తాడేపల్లి : ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలియజేశారు వైఎస్ జగన్. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు వైఎస్ జగన్.
‘సాహిత్య రంగంలో జాతీయ స్థాయి అత్యున్నతమైన పురస్కారం లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారు. తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. నందిని సిధారెడ్డిగారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం, వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం’ అని ప్రశంసించారు.

ఇదీ చదవండి:


