సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డవలప్‌మెంట్ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్‌ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది.
తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన సంచలన రిపోర్ట్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు చెంపపెట్టులా మారింది. చంద్రబాబు, పవన్‌లు చేసింది తప్పుడు ప్రచారమేనని నిర్థారణ అయ్యింది. సీబీఐ రిపోర్ట్‌తో చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు, పవన్.. రాజకీయ దురుద్ధేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.
తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మతిరిగేలా సీబీఐ నివేదిక ఇచ్చింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్‌లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్‌డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది.


