్‌హెచ్‌వో శివప్రసాద్ అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా ఉంది. రాత్రి 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి పీఎస్‌కు వచ్చినట్లు సీసీటీవీలో ఉంది. సవీంద్ర ఫోన్ సాయంత్రం 6:21కి స్విచాఫ్ చేసినట్లు స్పష్టంగా ఉంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ సుమోటోగా తీసుకుని విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ కోరారు.‘‘సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు ఎలా పెట్టారు?. సుప్రీంకోర్టు తీర్పులున్న యూనిఫాం లేకుండా ఎలా పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు? ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టా లేదా తెలియాలంటే సీబిఐతో విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. సీబీఐ అక్టోబర్ 13వ తేదీ కల్లా కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, బుధవారం( సెప్టెంబర్ 24) ఈ కేసును విచారిస్తూ.. పోలీసులు యూనిఫామ్‌లో కాకుండా.. సివిల్ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది.తన భర్త సవీంద్రరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెబుతారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది. -
సోనమ్ వాంగ్చుక్పై సీబీఐ ఉచ్చు.. విదేశీ నిధుల సేకరణ, పాకిస్తాన్ పర్యటనపై దర్యాప్తు
లేహ్: లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ఒక గ్రూపును విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోనమ్ వాంగ్‌చుక్ స్థాపించిన ఒక సంస్థపై నిఘా సారించింది. ఈ సంస్థ విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని ఉల్లంఘించిందనే అనుమానం వ్యక్తం చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు సంస్థ రెండు నెలల క్రితం హిమాలయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్ఐఏఎల్) సేకరించిన నిధులపై విచారణను ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటనపై కూడా సమీక్షిస్తున్నదని సమాచారం.వాంగ్‌చుక్ నిరాహార దీక్ష అనంతరం..కాగా లడఖ్ జిల్లాలో కర్ఫ్యూ పరిస్థితుల్లో భద్రతా దళాలు, లడఖ్ ఉద్యమ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు మృతిచెందారు. 40 మంది పోలీసు సిబ్బందితో సహా 80 మంది గాయపడ్డారు. వాంగ్‌చుక్ తన పక్షం రోజుల నిరాహార దీక్షను ఉపసంహరించుకున్న తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించిన తర్వాత లేహ్ అపెక్స్ బాడీ యువజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది.రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే..దీంతో కొందరు యువకులు యువకులు గ్రూపులుగా బయలుదేరి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, హిల్ కౌన్సిల్‌ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకాండకు పాల్పడ్డారు. లడఖ్ పట్టణం అంతటా మోహరించిన పోలీసులు, పారామిలిటరీ దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే హింస చెలరేగిందని కేంద్రం ఆరోపించింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఉద్దేశపూర్వక కాల్పులంటూ ఆరోపణలుసీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
చార్జిషీట్లు వేసిన తర్వాత మళ్లీ దర్యాప్తు ఏంటి?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలన్న వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చార్జిషీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోరడం ఏమిటంటూ ఆమెను ప్రశ్నించింది. ఒకదానివెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేదెప్పుడని ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తయ్యాకే కదా చార్జిషీట్లు వేసిందని ప్రశ్నించింది.మీరు ఇపుడు చేస్తున్న వాదనలను విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని నిలదీసింది. ఇదే సమయంలో వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులకిచి్చన బెయిల్‌ను రద్దు చేసే విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రద్దు, తదుపరి దర్యాప్తు కోసం సునీత పిటిషన్లు... వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులకు హైకోర్టు ఇచి్చన ముందస్తు బెయిల్, బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీతరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ కూడా ఆమె పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయాన్ని సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. తదుపరి దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దానిని కోర్టు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి. రాజు స్పందిస్తూ, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని తెలిపారు. కోర్టు ఆదేశిస్తేనే తప్ప తదుపరి దర్యాప్తు చేయపట్టబోమన్నారు. 13 లక్షల డాక్యుమెంట్లను కోర్టు ముందుంచింది... వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరుల తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, నాగముత్తు వాదనలు వినిపించారు. సీబీఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిందని తెలిపారు. భారీ స్థాయిలో చార్జిషీట్లు కూడా దాఖలు చేసిందన్నారు. 13 లక్షల పేజీల డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచిందని తెలిపారు. ఇప్పుడు తదుపరి దర్యాప్తు అంటే కింది కోర్టు విచారణ ముందుకెళ్లే అవకాశం ఉండదన్నారు. ఇలా అయితే దశాబ్ద కాలం పడుతుంది... ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా, ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, చార్జిషీట్లు దాఖలైన తరువాత ఈ కేసును తాము పర్యవేక్షించడం ఏమిటంటూ ప్రశ్నించింది. ఇలా ఒక దాని వెంట మరొక పిటిషన్ దాఖలు చేసుకుంటూ వెళుతుంటే అసలు ట్రయల్ పూర్తి కావడానికే దశాబ్ద›కాలం పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు మీరు చెబుతున్న వాదనను దర్యాప్తు సమయంలోనే సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. నిందితులపై ఇప్పటికే సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసిందని గుర్తు చేసింది. ఇంతకన్నా చేసేది ఏముంటుందని ప్రశ్నించింది. ‘దర్యాప్తు పూర్తి చేసిన తరువాతనే కదా చార్జిషీట్లు వేసేది. మరి అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరడం ద్వారా మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు’ అంటూ సునీతను ప్రశ్నించింది. తదుపరి దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేసి దానిని ఓ తార్కిక ముగింపునివ్వాలంది. తదుపరి దర్యాప్తు విషయాన్ని సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. అలాగే నిందితుల బెయిల్ రద్దు విషయంలో కూడా జోక్యం చేసుకునేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను డిస్ట్రర్బ్ చేయబోమంది. తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ కోర్టునే ఆశ్రయించాలని సునీతను ధర్మాసనం ఆదేశించింది. రెండువారాల్లోగా తాజా పిటిషన్ దాఖరు చేసుకోవచ్చని, ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే దానిని 8 వారాల్లోపు తేల్చాలని సీబీఐ కోర్టుకు తేల్చిచెప్పింది. సీబీఐ తనంతట తానుగా కాకుండా సీబీఐ కోర్టు ఆదేశాలు ఇస్తేనే తదుపరి దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. -
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, శ్రీశైలం దర్శనం కోసం వెళ్లి అనంతరం తిరిగి వస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
సీబీఐ చేతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: సీబీఐ చేతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనపై ప్రాధాన్యత నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఈ నెల 1న సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ క్రమంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ రావడం చర్చాంశనీయంగా మారింది. -
ఆ నివేదిక ఆధారంగా చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదిక ఆధారంగా పిటిషనర్ల (కేసీఆర్, హరీశ్‌రావు)పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఘోష్ నివేదికను సీబీఐకి రిఫర్ చేయవద్దని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), ఇతర నివేదికలపై సీబీఐ ఆధారపడవచ్చని తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లపై ప్రభుత్వ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనను ధర్మాసనం నమోదు చేసుకుంది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఐఏలు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. సీబీఐకి ఇవ్వాలన్నది సర్కార్ నిర్ణయమే.. ప్రభుత్వం తరఫున ఏజీ, సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉండదు. నివేదికపై చర్యల్లో భాగంగా సీబీఐ దర్యాప్తు కోరలేదు. ఎన్డీఎస్ఏ నివేదికపై సీబీఐ విచారణ చేస్తుంది. జస్టిస్ ఘోష్ నివేదిక అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టాం.. చర్చ కూడా జరిగింది. దీని ఆధారంగా పిటిషనర్లపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీబీఐకి ఇవ్వాలని కూడా కమిషన్ నివేదికలో లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోవడం లేదు. పిటిషనర్లు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. సీబీఐ విచారణ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే సాగుతుంది.. పిటిషనర్లపై కాదు. మేడిగడ్డ బరాజ్ ఐదు పిల్లర్లు కూలిపోవడానికి ఎవరు బాధ్యులో తేలుస్తుంది. కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయనే భయంతో వేసిన ఐఏలు విచారణార్హం కాదు. కొట్టివేయండి..’అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తునకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కాపీని ధర్మాసనానికి అందజేశారు. నోటిఫికేషన్లో ఎందుకు పేర్కొనలేదు... కేసీఆర్, హరీశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు దామ శేషాద్రినాయుడు, ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ‘కమిషన్ నివేదికలో ఎవరు తప్పు చేశారో ఉందని, ఎవరినీ వదిలిపెట్టబోమని ప్రభుత్వం చెప్పిందని, అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి చెప్పారని ఏజీ సోమవారం చెప్పారు. ఇప్పుడేమో నివేదికపై చర్యలు ఉండవని చెబుతున్నారు. నివేదికతో పని లేనప్పుడు సీబీఐ దర్యాప్తు కోరిన నోటిఫికేషన్లో అలా ఎందుకు పేర్కొనలేదు? ప్రభుత్వం ఇచ్చిన హామీని రికార్డుల్లో నమోదు చేయాలి. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి..’అని కోరారు. సీజే జోక్యం చేసుకుని.. ‘కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టారా? చర్యలు తీసుకుంటారా?’అని ఏజీని ప్రశ్నించింది. అసెంబ్లీలో పెట్టి చర్చించారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏజీ బదులిచ్చారు. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోమని చెబుతూనే అందులోకి విషయాలను ప్రస్తావిస్తూ సీబీఐ దర్యాప్తు కోరారని శేషాద్రినాయుడు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ హామీని నమోదు చేసుకుంది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సర్కార్‌ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ ఘోష్ నివేదిక రద్దు చేయండి: మాజీ సీఎస్ జోషి జస్టిస్ ఘోష్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి (రిటైర్డ్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కమిషన్ సాక్షిగా మాత్రమే సమన్లు జారీ చేసిందని.. చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. -
కేంద్రం అంగీకరిస్తేనే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఈ నెల 1న సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర హోంశాఖకు పంపారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలియజేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 51 (రాష్ట్ర ప్రభు త్వ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా నిరోధిస్తూ ఇచ్చిన జీఓ)ను ఈ కేసులో సడలిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు దర్యాప్తు ప్రారంభించాలంటే కేంద్ర హోంశాఖ అంగీకరించి, అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సీబీఐ అధికారులు కేసు ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. ప్రాథమిక వివరాల ఆధారంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో దర్యాప్తు మొదలు పెడతారని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే..! సీబీఐకి అనుమతినిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ పనుల్లో అవినీతి, అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ బ్లాక్–7 లోని 16, 17, 18, 19, 20, 21 పియర్లు కుంగినట్టు గుర్తించామని తెలిపింది. ఇందుకు కారణాలు, చోటు చేసుకున్న లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) 2025 ఏప్రిల్ 24న తుది నివేదిక ఇచ్చిందని పేర్కొంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా ప్రాజెక్టుకు సంబంధించి పలువురిని విచారించి ఈ ఏడాది జూలై 31న నివేదిక ఇచ్చిందని వివరించింది. పలు లోపాటు, అక్రమాలు కమిషన్ గుర్తించినట్లు తెలిపింది. ఈ మొత్తం అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సీబీఐతో దర్యాప్తు జరపాలని శాసనసభ నిర్ణయించినట్లు వివరించింది. కేంద్ర నుంచి అనుమతి రాగానే సీబీఐ రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో..దాని ఆధారంగానే ముందుకువెళ్లే అవకాశం ఉంది. -
కాళేశ్వరం విచారణ CBIకి అప్పగించడంపై స్పందించిన ఈటల
-
‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్‌పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్‌ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన. -
తెలంగాణకు మళ్లీ సీబీఐ.. ప్రభుత్వ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు నిర్ణయించింది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రత్యేక ప్రొసీజర్‌ను తీసుకువచ్చారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకపై ఉన్న నిషేధ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా, 2022లో సీబీఐ రాకపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. -
మణిరత్నం సోదరుడి కేసు.. మరణించిన 22ఏళ్లకు తీర్పు
మణిరత్నం(Mani Ratnam) సోదరుడు, తమిళ సినీ నిర్మాత జి. వెంకటేశ్వరన్ తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంక్ లోన్ తీసుకున్నారంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా చెన్నై ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెళ్లడించింది. అయితే, ఆయన మరణించిన 22ఏళ్ల తర్వాత తీర్పు రావడం విశేషం. మౌనరాగం నుంచి దళపతి వరకు మణిరత్నం దర్శకత్వం వహించిన పలు హిట్ సినిమాలకు జీవీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.1996లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు తమిళ చిత్ర నిర్మాత జి. వెంకటేశ్వరన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి రూ. 10.19 కోట్లు బ్యాంకు నుంచి పొందినట్లు అప్పట్లో కేసు నమోదైంది. సుమారు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించింది. అయితే, వెంకటేశ్వరన్‌తో పాటు మరో ముగ్గురు బ్యాంకు అధికారులు మరణించడంతో వారిపై ఉన్న అభియోగాలు ఇప్పటికే కొట్టివేయబడ్డాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన ఐదుగురి పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది.అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్ మే 3, 2003న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుల ఒత్తిడితో ఆయన మరణించారని సమాచారం. వివిధ నిర్మాతల నుంచి అప్పులు తీసుకుని సినిమాలు నిర్మించిన జీవీ, వాటి నుంచి వచ్చిన నష్టాలను తట్టుకోలేకపోయారని కొందరు చెప్పుకొచ్చారు. ఆయనకు సినీ రంగంలో మంచి సంబంధాలు ఉన్నా.., ఆ సమయంలో ఎవరూ సహాయం చేయలేదని తమిళ నిర్మాత మాణిక్కం నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.కొడుకు పెళ్లి సమయంలో కూడా జీవీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చివరికి ఉరివేసుకుని తన జీవితాన్ని ముగించుకున్నారని తెలుస్తోంది. -
గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను ఈడీ అధికారులు అనూహ్యరీతిలో అరెస్ట్‌చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంట్లో, తనకు సంబంధించిన స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి, తర్వాత ఎత్తయిన గోడ ఎక్కి బయటకు ఎలాగోలా దూకి పారిపోయారు. రెప్పపాటులో ఈ విషయం కనిపెట్టిన ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ఆయన వెంటబడిమరీ సమీప పొలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలోపే ఎమ్మెల్యే తన స్మార్ట్ఫోన్లను సమీపంలోని బురదకుంటలో పడేశారు. అయినాసరే పోలీసులు వాటిని వెలికితీసి స్వాధీనంచేసుకున్నారు. మొబైల్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. బురదకొట్టుకుపోయిన ఎమ్మెల్యేను పొలం గట్టు వెంట పోలీసులు అరెస్ట్‌చేసి తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముర్షీదాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ నాటకీయ పరిణామం జరిగింది. అరెస్ట్ తర్వాత సాహాను ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్ట ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆగస్ట్ 30వ తేదీదాకా ఈడీ రిమాండ్‌కు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యే సాహా సంబంధ స్థలాలతోపాట రఘునాథ్‌గంజ్‌లోని సాహా కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల నివాసాల్లోనూ ఈడీ సోదాలుచేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది. ఇదే టీచర్లు, స్టాఫ్ నియామక కేసులో 2023 ఏప్రిల్‌లో సాహాను సీబీఐ అధికారులు అరెస్ట్‌చేశారు. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇదే కేసు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించగా ఏమాత్రం సహకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అరెస్ట్చేయాల్సి వచ్చిందని న్యాయస్థానంలో హాజరుపర్చిన సందర్భంగా ఈడీ వాదించింది. పశ్చిమబెంగాల్లో ప్రైమరీ టీచర్లతోపాటు 9, 10వ తరగతులు బోధించే అసిస్టెంట్ టీచర్లు, గ్రూప్–సి, డి సిబ్బంది నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని సీబీఐ తొలుత కేసు నమోదుచేసింది. ఇందులోని వివరాలతో తర్వాత ఈడీ ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తును మనీలాండరింగ్ కోణంలో విస్తృతస్థాయిలో దర్యాప్తుచేసింది. ఈ కుంభకోణంలో కీలకసూత్రధారిగా భావిస్తున్న నాటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్‌చేశాయి. #Breaking: #TMC MLA from Burwan, Murshidabad district, Jiban Krishna Saha arrested by ED in connection with SSC scam. Sources in ED say, Jiban Krishna Saha tried to jump the boundary wall of the house & flee when ED officials reached his residence this morning. This apart, he… pic.twitter.com/ff5MBD21Yq— Pooja Mehta (@pooja_news) August 25, 2025 -
మొన్న ఈడీ.. నేడు సీబీఐ: చిక్కుల్లో అనిల్ అంబానీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించిన.. బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM), దాని ప్రమోటర్ డైరెక్టర్ 'అనిల్ అంబానీ'కి సంబంధించిన స్థలాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. ముంబైలోని ఆర్‌కామ్‌తో సహా ఆయనకు సంబంధం ఉన్న ఆరు ప్రదేశాలలో ఈ సోదాలు జరిగాయి.బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి?.. రుణాలు మళ్లించబడ్డాయో, లేదో నిర్ధారించడానికి కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించడం కోసం సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎస్బీఐకి రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించినందుకు ఆర్కామ్పై కూడా ఏజెన్సీ కేసు నమోదు చేసింది.అనీల్ అంబానీ, ఆర్‌కామ్ మోసానికి పాల్పడినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 13న ప్రకటించింది. జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు ఒక నివేదికను పంపింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒక బ్యాంకు ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించిన తరువాత.. ఆ విషయాన్ని రుణదాత 21 రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాలి.ఆర్‌కామ్‌లో ఎస్బీఐ క్రెడిట్ ఎక్స్పోజర్లో ఆగస్టు 26, 2016 నుంచి అమలులోకి వచ్చే వడ్డీ, ఖర్చులతో పాటు రూ. 786.52 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారెంటీతో పాటు.. రూ. 2,227.64 కోట్ల ఫండ్ బేస్డ్ ప్రిన్సిపల్ బకాయిలు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత నెలలో లోక్‌సభకు తెలిపారు. కాగా ఇప్పటికే అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించింది.ఇదీ చదవండి: ఎవరూ తప్పించుకోలేరు.. ఏకంగా 8 కోట్ల ట్రాఫిక్ చలాన్లు! -
సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే హైవే పక్కన రెస్టారెంట్ నిర్వహిస్తున్నందుకు యజమాని నుంచి దుర్గాప్రసాద్ రూ.లక్ష వరకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం,హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో దుర్గా ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. -
ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తున్నారు
పాట్నా: ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ప్రయోగాలు పనిచేయడం లేదని తేలాక బీజేపీ ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టడానికే ఈసీ ఈ ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం ఇలాగే ద్రోహం చేయాలని నిర్ణయించుకుంటే తాము ఎన్నికలను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని మరోమారు స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ఈసీ నిస్సంకోచంగా ప్రయత్నిస్తోంది. ప్రత్యర్థులను బెదిరించడానికి సీబీఐ, ఈడీ, ఆదాయపు ప్ను శాఖ వంటి ఏజెన్సీలన్నింటిని ప్రయోగించిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన ఈసీని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ఈ ఆటలో భాగంగా ఈసీ చాలామంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులను అందిస్తోంది. గతేడాది నేను విజయ్ కుమార్ సిన్హా కేసును బయటపెట్టాను. ఈ రోజు ముజఫర్‌పూర్ మేయర్ నిర్మలా దేవీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు’ అని తేజస్వి అన్నారు. ఇంత వివాదం నడస్తున్నా ఈసీ ఎప్పుడూ మీడియా ముందుకు రాకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, బీహార్ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడరు, చివరకు ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా వారినే అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందని తేజస్వి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందన్నారు. ఆగస్టు 17న రోహ్తాస్ జిల్లాలో ప్రారంభమయ్యే ఓటర్ల హక్కు యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిఖూభాయ్ దల్సానియా బీహార్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంపై తేజస్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
సీబీఐకి ‘గట్టు’ దంపతుల హత్యకేసు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచి్చంది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్‌రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్‌లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు అదే ఏడాది సెపె్టంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది. చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది.వామన్‌రావు కేసులో దోషులను శిక్షించాలి: మంత్రి శ్రీధర్‌బాబు సాక్షి, హైదరాబాద్: గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే వామన్‌రావు కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. -
సీబీఐ చేతికి గట్టు వామనరావు దంపతుల కేసు
సాక్షి, న్యూఢిల్లీ: గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది.హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17వ తేదీన రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె. సింగ్‌ల ధర్మాసనం పిటిషన్‌ను విచారించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ అవసరమా? అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.ఈలోపు.. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో.. సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు ఏంటి?
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో అక్రమాల వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించడమేంటంటూ ప్రశ్నించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రచారం, స్వప్రయోజనాల కోసం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారా? అన్న కోణంలో కూడా విచారణ జరపాల్సి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగా దర్యాప్తు చేయడం లేదని ఎలా చెబుతారని.. అందుకు ఏం ఆధారాలున్నాయని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసిన విధానం ఎంత మాత్రం సరిగా లేదంది. అసలు ఈ వ్యాజ్యంపై ఎందుకు విచారణ జరపాలో కూడా చెప్పాలంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ తదితరులపై కేసుకు పిల్ గత ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలు జరిగాయని, ఇందుకు సంబంధించి అప్పటి సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు వారి దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రముఖ విశ్రాంత న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సిట్ వేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ తదితరులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు సామర్థ్యం లేదు ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ మెహక్ మహేశ్వరి వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో పలు శ్వేత పత్రాలు విడుదల చేసిందన్నారు. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలు జరిగినట్లు అందులో పేర్కొన్నారని తెలిపారు. అందువల్ల సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఏ విషయంపై దర్యాప్తు జరగడం లేదని మీరు భావిస్తున్నారని మెహక్ మహేశ్వరిని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, అయితే అందులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు లేరన్నారు. కేసు దర్యాప్తు చేసేంత సామర్థ్యం రాష్ట్ర దర్యాప్తు సంస్థలకులేదన్నారు. మరో సిట్ ఎందుకు?ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులతో మరో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. శ్వేత పత్రాల ఆధారంగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేమంది. ప్రచారం, స్వీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసే పిల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ వ్యాజ్యం కూడా అదే కోవలోకి వస్తుందా? లేదా? అన్న దాన్ని తాము పరిశీలించాల్సి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సిట్ మెతక వైఖరిని అవలంభిస్తోందని, మాజీ సీఎం పట్ల ఉదారంగా వ్యవహరిస్తోందని మీరు అనుకుంటున్నారా? అంటూ మెహక్ మహేశ్వరిని ప్రశ్నించింది.ఏమీ తెలియనప్పుడు మీరెలా దర్యాప్తు కోరతారు? ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, మీరు బిజీ న్యాయవాది అయి ఉండీ, ఇలా పిల్ దాఖలు చేయడం, ఢిల్లీ నుంచి వచ్చి స్వయంగా వాదనలు వినిపించడం, మీ సొంత డబ్బును ఇందుకోసం వెచ్చించడం చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతోందని వ్యాఖ్యానించింది. మెహక్ స్పందిస్తూ, నిజంగా అవినీతి జరిగిందా? లేక రాజకీయ ప్రేరణతో సిట్ ఏర్పాటు అయిందా? అన్న విషయం తనకు తెలియదన్నారు. ఏమీ తెలియనప్పుడు మీరెలా దర్యాప్తు కోరతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏడాదిగా మద్యం కేసులో మాత్రమే దర్యాప్తు చేస్తున్నారని మహేశ్వరి తెలిపారు. నిందితుల జాబితాలో అప్పటి సీఎం జగన్‌ని చేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సి.ప్రణతి స్పందిస్తూ, ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 11కి వాయిదా వేసింది. -
వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది. పిటిషనర్ తరఫున వాదనలేంటని ధర్మాసనం ప్రశ్నించగా.. సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది మరో కోర్టులో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నందున పాస్ ఓవర్ ఇవ్వాలని మరో న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం తర్వాత బెంచ్ కూర్చోవడం లేదు కాబట్టి మరో రోజు వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. -
విశాఖలో లులుకు భూ కేటాయింపులపై రిటైర్డ్ ఐఏఎస్ శర్మ అభ్యంతరం
-
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
బిగ్ బుల్ హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు.. మార్కెట్ గురించి ఎలాంటి పరిజ్ఞానం లేనివారికి కూడా పరిచయం అక్కర్లేని పేరు. స్టాక్ బ్రోకర్‌గా కెరియర్ను ప్రారంభించి.. బ్యాంకుల్లో ఉన్న లొసుగులతో బ్యాంక్ రిసిప్ట్స్ (BRs) ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా దుర్వినియోగంతో భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసిన ఉదంతం. 1992లో జరిగిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మూడు దశాబ్దాల తర్వాత, పౌంజీ స్కాం రూపంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. రూ.49వేల కోట్ల స్కాంతో హర్షద్ మెహతా స్కాం తరువాత దేశంలో అత్యంత ఆర్థిక నేరాల్లో ఒకటిగా నిలిచింది. ఏంటి ఈ స్కామ్? ఎవరు చేశారు?నిర్మల్ సింగ్ భాంగూ. పంజాబ్‌లోని బర్నాలా నివాసి. 1970లలో ఓ వైపు ఇంటింటికి తిరిగి పాలమ్ముతూ పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగం కోసం కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ పెర్ల్స్‌లో చేరాడు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ సంస్థ ఈ సంస్థ పెట్టుబడిదారులను మోసం చేసింది. దివాళా తీయడంతో భాంగూ ఉద్యోగం కూడా పోయింది.అప్పుడే తనకున్న అనుభవంతో 1996లో నిర్మల్ సింగ్ భంగూ.. గుర్వాంత్ ఆగ్రో టెక్ లిమిటెడ్‌తో సంస్థను ప్రారంభించారు. అలా 30ఏళ్లుగా అంటే 1996లో గుర్వాంత్ ఆగ్రో టెక్ నుంచి పెర్ల్స్ అగ్రో టెక్ మారిన ఈ సంస్థ దాదాపు రూ.49,000 కోట్ల పౌంజీ కుంబకోణానికి తెరతీసింది. దేశం మొత్తం మీద 5 కోట్ల మంది అమాయకులను మోసం చేసి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసింది. చివరికి ఆసంస్థ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆ సంస్థ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని అరెస్ట చేసింది. తాజాగా ఆ సంస్థ డైరెక్టర్ గుర్నాసింగ్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో పెట్టుబడిదారులు గతంలో పోలీస్ కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత ఈ విషయం CBIకి చేరింది. ఈ కేసులో పేరున్న 10 మంది నిందితుల్లో నలుగురిని CBI ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపింది. గుర్నామ్ సింగ్ అరెస్టు తర్వాత పెట్టుబడిదారులు తమ డబ్బు తిరిగొస్తుందని ఆశతో ఉన్నారు. EOW సహా ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ ఫ్రాడ్ నెట్వర్క్ మూలాలను లోతుగా విచారిస్తున్నాయి. -
నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేలింది. వరంగలకు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాల తీసుకున్నట్లు సమాచారం.ఈ స్కాంలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసులు నమోదు చేశారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేసినట్లు తేలింది. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్‌లను మధ్యవర్తులుగా సీబిఐ గుర్తించింది. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు రూ.60 లక్షలు ముట్టజెప్పినట్లు సీబీఐ గుర్తించింది. -
సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ
ఒడిశా: లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ సీబీఐ వలకు చిక్కారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసుకు సంబంధించి.. భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.ఏడాదిన్నరగా రఘువంశీ భువనేశ్వర్ జోనల్ కార్యాలయంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని అరెస్ట్ చేసిన అధికారులు.. భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ధెంకనల్‌కు చెందిన స్టోన్ మైనింగ్ ఆపరేటర్ రతికంత రౌత్‌పై గతంలో ఒక ఈడీ కేసు నమోదైంది.ఈ కేసులో అతని వద్ద నుంచి రఘువంశీ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.5 కోట్ల లంచంలో భాగంగా మొదటి వాయిదా కింద రూ.20 లక్షలు.. రఘువంశీకి రౌత్ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు.. వల వేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. -
కశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్‌పై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, మరో ఏడుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. మాలిక్‌తోపాటు అతని అనుచరులు వీరేందర్ రానా, కన్వర్‌సింగ్ రానాలపై మూడేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్‌ను స్పెషల్‌కోర్టుకు సమర్పించింది. చీనాబ్‌వాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎస్.బాబు, డైరెక్టర్లు అరుణ్‌కుమార్ మిశ్రా, ఎం.కె.మిట్టల్, పటేల్ ఇంజనీరింగ్ సంస్థ మేనేజిగ్ డైరెక్టర్ రుపేన్ పటేల్, మరోవ్యక్తి కన్వల్జీత్ సింగ్‌దుగ్గల్ పేర్లను కూడా చేర్చింది. ‘‘నేను గత మూడు నుండి నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల ద్వారా నియంత నా ఇంటిపై దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్, నా సహాయకుడిని కూడా అనవసరంగా వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని, ఈ దాడులకు నేను భయపడను. నేను రైతులతో ఉన్నాను’’ అని ఎక్స్ వేదికగా మాలిక్ గురువారం పోస్ట్ చేశారు. -
రూ.70 లక్షల లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్/వైరా: ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఇన్‌కమ్‌ట్యాక్స్ (ఎక్సెంప్షన్స్) కమిషనర్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడు జీవన్‌లాల్ లవిడియా సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమిషనర్ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం ఉచ్చు వేసి పట్టుకుంది. సీబీఐ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో మధ్యవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత పలు ప్రాంతాల్లో మరికొందరిని అరెస్టు చేశారు. మధ్యవర్తి అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలో 18 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లంచం మొత్తంతో పాటు, రూ.69 లక్షల నగదు, పలు పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం పాండురంగాపురంలోని మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ నివాసంలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు 50మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం తనిఖీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి శుక్రవారం కమిషనర్ జీవన్‌లాల్ సహా 14 మందిపై కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు జీవన్‌లాల్ లవిడియాతోపాటు శ్రీరామ్ పలిశెట్టి (శ్రీకాకుళం), నట్టా వీర నాగ శ్రీరామ్ గోపాల్ (విశాఖపట్నం), ముంబైకి చెందిన విరల్ కాంతిలాల్ మెహతా, సాజిద మజ్హర్ హుస్సేన్ షాలను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు. -
ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు
సాక్షి,హైదరాబాద్: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్ కృపానందంలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మంగళవారం సీబీఐ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతోపాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ కేసులో విచారణ సాగుతున్న సమయంలోనే A5రావు లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేసింది. కేసులో గాలి సోదరుడు, బీవీ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్లు శిక్ష విధించింది. -
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి
చంఢీగడ్: అదొక పదహారేళ్ల క్రితం కేసు.. అందులోనూ హైప్రొహైల్ కేసు. ఒక జస్టిస్ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూసిన కేసు. హర్యానా జడ్జిగా పని చేసిన జస్టిస్ నిర్మలా యాదవ్.. భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే కేసు. అయితే ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేసింది సీబీఐ. చివరకు ఆ కేసులో నిర్మలా యాదవ్ ఎటువంటి తప్పుచేయలేదని తేలడంతో ఆమెకు బిగ్ రీలీఫ్ లభించింది. తాజాగా సీబీఐ కోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చి తీర్పును వెలువరించింది. 2008 జరిగిన ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు(శనివారం) సీబీఐ కోర్టుకు హాజరైన ఆమె.. తీర్పు తర్వాత మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అందుకే ఇంతకాలం ఓపిక పట్టిన దానికి ప్రతిఫలం లభించిందన్నారు. ఒక జడ్జికి ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకకే నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్. రోజుల వ్యవధిలో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లుఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో 12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.2009 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభంజస్టిస్ నిర్మలా యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో దర్యాప్తు చేపట్టేందుకు తమకు అనుమతి కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టుకు విజ్క్షప్తి చేసింది సీబీఐ. దీనికి అనుమతి లభించడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ పై విచారణ చేపట్టింది సీబీఐ. 2011లో ఆమెపై చార్జిషీట్ నమోదు చేసింది సీబీఐ.దీనిలో భాగంగా మొత్తం 84 మంది సాక్షులను పేర్లను నమోదు చేసింది. ఇందులో 69 మందిని విచారించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 మంది సాక్షులను తిరిగి విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 మంది కీలక సాక్షులను మళ్లీ విచారించారు. చివరకు ఆ రూ. 15 లక్షల కేసులో జస్టిల్ నిర్మలా యాదవ్ పాత్ర ఏమీ లేదని తేలడంతో ఆమె నిర్దోషిగా నిరూపితమయ్యారు. -
‘సుశాంత్ కేసు క్లోజ్.. రియాకు ఇదే నా శాల్యూట్..’!
ముంబై: సుమారు ఐదేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు పెద్ద సంచలనం. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తినే కారణమంటూ పెద్ద దుమారమే చెలరేగింది. 2020, జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిలా పడివున్నాడు. మెడకు ఉరి వేసుకుని ఉన్న సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీనిపై దాదాపు ఐదేళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ.. ఎట్టకేలకు తుది రిపోర్ట్ ఇచ్చింది. సుశాంత్ మరణం వెనుక ఎవరి ప్రేరేపితం లేదని స్పష్టం చేసింది. అంటే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాకు భారీ ఊరట లభించినట్లయ్యింది.అయితే దీనిపై రియా లాయర్ సతీష్ మనీషిండే మాట్లాడుతూ..‘ ఈ కేసులో ప్రతీకోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను ఇచ్చిన సీబీఐకి కృతజ్ఞతలు. అటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా రియాపై అనేక రకాలైన తప్పుడు కథనాలు వచ్చాయి. అది కోవిడ్ వచ్చిన సమయం కావడంతో ప్రతీ ఒక్కరూ టీవీలు, సోషల్ మీడియాను ఎక్కువ చూశారు. ఈ క్రమంలోనే రియాపై ఎన్నో తప్పుడు వార్తలు చుట్టుముట్టాయి. నిరాధారమైన ఆరోపణలతో ఆమెను, ఆమె కుటుంబాన్ని నానా యాగీ చేశారు. ఈ రకంగా చేయడం వల్ల అమాయకులు చాలా నష్టపోతారు. కానీ చివరకు రియా పాత్ర ఏమీ లేదని క్లియరెన్స్ వచ్చింది. ఇక్కడ రియాకు సెల్యూట్ చేస్తున్నా. ఎన్నో అవమానాలను భరించి ఎటువంటి నోరు విప్పకుండా మౌనం పాటించిన రియాకు, ఆమె కుటుంబానికి సెల్యూట్ చేస్తున్నా’ అని రియా లాయర్ సతీష్ మనీషిండే తెలిపారు.సీబీఐ రిపోర్ట్‌లో ఏం చెప్పింది..?సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసుల్లో ఎవరి పాత్ర లేదని తెలిపింది. ఈ మేరకు ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం వెనుకు ఎవరి పాత్ర లేదని, ఎటువంటి కుట్రలు జరగలేదని తెలిపింది. సుశాంత్ మరణంలో నటి రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర లేదని పేర్కొంది. -
నటుడు సుశాంత్ మృతి కేసులో భారీ ట్విస్ట్.. నటి రియాకు..
ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతి కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. రెండు కేసులను క్లోజ్ చేసింది. ఇదే సమయంలో సుశాంత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. దీంతో, సుశాంత్ మరణంపై మరోసారి చర్చ జరుగుతోంది.నటుడు సుశాంత్ మృతి కేసులో దాదాపు ఐదేళ్ల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ సంచలన రిపోర్టును ఇచ్చింది. తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సీబీఐ క్లోజ్ చేసింది. ఈ మేరకు శనివారం (మార్చి 22) ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్టును దాఖలు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ రిపోర్టులో.. సుశాంత్ మరణంలో ఎటువంటి కుట్ర కోణం లేదు. సుశాంత్ మరణానికి వెనక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగే, సుశాంత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే సమయంలో సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ క్లోజ్ చేసింది. దీంతో, సుశాంత్ మరణంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దీంతో సీబీఐ రిపోర్టుపై ముంబై కోర్టు, సుశాంత్ కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉండగా.. నటుడు సుశాంత్ సింగ్ జూన్ 14, 2020న ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పటి వరకు సక్సెస్ ఫుల్‌గా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిన సమయంలో ఆయన మృతి సంచలనానికి దారి తీసింది. ఈ క్రమంలో సుశాంత్ మరణం వెనక కుట్ర కోణం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నటి రియా చక్రవర్తి, మరికొంత మందిపై సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఆర్థిక మోసం, మానసిక వేధింపులకు గురి చేశారని ఆయన తండ్రి కెకె సింగ్ వ్యాఖ్యానించారు. అనంతరం, పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్ నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరీమణులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది.Breaking : CBI files closure report in Sushant Singh Rajput's case. - Natural Suicide- No Foul Play involvedThis country owes an apology to Rhea Chakraborty, Media launched a witch hunt against her, destroyed her dignity , made her national villain, abused her day in and… pic.twitter.com/fywlX5xIam— Roshan Rai (@RoshanKrRaii) March 22, 2025సుశాంత్ సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ మరణానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ తండ్రి, నటి రియా చక్రవర్తి నమోదు చేసిన కేసులను లోతుగా దర్యాప్తు చేసి కేసుల విచారణ ముగించింది. దాదాపు ఐదేళ్ల పాటు సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఈ మేరకు ముంబై కోర్టులో క్లోబర్ రిపోర్టు దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనక ఎలాంటి కుట్ర లేదని సీబీఐ తేల్చింది. BIGGEST BREAKING 🚨The CBI closed the Sushant Singh Rajput case and gave clean chit to Rhea Chakraborty Will Arnab Goswami apologize for 24*7 nonsense coverage against Rhea? 🤡Will Aaj Tak, ZEE and News18 apologize for torturous behavior with Rhea? RT if you want public… pic.twitter.com/tCto2jL6ER— Amock_ (@Amockx2022) March 22, 2025 -
విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు
కోలీవుడ్ హీరో విశాల్ చెల్లెలు ఐశ్వర్య కుటుంబం చిక్కుల్లో పడింది. చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారి ఉమ్మిడి ఉదయ్‌కుమార్, జయంతి దంపతుల కుమారుడు ఉమ్మిడి క్రితీష్‌తో 2017లో వివాహం జరిగింది. చాలు ఏళ్లుగా క్రితీస్ నగల వ్యాపారం చేస్తున్నాడు. విశాల్ చెల్లెలి భర్త క్రితీష్, ఆయన నిర్వహిస్తున్న నగల షాపుపైనా సీబీఐ అధికారులు తాజాగా కేసు పెట్టారు. వివరాలు చూస్తే స్థానిక అయ్యప్పన్ తంగల్‌లోని ఒక బ్యాంకులో నకిలీ పత్రాలతో రూ.5.5 కోట్ల రుణం తీసుకున్న కేసులో, ఆ మోసానికి సహకరించి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లు క్రితీష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసులో క్రితీష్‌తో పాటు, మోసం వెనుక భూ యజమాని, నిర్మాణ సంస్థ, బ్యాంకు అధికారులు, బ్యాంకు రుణగ్రహీతలు తదితరలు ఈ స్కామ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వారందరూ తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ప్రముఖ బ్యాంకు నుంచి ఐదున్నర కోట్ల రూపాయల రుణం పొందినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ఏడుగురిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
సీబీఐ అదుపులో మరో అవినీతి తిమింగలం
సాక్షి,హైదరాబాద్: మరో అవినీతి తిమింగలం దొరికింది.మెదక్ జీఎస్టీ సూపర్ డెంట్ రవి రాజన్ అగర్వాల్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ శాఖలో ఉన్నతాధికారిగా చెలామణి అవుతున్న రవి రాజన్ అగర్వాల్‌పై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మెదక్ జీఎస్టీ కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు జరిపారు.సోదారులు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, విచారణ నిమిత్త రవి రాజన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. -
కూటమి తప్పుడు ప్రచారాలపై CBI సీరియస్
-
ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ
-
రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. -
నిద్రలేచిన ‘బోఫోర్స్ స్కాం’
నలభైయ్యేళ్ల క్రితం పుట్టుకొచ్చి, పుష్కరకాలం క్రితం శాశ్వత సమాధి అయిందనుకున్న బోఫోర్స్ కుంభకోణం మళ్లీ ఆవులిస్తోంది. దాన్ని సమాధి చేసేవరకూ ఇంచుమించు ప్రతియేటా ఏదో ఒక కొత్త సంగతితో బయటికొస్తూ, వచ్చినప్పుడల్లా పెను సంచలనానికీ, దుమారానికీ కారణమైన బోఫోర్స్ ఆ రకంగా ‘ఎవర్ గ్రీన్’. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన అభ్యర్థన పత్రంతో కొన్ని రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, అమెరికా న్యాయ విభాగాన్ని సంప్రదించటంతో అది మరోసారి పతాక శీర్షికలకు ఎక్కబోతున్నదని భావించవచ్చు. అప్పట్లో బోఫోర్స్ స్కాంపై దర్యాప్తు చేశామని చెప్పిన అమెరికన్ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థ ‘ఫెయిర్ ఫాక్స్’ నుంచి సమాచారం సేకరించాలన్నది సీబీఐ ప్రధాన ధ్యేయం. వాస్తవానికి ఈ అభ్యర్థన పత్రాన్ని జారీ చేయాల్సిందిగా నిరుడు అక్టోబర్‌లోనే ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించిందని చెబుతున్నారు. ఇప్పటికీ ఎవరూ అధిగమించలేని స్థాయిలో 1984 లోక్‌సభ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 404 స్థానాలు సాధించిపెట్టిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని... ఆ తర్వాత మరో మూడేళ్లకు బయట పడిన ఈ కుంభకోణం ఊపిరాడనీయకుండా చేసింది. ఇందులో తనకు లేదా తన కుటుంబ సభ్యు లకు ఎలాంటి ప్రమేయమూ లేదని రాజీవ్ చెప్పిన మాటల్ని జనం విశ్వసించలేదు. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సగానికిపైగా స్థానాలు కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990లో ఆదేశించే వరకూ నిందితులపై కేసు ల్లేవు. దర్యాప్తు లేదు. అంతవరకూ మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలియని స్వీడన్ రేడియో 1987లో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని తొలిసారి వెల్లడించినప్పుడు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అటు స్వీడన్‌లోనూ పెను సంచలనం కలిగించాయి. ఈ స్కాంలో మన రాజకీయ నాయకులు, రక్షణ అధికారులతోపాటు కొందరు విదేశీయులు పీకల్లోతు మునిగారని వెల్లడైంది. స్వీడన్ ఆయుధాల సంస్థ ఏబీ బోఫోర్స్ నుంచి నాలుగు వందల 155 ఎంఎం శతఘ్నులు కొనుగోలు చేయటానికి రూ. 1,437 కోట్లతో ఒప్పందం కుదరగా,అందులో రూ. 64 కోట్లు చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో ఇటలీ వ్యాపారవేత్త అటావియో కత్రోచి, బోఫోర్స్‌కు ఏజెంట్‌గా వ్యవహరించిన విన్‌చద్దా, పారిశ్రామికవేత్తలు హిందూజా సోదరుల పేర్లు వెల్లడయ్యాయి. ‘ది హిందూ’ దినపత్రిక జర్నలిస్టు చిత్రా సుబ్రహ్మణ్యం ఈ కుంభ కోణంపై వరసబెట్టి రాసిన కథనాల పరంపరతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనికి తోడు బోఫోర్స్ సంస్థ ఎండీ మార్టిన్ ఆర్డ్బో రాసుకున్న డైరీలోని అంశాలు సైతం బట్టబయలయ్యాయి.దాదాపు పదిహేనేళ్లపాటు దర్యాప్తు పేరుతో సీబీఐ సాగించిందంతా ఒక ప్రహసనం. ఆ తంతు సాగుతుండగానే 1993లో కత్రోచి మన దేశం నుంచి చల్లగా జారుకున్నాడు. అతని బ్యాంకు ఖాతాల విషయమై సమాచారం కావాలంటూ భారత్ నుంచి వచ్చిన అభ్యర్థనను పట్టించుకోవాల్సిన పని లేదంటూ స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రికి అంతకు ఏడాదిముందు... అంటే 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న మాధవ్‌సిన్హ్ సోలంకీ ఉత్తరం అందజేశారు. ఇక 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడి మొదలయ్యాక దర్యాప్తు పూర్తిగా పడకేసింది. ఈ కేసుకు సంబంధించి కొత్త పాత్రధారులు తెరపైకొస్తున్నా, సరికొత్త వివరాలు వెల్లడవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఈలోగా నిందితుల్లో కొందరు మరణించారు. కనీసం బతికున్న కత్రోచి పైన అయినా దర్యాప్తు కొనసాగించమని 2005లో ఢిల్లీ హైకోర్టు చెప్పినా సీబీఐ ముందుకు కదలనే లేదు. వాస్తవానికి అంతకుముందు 2003లో మలేసియాలోనూ, ఆ తర్వాత 2007లో అర్జెంటీనా లోనూ కత్రోచి కదలికలు కనబడినా అరెస్టుకు ప్రయత్నించలేదు. సరిగదా... లండన్‌లోని కత్రోచి ఖాతాలకూ, ముడుపులకూ సంబంధం లేదంటూ ఆ ఖాతాల స్తంభనను రద్దు చేయించి, 2009లో ‘వాంటెడ్’ జాబితా నుంచి అతని పేరు తొలగింపజేయటంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. నిందితులుగా ఉన్న కత్రోచి, విన్ చద్దాలకు రూ. 41 కోట్లు అందాయని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ధారించి వారిద్దరూ ఆ ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని 2011లో తేల్చి చెప్పింది. వీరిద్దరికీ ఏఈ సర్వీసెస్ నుంచీ, స్వెన్స్కా అనే సంస్థ నుంచీ సొమ్ములు బదిలీ అయ్యా యని తెలిపింది. ఆ తర్వాతైనా సీబీఐ చేయాల్సింది చేయలేదు. ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చిన మర్నాడే కత్రోచిని పట్టుకోవటం మావల్ల కాదని కోర్టులో ఆ సంస్థ చేతులెత్తేసింది. నిందితులందరిపై కేసుల ఉపసంహరణకు అనుమతించమని అది దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు అంగీకరించింది. కీలక నిందితుడు కత్రోచి 2013లో మరణించాడు. దీన్ని తిరగదోడేందుకు అనుమతించాలన్న సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తీవ్ర జాప్యం చోటుచేసుకుందన్న కారణాన్ని చూపి 2018లో తోసిపుచ్చింది.రాజీవ్ గాంధీకి ఈ ముడుపుల వ్యవహారంతో సంబంధం లేదని 2004లో ఢిల్లీ హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగింది? ఎవరిని కాపాడటానికి ఆ సంస్థ తాపత్రయపడింది? ఒక స్విస్ బ్యాంక్‌లో ‘మాంట్ బ్లాంక్’ పేరిట ఉన్న ఖాతాలో బోఫోర్స్ ముడుపులున్నాయని తాము కనుగొన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆగ్రహోదగ్రు డయ్యారని ‘ఫెయిర్ ఫాక్స్’ సారథి మైకేల్ హెర్ష్మాన్ 2017లో చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? ఇందులో వెలికితీయాల్సిన చేదు నిజాలు చాలానే ఉన్నాయని ఈ పరిణామాలు చూస్తే అర్థమవు తుంది. ఈసారైనా ఆ పని జరుగుతుందా అనేది వేచిచూడాలి. -
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్ పోల్‌ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్ పోల్(Interpol )కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఉన్నారు. -
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై సుబ్రహ్మణ్యస్వామి లేఖ
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. ఆ ఎన్నికల సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారని, అక్రమాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. ఎంపీ గురుమూర్తి సహా పలువురుపై దాడికి పాల్పడిన సందర్భాన్ని సుబ్రహ్మణ్యస్వామి లేఖలో పేర్కొన్నారు.కాగా, ఈనెలలో జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. -
సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!
-
సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇక మూలకు చేరనుంది. గత చంద్రబాబు పాలనలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా విచారించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు వైఎస్ జగన్ ఉత్తర్వులిచ్చారు. అయినా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సీబీఐ.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. చంద్రబాబు హయాంలో తూతూ మంత్రంగా దర్యాప్తుకర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.సీబీఐ స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, సీబీఐ కూడా స్పందించలేదు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్ 11న హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ నెల 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.అందువల్ల తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టుకు వివరించారు. సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి. న్యాయం చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఓసారి కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమ కుమార్తె మృతి విషయంలో న్యాయం చేయాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రీతి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. అయినా చంద్రబాబు కనీస చర్యలు కూడా తీసుకోకపోయినా, వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే టీడీపీ, జనసేన నేతలు ఈ కేసుపై నానా రాద్ధాంతం చేశారు. -
దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో తొలి నుంచి నిందితుడి (ఏ–4)గా పేర్కొన్న దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణా సంస్థతోపాటు దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. తాను అప్రూవర్‌గా మారినందున తనను సాక్షిగా పరిగణించాలంటూ గత ఏడాది సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు.సీబీఐ కూడా దీనికి అనుకూలంగా వాదనలు వినిపించడంతో న్యాయస్థానం దస్తగిరిని సాక్షిగా పేర్కొనాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డి.శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. కేసులో సీబీఐ తరఫున స్పెషల్ పీపీ శ్రీనివాస్ కపాడియా హాజరై సమయం కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ.. సీబీఐ, దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ల వాదన ఇదీ... ‘సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా పేర్కొనడం సరికాదు. 2021, అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షిట్ దస్తగిరిని నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత వేసిన రెండు మధ్యంతర చార్జ్‌షీట్లలోనూ దస్తగిరి పేరును తొలగించలేదు. 2022, ఫిబ్రవరి 21న సెక్షన్ 306(4)(ఏ) కింద అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా చార్జ్షిట్లో అతని పేరు తీసివేయలేదు. ఒకసారి నిందితులుగా అనుమతించిన (కాగ్నిజెన్స్) తర్వాత.. ఇదే కోర్టు పునః సమీక్షించజాలదు.క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌లో అలాంటి నిబంధన ఎక్కడా లేదు. చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం చెల్లదు. ఒకసారి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించే అధికారాలు లేవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొంది. దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నామని చెప్పడం కూడా సరికాదు. నిందితుడిగా పలుమార్లు ఇదే కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. హాజరుకానప్పుడు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దస్తగిరిని సాక్షిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’ అని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. -
మనీలాండరింగ్ కేసులో సుజనా చౌదరికి ఎదురు దెబ్బ
ఢిల్లీ : ఈడీ మనీలాండరింగ్ కేసులో బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఎదురు దెబ్బ తగిలింది. బెస్త్ అండ్ క్రాప్టన్ కేసును క్వాష్ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ని సుప్రీం కోర్టు డిస్మీస్ చేసింది. చైన్నై ఈడీ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇదే కేసులో సీబీఐ సుజనా చౌదరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫీ‘జులుం’ కోసమే కేఎల్‌యూ మాయాజాలం
సాక్షి, అమరావతి: న్యాక్ ర్యాంకింగ్ కోసం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం (కేఎల్‌యూ) పాల్పడిన అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పూర్తి ఆధారాలతో బయటపడిన ఈ ర్యాంకింగ్ గూడుపుఠాణి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా న్యాక్ చైర్మన్, సభ్యులకే భారీ లంచాలు ఇచ్చి మరీ న్యాక్ ఏ++ ర్యాకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం పక్కా పన్నాగంతో వ్యవహరించినట్టు సీబీఐ కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. దాంతోనే పక్కా వ్యూహంతో వ్యవహరించి న్యాక్‌కు భారీ లంచాలు ఇస్తుండగా.. శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన 10 మంది నిందితులను విజయవాడలోని న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరిచింది. న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహా, సభ్యులు రాజీవ్ సిజిరాయా, డి.గోపాల్, రాజేశ్‌సింగ్ పవర్, మానస్‌కుమార్ మిశ్రా, గాయత్రి దేవరాజ, బులు మహారాణతోపాటు కేఎల్‌యూ యాజమాన్య ప్రతినిధులు కోనేరు రాజ హరేన్ (వైస్ ప్రెసిడెంట్), జీపీ సారథి వర్మ (వీసీ), ఎ.రామకృష్ణ (డైరెక్టర్)లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కేఎల్‌యూ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఇతర నిందితులు ఎల్.మంజునాథరావు (న్యాక్ మాజీ సలహాదారు), ఎం.హనుమంతప్ప(బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్), ఎం.శ్యామ్‌సుందర్ (న్యాక్ సలహాదారు)ల కోసం సీబీఐ గాలింపు ముమ్మరం చేసింది. కాగా.. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన రిమాండ్ నివేదికలో న్యాక్ ర్యాంకింగ్ కుట్రపై పూర్తి వివరాలు వెల్లడించింది.భారీగా ఫీజులు కొల్లగొట్టేందుకే..అక్రమ విధానాలతో న్యాక్ ఏ++ ర్యాంక్ సాధించిన అనంతరం ఆ ర్యాంకింగ్‌ను చూపిస్తూ భారీగా ఫీజులు నిర్ణయించి దోపిడీకి పాల్పడాలన్నది కేఎల్‌యూ యాజమాన్యం ప్రధాన ఉద్దేశని సీబీఐ పేర్కొంది. రిమాండ్ నివేదికలో ఇంకా ఏమున్నాయంటే.. ఇష్టానుసారంగా సెక్షన్లు పెంచేసి భారీగా విద్యార్థులను చేర్పించుకుని భారీ ఫీజులతో దోపిడీకి పాల్పడటమే అసలు లక్ష్యం. ఈ ఏడాది న్యాక్ తనిఖీలు ఉంటాయని తెలిసినప్పటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అందుకోసం న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహాతోపాటు సభ్యులను మధ్యవర్తుల ద్వారా కొన్ని నెలల ముందుగానే సంప్రదించింది. న్యాక్ ప్రస్తుత సలహదారు ఎం.శ్యామ్‌సుందర్, మాజీ సలహాదారు ఎం.హనుమంతప్ప ఇందులో కీలక పాత్ర పోషించారు. వారి ద్వారా న్యాక్ చైర్మన్, సభ్యులను లోబర్చుకునేందుకు కేఎల్‌యూ యాజమాన్యం పావులు కదిపింది. ఏ++ ర్యాంకింగ్ ఇస్తే భారీగా ముడుపులు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరింది. అందుకోసం న్యాక్ చైర్మన్, సభ్యుల గృహాలకే భారీగా ముడుపులు అందించేలా ఏర్పాట్లు చేసింది. తనిఖీల కోసం కేఎల్యూను సందర్శించినప్పుడు కూడా వారికి భారీగా కానుకలు, ఇతర తాయిలాలు ముట్టజెప్పేందుకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసింది.పక్కా సమాచారంతో వ్యూహాత్మక దాడిన్యాక్ ర్యాంకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని ఉమ్మడి విజయవాడ, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచే సీబీఐకి పలువురు ఫిర్యాదు చేశారు. అందుకోసం కేఎల్‌యూ ఎలా వ్యవహరిస్తోందన్నది కూడా నేరుగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సమాచారమిచ్చారు. దాంతో సీబీఐ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు. ఢిల్లీ, విశాఖపట్నంలోని సీబీఐ అధికార బృందాలు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌యూ ప్రధాన క్యాంపస్‌తోపాటు దేశంలోని 20 నగరాల్లోని న్యాక్ చైర్మన్, సభ్యులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ అనూహ్య పరిణామంతో న్యాక్ చైర్మన్, సభ్యులు, కేఎల్‌యూ ప్రతినిధులు బిత్తరపోయారు. న్యాక్ చైర్మన్, సభ్యుల వద్ద భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.వాటికి సంబంధించిన వివరాలు అడిగితే న్యాక్ చైర్మన్, సభ్యులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో న్యాక్ ర్యాంకింగ్ కోసమే అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. న్యాక్ చైర్మన్, సభ్యుల నుంచి మొత్తం రూ.37 లక్షల విలువైన పరికరాలను జప్తు చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. -
RG Kar Case : నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ ఆస్పత్రి (RG Kar Case) ట్రైనీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో సీల్దా కోర్టు (sealdah court ) సోమవారం మధ్యాహ్నం (జనవరి 20) తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ‘నేను అమాయకుడిని, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారంటూ’ కోర్టుకు తెలిపారు. సంజయ్ రాయ్ వాదనల్ని సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఖండించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. తీర్పు సమయంలో వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ సైతం వైద్యురాలి కేసు ఆరుదైన కేసుల్లో అరుదైన కేసు కేటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు రాయ్‌కు మరణిశిక్ష విధించాలని కోరింది. సీబీఐ వాదనపై సీల్దా కోర్టు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ స్పందించారు. ‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదు. అతనికి (సంజయ్ రాయ్‌కు) జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీల్దా కోర్టు తీర్పుపై అభయ తల్లిదండ్రులు కోర్టు హాలులో ఆందోళన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు కోర్టులను ఆశ్రయిస్తామని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ఉరితీయండిగత నెల డిసెంబర్లో కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరుఫు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. తాజాగా, సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించడంపై కోల్‌కతా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆందోళన కారులు తమ నిరసనల్ని తెలుపుతున్నారు. -
ఆర్జీకార్ జూనియర్ వైద్యురాలి హత్యోదంతం.. బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు
కోల్‌కతా : యావద్దేశాన్నీ కదిలించిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన యువ వైద్యురాలి (అభయ) పాశవిక హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, సీబీఐ విచారణపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యోదంతంలో సీబీఐ అధికారులు విచారణ పేరుతో చేసింది ఏమీలేదని వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్‌పై జురిగిన దారుణంపై సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తు ఆధారంగా మరికొద్ది సేపట్లో సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.ఈ సమయంలో అభయ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దర్యాప్తులో సీబీఐ చేసింది ఏమీలేదు. మా కుమార్తె కేసుకు సంబంధించి మేం కోల్‌కతా హైకోర్టు,సుప్రీం కోర్టు ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తాం. సమాధానాలు కోరాం. కోర్టు ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.కానీ సీబీఐ మా అనుమానాల్ని ఇంతవరకూ నివృత్తి చేయలేదు. మా అమ్మాయికి జరిగిన దారుణంలో ఒక్కరు కాదు. నలుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి ప్రమేయం ఉందని డీఎన్ఏ రిపోర్ట్ చెబుతోంది. నిందితులకు శిక్ష పడినప్పుడే మాకు ఉపశమనం లభిస్తుంది. ఈ కేసులో మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయ స్థానాల తలుపు తడుతూనే ఉంటామని’ స్పష్టం చేశారు.ప్రధాని మోదీకి లేఖ మా అమ్మాయి కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ మేం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశాం.వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు’ అని అభయ తండ్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు ఏసీబీ విచారణకు ఏస్నెక్ట్స్జెన్కో, గ్రీన్కో ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కారు రేసు కేసు(Formula E Car Race Case) దర్యాప్తులో భాగంగా శనివారం ఏసీబీ(ACB) అధికారుల ఎదుట ఏస్‌నెక్ట్స్‌జెన్, గ్రీన్కో ప్రతినిధులు విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు ఫార్ములా ఈ–ఆపరేషన్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేటు లిమిటెడ్, పట్టణాభివృద్ధిశాఖ మధ్య జరిగాయి.ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు జరిగాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ రెండు సంస్థల కార్యాలయాల్లో ఇటీవల సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలు, ఇప్పటి వరకు దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా మరింత సమాచారాన్ని ఈ సంస్థల ప్రతినిధుల నుంచి సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆరు రైల్వే లైన్లతో అనుసంధానం -
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష?
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీకార్ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్‌కు ఉరే సరినిందితుడు సంజయ్ రాయ్‌పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది. -
‘బయటి నేరగాళ్ల’కు చెక్ భారత్‌పోల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అమెరికాలో ఉన్న ఆయన్ను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించడానికి 8 నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, పోలీసు విభాగాలు అనునిత్యం ఏదో ఒక కేసులో నిందితుల ఆచూకీ కనుగొనడం, వారిని రప్పించే క్రమంలో ఇంటర్‌పోల్ సాయం కోరుతుంటాయి. ఇంటర్ పోల్గా పిలిచే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారానికి, నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది. అయితే ఏదైనా పోలీసు విభాగం దీన్ని ఆశ్రయించడం అనేది ప్రస్తుతం ఓ సుదీర్ఘ, క్లిష్టతరమైన ప్రక్రియగా ఉంది. దీన్ని సులభతరం చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబీఐ) అధీనంలోని నేషనల్ సెంట్రల్ బ్యూరో (ఎన్సీబీ) ఫర్ ఇంటర్‌పోల్ ఓ పోర్టల్‌ను రూపొందించింది. అదే భారత్‌పోల్. ఈ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండురోజుల క్రితం ఢిల్లీలో ఆవిష్కరించారు.అనేక కేసుల్లో విదేశీ లింకులుఒకప్పుడు దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో విదేశాలతో లింకు ఉన్నవి అత్యంత అరుదుగా తెరపైకి వచ్చేవి. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు, భారీ ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా తదితర కేసులతో పాటు వ్యవస్థీకృత నేరాల్లో ‘విదేశీ లింకులు’ సర్వసాధార ణం అయ్యా యి. సూత్ర ధారులు విదేశాల్లో ఉండి ఇక్కడ నేరాలు చేయించడమో, ఇక్కడ నేరం చేసిన వారు విదేశాలకు పారిపోవడమో జరుగుతోంది. దీంతో పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడం అనివార్యంగా మారుతోంది. 195 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్‌పోల్ ద్వారానే రెడ్ కార్నర్ సహా వివిధ రకాలైన నోటీసుల జారీ సాధ్యమవుతుంది.అంత ఈజీ కాదు..అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పంజగుట్ట పోలీసుల వ్యయప్రయాసలు ఇంటర్‌పోల్ వ్యవహారానికి ఓ తాజా ఉదాహరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు వినతి తొలుత వెస్ట్‌జోన్ డీసీపీ ద్వారా నగర పోలీసు కమిషనర్‌కు వెళ్లింది. పోలీసు కమిషనర్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సీఐడీకి సిఫారసు చేశారు. అక్కడి నుంచి దేశంలో ఇంటర్‌పోల్‌కు నోడల్ ఏజెన్సీగా ఉన్న సీబీఐకి చేరింది. అక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కు సదరు విజ్ఞప్తి చేరాల్సి ఉండగా.. అనేక వివరణలు, సందేహాలు, సమస్యలు ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆటంకంగా మారాయి. ఈ కారణంగానే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినా, 8 నెలలుగా హైదరాబాద్ పోలీసులు రకరకాలుగా ప్రయ త్నాలు చేస్తున్నా ఇప్పటికీ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే ప్రయత్నం సఫలం కాలేదు. దేశంలోని అనేక ఏజెన్సీలు, పోలీసు విభాగాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంలో భాగంగానే భారత్‌పోల్ తెరపైకి వచ్చింది.ఇకపై సులభంగా..ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఏజెన్సీలకు ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు సులువు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. వివిధ రకాలైన కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ, అందుకు అవసరమైన పత్రాలు, నమూనాలను ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. అధికారులకు వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలను ఆన్లైన్లో పొందేలా డిజైన్ చేశారు. ఈ పోర్టల్ వినియోగంపై త్వరలో సీబీఐ దేశ వ్యాప్తంగా పోలీసులు, ఏజెన్సీలకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది.భారత్‌పోల్.. 5 ఉపయోగాలు1 దేశంలోని అన్ని ఏజెన్సీలు, పోలీసు విభాగాలతో పాటు కొన్ని విదేశీ ఏజెన్సీలు సైతం ఈ పోర్టల్ ద్వారాసంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.2 వివిధ వ్యవస్థీకృత నేరాలు,నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇందులో పొందుపరిచారు.3 బ్రాడ్ కాస్ట్ విధానంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాంటెడ్ నేరగాళ్ల వివరాలను తేలిగ్గా ఇచ్చిపుచ్చుకునే ఆస్కారం ఏర్పడింది.4 వ్యవస్థీకృత నేరాలు, నేరగాళ్ల సమా చారం, నేరం చేసే విధానం, ప్రభావం ఉన్న ప్రాంతాలు తదితరాలను తేలిగ్గా గుర్తించేలా ఈ పోర్టల్ రూపొందింది.5 క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం కంటే సమర్థంగా నేరగాళ్ల కదలికలు, వివరాలు తెలుసుకునేందుకు భారత్‌పోల్ ఉపయోగపడనుంది. -
19 ఏళ్ళ తరువాత దొరికారు.. కావలపిల్లలను తల్లిని హతమార్చిన హంతకులు
-
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
డేరా బాబాకు ‘సుప్రీం’ నోటీసులు
ఛండీగఢ్: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ (dera baba)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2002లో డేరా బాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి డేరా బాబాతో పాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు (supreme court) ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా, అతని సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. కేసులో విచారణకు కోర్టు ఎదుట హాజరు కావడం లేదంటే, విచారణకు సహకరించాలని సూచించింది. ఈ కేసును సుప్రీం కోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. 24ఏళ్ల నాటి కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే 2002లో పంజాబ్ విద్యార్థిని, డేరాబాబా శిష్యురాలు పేరుతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (atal bihari vajpayee), కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, సీబీఐ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc), పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులకు హిందీలో ఓ ఆకాశ రామన్న ఉత్తరం అందింది. ఆ లేఖలో సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను నంపుసకులుగా మార్చారని, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరగబడిన వారిని హత్య చేసేవారంటూ పలు ఆధారాల్ని ఆ లేఖలో పొందుపరిచింది. అప్పటి వరకు కోట్లాది మంది భక్తులకు దైవంగా విరాజిల్లిన డేరాబాబాకు ఆ లేఖతో పతనం మొదలైంది. ఆయన భక్తులు డేరా బాబాపై తిరగబడ్డారు.ఆకాశ రామన్న ఉత్తరం రాసింది ఎవరంటే అయితే అదే సమయంలో 2002, జులై 10న డేరా బాబా మేనేజర్ రంజిత్ సింగ్ హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగరానికి చెందిన కాన్పూర్ కాలనీలో అనుమానాస్పద రీతిలో మరణించారు. డేరాబాబా ఆకృత్యాలను ఎదిరించేలా రాసింది శిష్యురాలు కాదని, మేనేజర్ రంజిత్ సింగేనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. హత్యకేసులో దోషులుగాఅదే సమయంలో రంజిత్ సింగ్ దారుణు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసును 2021లో హర్యానా పంచాకుల సీబీఐ విచారించింది. విచారణలో రంజిత్ సింగ్ మృతిలో డేరాబాబాతో పాటు అవతార్ సింగ్, కృష్ణలాల్, జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్‌లను దోషులుగా పరిగణించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది.కేసుల నుంచి విముక్తి కల్పించండిఈ నేపథ్యంలో మే 2024లో డేరాబాబా తనపై నమోదైన అత్యాచార కేసులు, జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్యకేసులో తనని నిర్ధోషిగా ప్రకటించాలని కోరుతూ కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు, సీబీఐ కోర్టు డేరాబాకుకు విధించిన శిక్షను రద్దు చేసింది. రంజిత్ సింగ్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.తాజాగా, ఈ కేసులో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు సైతం కేసు తదుపరి విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. 2017 నుంచి జైలు జీవితం2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత సీబీఐ కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో హర్యానాలోని రోహ్తక్ జైలులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా రంజిత్ సింగ్ కేసులో సీబీఐ జీవిత ఖైదు విధించింది. -
Magazine Story: చంద్రబాబుపై విచారణలో ఉన్న కేసులను నీరుగార్చే కుట్ర
-
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్‌ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్‌కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను తీసుకువచ్చిన ‘ఎస్‌ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్‌ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్‌కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్‌ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్‌యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్‌గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
ఆర్జీ కర్ ఆస్పత్రిలో అవినీతి.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఆ ఛార్జ్ షీట్లో పేర్కొంది. 1000 పేజీల చార్జిషీటును సీబీఐ సిద్ధం చేసింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌ను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ చార్జిషీటులో ఐదుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (సస్పెండ్ అయ్యారు)తో పాటు మరో నలుగురు అరెస్టయిన నిందితుల పేర్లు ఛార్జ్ షీట్లో ఉన్నాయన్నారు. ఇందులో బిప్లబ్ సింగ్, అఫ్సర్ అలీ, సుమన్ హజ్రా, ఆశిష్ పాండే పేర్లు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతి పొందలేనందున అలీపూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను అంగీకరించలేదు.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగిందంటూ విద్యార్థులు, కొంతమంది వైద్యులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పలు ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వైద్యసామగ్రి కొనుగోలులో నిందితులు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్‌ను కిగాలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
-
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
సాక్షి,విశాఖ: సీబీఐ వలకి అవినీతి అధికారి అడ్డంగా దొరికి పోయారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.వాల్తేరు డివిజన్ డీఅర్ఎంగా సౌరభ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సౌరబ్‌కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.పక్కా సమాచారంతో కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
సుశాంత్ కేసు.. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తికి ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.ఈ సందర్భంగా సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.ఇదిలా ఉండగా నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది. -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
కోల్‌కతా డాక్టర్ ఉదంతం: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.జూనియర్ డాక్టర్ ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ -
సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయంటూ ‘కొవ్వు ప్రకటన’ చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాకివ్వడంతో ఆయన వ్యూహం మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ను పక్కనపెట్టిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు, కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒకరు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరతీశారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలో స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన సీఎం శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసుకదా. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకటే మాట మీద ఉండాలి. ఎవరూ నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైనవారే ఉంటారు. ఆ ఇద్దరు అన్నీ చూసుకుంటారు’ అని ముఖ్య అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథిగృహంలో ఐదుగురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఐపీ సంస్కృతి తగ్గాలి.. తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. ఐదుగురు అధికారులతో సమావేశం ముగిశాక ఆయన దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలన్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగానే టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు. లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, ఇది ఎల్లప్పుడూ కొనసాగాలని ఆదేశించారు. అలాగే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని ఆదేశించారు. కాగా తిరుమలలో చంద్రబాబు కేంద్రీకృత వకుళమాత వంటశాలను ప్రారంభించారు. పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు పక్కన నిర్మించిన అధునాతనమైన ఈ వంటశాలను సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు అన్నప్రసాదాలు అందిస్తారు. సమావేశం కారణంగానే షెడ్యూల్లో మార్పులు..వాస్తవానికి శనివారం ఉదయం 7.35 గంటలకు వకుళమాత వంటశాల ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. అయితే సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు కానున్న సిట్ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన టీటీడీ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారని చెబుతున్నారు.టీటీడీ అధికారులు, మార్కెటింగ్ సిబ్బందిని సిట్ ఏమడుగుతుంది? ఏం సమాధానం చెప్పాలి? ఎలా స్పందించాలి? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ముఖ్య అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నతాధికారులు సిబ్బందికి కూడా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.ఎమ్మెల్యే డిక్లరేషన్‌పై వివాదంచిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ శుక్రవారం శ్రీవారి దర్శనం సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో తాను క్రిస్టియన్‌ను అని, శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ ఎమ్మెల్యే డిక్లరేషన్ ఇచ్చారు. క్రిస్టియానిటీ తీసుకుంటే.. ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని, బీసీ కేటగిరీలోకి వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే థామస్‌పై అనర్హత వేటు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తనకు తానుగా తిరుమలలో క్రిస్టియన్‌గా డిక్లరేషన్ ఇచ్చాక ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా సీబీఐ సిట్ విచారణ
-
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
-
లడ్డూలో కాదు.. కూటమిలోనే కల్తీ
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారు. వందరోజుల పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు విషరాజకీయాలకు తెరతీశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. రెండు రోజుల తర్వాత.. కల్తీ నెయ్యి అనీ.. మరికొద్ది రోజుల తర్వాత.. లడ్డూలో కలవలేదనీ.. కలవకుండా ఆపేశామంటూ పూటకోమాట మార్చేస్తూ.. భక్తుల మనోభావాలతో రాజకీయ చదరంగమాడారు. దీనిపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, అండ్ కో చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడింది. చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని సమరి్థంచుకునేందుకు కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులతో సిట్ పేరుతో ఆడాలనుకున్న నాటకాలకు ధర్మాసనం స్వస్తి పలికింది. లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించి.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కుటిల స్వార్థంతో భగవంతుడిని రాజకీయాల్లోకి లాగారంటూ ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడని.. తప్పుడు ఆరోపణలు చేసినా.. ఏడుకొండల వాడు విడిచి పెట్టరంటున్నారు. మతజ్వాలలు రగిలించిన ప్రభుత్వ వ్యవహారంపై చిన్నా పెద్దా తేడాలేకుండా.. యావత్ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీ లేదని.. కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారంలోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుంటే బావుంటుంది ఈ మధ్య మా మిత్రులతో కలిసి భద్రాచలం వెళ్లాం. అక్కడ ప్రసాదం తినే ముందు సీఎం చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన కల్తీ లడ్డూ ప్రకటన గుర్తుచేసుకొని బాధపడ్డాం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదుగురితో ఏర్పాటు చేసిన బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులకు బదులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే బావుంటుంది. సిట్ విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించాలి. – జీవీఎన్ సంజయ్, సాఫ్ట్ వేర్ ఆపరేషన్ మేనేజర్ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. తెలిసితెలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటే వారికి మామూలుగా పాపం అంటదు. వంద రోజుల ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్తీ లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తిరుమల రాకుండా మతం రంగు పులిమి అడ్డు తగిలారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది. –దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు, ఎంపీపీ, భీమిలిచంద్రబాబు ప్రకటన ఆవేదనకు గురిచేసింది నేను మూడేళ్ల నుంచి తిరుమల వెంకటరమణమూర్తి గోవింద మాల వేస్తున్నాను. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేశారనే చంద్రబాబు ప్రకటన చాలా ఆవేదనకు గురిచేసింది. ఆధారం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా బహిరంగ ప్రకటన చేశారని చంద్రబాబును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన తర్వాత కాస్త మనసు కుదుటపడింది. దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీది తప్పని తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. – మజ్జి రవికుమార్, తిరుమల గోవింద మాలధారుడుచంద్రబాబును బహిష్కరించాలి హిందూ ధర్మ పరిరక్షణే మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ మెజార్టీ హిందువుల ఓట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాయితీగా దర్యాప్తు చేయాలలి– వాసు, జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ఫైవ్మెన్ కమిటీని స్వాగతిస్తున్నా.. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం. విచారణకు సంబంధించి ఫైవ్‌మెన్ కమిటీతో నిజాలు బయటపడతాయన్న ఆశ ఉంది. కోట్లాది మంది హిందువులు..శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ దెబ్బతీశారు. సనాతన ధర్మం కోసం పవన్‌కల్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. – వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్తశివుడు కూడా సహించడు తిరుపతి వెంకన్న లడ్డూ్డ అంటే అది దివ్యప్రపాదం. ఒకసారి స్వామికి నివేదించాక అది అమృతం కన్నా గొప్పది. దేవతలు మనంపెట్టే నైవేద్యాలను ఆఘ్రాణ రూపంగా ఆరగిస్తారని శా్రస్తాలు చెపుతాయి. అటువంటి గొప్ప ప్రసాదం మీద కల్తీ అనే అపవాదు వ్యాపింపజేయడం గొప్ప అపచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమయోచితంగా స్పందించింది. పరమ పవిత్రమైన లడ్డూపై జరిగిన దు్రష్పచారాన్ని చంద్రచూడుడు (శివుడు) మాత్రం సహిస్తాడా?? – బులుసు వేంకటేశ్వర్లు, ప్రముఖ పద్యకవి, తగరపువలసబాబు ఆరోపణలు తగవు తిరుమల లడ్డూ విషయంలో వైఎస్సార్ సీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆది నుంచి కోరింది. సుప్రీంకోర్టు కూడా ఫైవ్‌మెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. – గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ నగర మేయర్నిజం నిగ్గు తేలుతుంది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై హిందువులెవరికీ నమ్మకం లేదు. ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను యావత్ హిందువులు స్వాగతిస్తున్నారు. మాపార్టీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సు్రíపీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ


